సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు భారత్ మరోసారి షాక్ ఇచ్చింది. డ్రాగన్ దేశానికి చెందిన మరో 118 మొబైల్ యాప్‌లపై నిషేధం విధించింది
చైనాకు మరో షాక్ పబ్జీపై కేంద్రం నిషేధం మొత్తం 118 యాప్‌లపై నిషేధం
వీటిలో పబ్‌జీ, క్యామ్ కార్డ్, బైడు, కట్‌కట్ సహా మొత్తం 118 యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ వెల్లడించింది. గతంలో గల్వాన్ లోయ వద్ద ఘర్షణల సమయంలో దేశ భద్రత, రక్షణ దృష్ట్యా టిక్‌టాక్ సహా అనేక యాప్‌లపై కేంద్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ నిషేధం విధిస్తూ గతంలో ఉత్తర్వులు జారీ చేసిన విషయంతెలిసిందే.
మళ్లీ తాజాగా ఉద్రిక్తతల నేపథ్యంలో మరికొన్ని చైనా యాప్‌లపై కేంద్రం వేటు వేసింది. పబ్జీ, పబ్జీ లైట్ యాప్‌లను ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్లకు పైగా వినియోగదారులు వాడుతున్నారు. మన దేశంలో 50 మిలియన్ల మందికి పైగా వినియోగిస్తున్నారు.
కేంద్రం నిషేధించిన యాప్‌లు ఇవే చూడండి క్లిక్ చేయండి
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.