సంజు రాణి వర్మ ఏడేళ్ల క్రితం ఇంట్లో వాళ్లు పెళ్లి చేస్తుంటే వద్దని పారిపోయింది. కట్ చేస్తే కలెక్టర్‌గా తిరిగి ఇంటికి వెళ్లింది. అంతేకాదు ఇప్పుడు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. ఇదేదో సినిమా కథ కాదు. నిజంగా జరిగిన సంఘటనే వివరాల్లోకి వెళ్తే మీరట్‌కు చెందిన సంజు రాణి వర్మ(28) తల్లి 2013లో కన్నుమూశారు. దాంతో ఆమె చదువును మానిపించిన తండ్రి పెళ్లి చేయాలనుకున్నారు. దానికి ససేమిరా అన్న సంజు
పెళ్ళి వద్దని పారిపోయి IAS గా తిరిగొచ్చింది
కుటుంబ సభ్యులను వ్యతిరేకించి పారిపోయింది ఇక అప్పటికే డిగ్రీ పూర్తి చేసిన సంజు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పీజీ చేసింది. ఆ తరువాత యూపీఎస్సీ పరీక్షలు రాసింది ఇక ఇటీవల విడుదలైన ఫలితాల్లో ర్యాంక్ సాధించి కలెక్టర్‌గా ఎంపికైంది
అయితే ఇంటి నుంచి బయటికి వచ్చిన తరువాత సంజు తన ఖర్చుల కోసం ట్యూషన్లు చెప్పారు ప్రైవేట్ ఉద్యోగం చేసింది ఏడేండ్ల పాటు కష్టపడి చదివి అనుకున్నది సాధించింది దీనిపై మాట్లాడిన సంజు రాణి 'ఇంటిని విడిచివెళ్లినప్పుడు అందరూ చాలా కోప్పడ్డారు అయితే అప్పుడు తిట్టిన వారే ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. యూపీఎస్సీ అధికారి కావడం చాలా సంతోషంగా ఉంది. కుటుంబం పట్ల నా బాధ్యత ఏంటో తెలుసు నా కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆధరిస్తా.
అమ్మాయిలను చదువుకోనివ్వకుండా పెళ్లి పేరుతో ఒత్తిళ్లు చేయడం మానుకోవాలి వారి స్వేచ్ఛను వారికిచ్చినప్పుడే భవిష్యత్ బావుంటుందని నమ్ముతా' అని చెప్పారు.
తనలాగే అందరూ ఉన్నత విద్య చదువుకుని వారి వారి కలలను నిజం చేసుకోవాలి అని రాణి యువతకు సందేశమిస్తున్నారు.
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.