Friday, 18 September 2020

AP teachers బదిలీలకు , రేషనలైజేషన్ కు సంబంధించి మూడు అప్లికేషన్స్ పై వివరణ

AP teachers బదిలీలకు , రేషనలైజేషన్ కు సంబంధించి మూడు అప్లికేషన్స్ పై వివరణ

AP teachers బదిలీలకు , రేషనలైజేషన్ కు సంబంధించి మూడు అప్లికేషన్స్ పై వివరణ AP CSE  లో నిన్న మొన్న  జరిగిన DEO  కార్యాలయముల నుండి వచ్చిన  అధికారులకు రేషన్ లైజేషన్, ఖాళీల  ప్రదర్శన పై ఇచ్చిన   సూచనల ఆధారంగా బదిలీలు, రేషనలైజేషన్ లపై పూర్తి సమాచారం

 

AP teachers బదిలీలకు , రేషనలైజేషన్ కు సంబంధించి మూడు అప్లికేషన్స్ పై వివరణ 

 బదిలీలకు , రేషనలైజేషన్ కు సంబంధించి మూడు అప్లికేషన్స్ ఆన్లైన్లో ఇవ్వబోతున్నారు


  • మాస్టర్ అప్లికేషన్
  •  వేకెన్సీ అప్లికేషన్
  •  టీచర్స్ అప్లికేషన్

మాస్టర్ అప్లికేషన్లో టీచర్స్ అందరూ వారి డిడిఓ లాగిన్ లో వారి యొక్క పూర్తి వివరములను అప్లోడ్ చేయవలెను.

 వేకెన్సీ అప్లికేషన్లో జిల్లా స్థాయిలో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం నుండి అన్ని రకాల ఖాళీలను అప్లోడ్ చేయవలెను, అనగా క్లియర్ వేకెన్సీ లు, రేషనలైజేషన్ వేకెన్సీ లు , 8 ఇయర్స్ వేకెన్సీ లు గైర్హాజర్ వేకెన్సీ లు  అప్లోడ్ చెయ్యాలి. అయితే పదోన్నతి, ఉన్నతీకరణ పోస్ట్ ప్లేసెస్ ను వేకెన్సీ గా చూపించరాదు. ఖాళీలను మొత్తము పనిచేస్తున్న టీచర్స్ ఎంత మంది ఉంటారో అన్ని ఖాళీ లను మాత్రమే అప్లోడ్ చెయ్యాలి. మిగిలినవి 1, 2, 3 కేటగిరి లో సమానముగా బ్లాక్ చెయ్యాలి.

టీచర్ అప్లికేషన్ లో బదిలీలకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ లో టీచర్స్ వారి వివరములను పొందు పరచవలెను.

 PD పోస్టులో Against గా  పనిచేయుచున్న పీఈటీలు ను కదిలించ రాదు, అయితే ఎస్ జి టి పోస్ట్ లో against   గా పని చేయుచున్న PET  మరియు లాంగ్వేజ్ పండితులను అప్పర్ ప్రైమరీ స్కూల్ నందు ఒక SGT పోస్ట్ నందు నియమించి అక్కడ ఉండి వారికి జీతము డ్రా చేయవలెను.

 తరువాత రేషనలైజేషన్ గురించి LFL పోస్ట్ ను కదిలించరాదు , దానికి బదులుగా SGT పోస్టును షిఫ్టింగ్ చెయ్యాలి.

 150 రోల్ ఉన్న ప్రాధమిక పాఠశాలకు LFL పోస్ట్ ఇవ్వాలి. వీటి కొరకు ఖాళీగా ఉన్న LFL పోస్టును లిఫ్ట్ చెయ్యాలి.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.