రిలయన్స్ జియో మరో సరికొత్త ఆఫర్ jio ఫైబర్ ₹399కే కొత్త ప్లాన్ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. జియోఫైబర్ బ్రాండ్‌బాండ్‌కు సంబంధించి కొత్త ప్లాన్లను ప్రకటించింది. ఇకపై నెలవారీ ప్లాన్లను రూ.399 నుంచే ప్రారంభమవుతాయని తెలిపింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ ప్లాన్లు అందుబాటులోకి రానుందని రిలయన్స్ జియో ఓ ప్రకటనలో తెలిపరిలయన్స్ జియో అందిస్తున్న అతి చౌకైన నెలవారీ బ్రాడ్‌బాండ్ ప్లాన్ రూ.399 కింద డేటా వేగం (డౌన్‌లోడ్, అప్‌లోడ్) 30ఎంబీపీఎస్‌గా ఉండనుంది
రిలయన్స్ జియో మరో సరికొత్త ఆఫర్ jio ఫైబర్ ₹399కే కొత్త ప్లాన్ నెలరోజుల ఫ్రీ ట్రయల్
డేటా వేగంపై ఎలాంటి పరిమితీ ఉండబోదని రిలయన్స్ పేర్కొంది. గతంలో నిర్ధేశించిన పరిమితి దాటిన తర్వాత వేగం 1ఎంబీపీఎస్‌కు పడిపోయేది. ఈ ప్లాన్‌లో ఉచిత కాల్స్ లభిస్తాయి. అలాగే రూ.999 పేరిట ప్రకటించిన మరో ప్లాన్‌లో 150 ఎంబీపీఎస్ వేగంతో డేటా లభిస్తుంది. 11 ఓటీటీ యాప్స్‌ను ప్లాన్‌లో భాగంగా అందిస్తున్నారు. దీనిలో అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్‌స్టార్, జీ5, సోని లివ్ వంటివి అందిస్తున్నారు. రూ.1499 ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్ కూడా ఉచితంగా అందిస్తున్నారు. ఈ ప్లాన్‌లో 300 ఎంబీపీఎస్ వరకు డేటా స్పీడ్ లభిస్తుందని కంపెనీ తెలిపింది
కొత్త వినియోగదారులను ఆకట్టుకునేందుకు జియో ఫైబర్ నెలరోజుల ఫ్రీ ట్రయల్‌ను అందిస్తోంది. 150ఎంబీపీఎస్ వేగంతో 10 ఓటీటీ యాప్స్‌ను ఇందులో భాగంగా అందిస్తున్నారు. ఆగస్టు 15 నుంచి 31 మధ్య జియో ఫైబర్ కనెక్షన్ తీసుకున్న వినియోగదారులకు ఈ ఫ్రీ ట్రయల్ ప్రయోజనాలు అందుతాయని జియో తెలిపింది.
ట్రయల్ పూర్తైన తర్వాత ఒకవేళ కనెక్షన్ వద్దనుకుంటే ఎలాంటి ప్రశ్నలూ అడగబోమని రిలయన్స్ జియో పేర్కొంటోంది. ఇప్పటికే జియో ఫైబర్ కనెక్షన్ ఉన్న కస్టమర్లు కొత్త ప్లాన్లకు ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడ్ అవుతారని జియో పేర్కొంది. జియో ఫైబర్‌ను ప్రతి ఇంటికీ చేర్చాలన్న లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రపంచంలో భారత దేశం అతిపెద్ద బ్రాడ్‌బాండ్ లీడర్‌గా అవతరలించాలన్నదే లక్ష్యమని జియో డైరెక్టర్ ఆకాశ్ అంబానీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1600 నగరాలు, పట్టణాల్లో జియో ఫైబర్ సేవలు అందుతున్నాయని తెలిపారు.
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.