AP జగనన్న విద్యా కానుక వారోత్సవాలు నిర్వహణ కొరకు- జిల్లా విద్యా శాఖాధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లకు మార్గదర్శకాలు: AP పాఠశాల విద్యాశాఖ జగనన్న విద్యా కానుక వారోత్సవాలు' నిర్వహణ కొరకు- జిల్లా విద్యా శాఖాధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లకు మార్గదర్శకాలు- జారీ నిర్దేశం as per ఆర్.సి.నం. Spl/JVK/2020 తేది: 16,11.2020
AP జగనన్న విద్యా కానుక వారోత్సవాలు నిర్వహణ కొరకు- జిల్లా విద్యా శాఖాధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లకు మార్గదర్శకాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జగనన్న విద్యాకానుక' పథకంలో భాగంగా 2020-21 విద్యా సంవత్సరానికి అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న అందరు విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది
ఇందులో భాగంగా ఒక్కో మూడు జతల యూనిఫాం, ఒక సెట్ నోటు పుస్తకాలు, పాఠ్య ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, 3 మాస్కులతో పాటు కిట్ రూపంలో అందించడం జరిగింది
వచ్చే విద్యా పాఠశాలలు తెరిచే నాటికే 'జగనన్న విద్యాకానుక' పథకం మరింత మెరుగైన ప్రణాళికతో ఇవ్వాలని ప్రభుత్వం నిశ్చయించింది
ఇందులో భాగంగా 'జగనన్న విద్యాకానుక' వారోత్సవాలు నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించింది
ప్రస్తుత పథకానికి సంబంధించి అన్ని వస్తువుల నాణ్యత, పంపిణీ విధానాన్ని పరిశీలించడం, ఇందులో ఎదురైనటువంటి చిన్నచిన్న లోపాలను సరిదిద్దుకోవడం వీటన్నింటిని అధిగమిస్తూ వచ్చే విద్యా సంవత్సరంలో మరింత పక్కా ప్రణాళికతో 'జగనన్న విద్యా కానుక' కిట్లను సరఫరా చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకోవడం 'జగనన్న విద్యాకానుక' వారోత్సవాల ముఖ్యోద్దేశ్యం.
ఇందులో భాగంగా నవంబరు 23 నుంచి నవంబరు 28 వరకు వారం రోజులు పాటు అన్ని పాఠశాలల్లో 'జగనన్న విద్యా కానుక' వారోత్సవాలు నిర్వహించాలి
ఈ వారం రోజులలో కుట్టు కూలీ ఇవ్వవలసిన పిల్లలకు బయోమెట్రిక్ అథంటికేషన్ అయిన వెంటనే కుట్టు కూలీ డబ్బులు వేయడం సులభమవుతుంది. కాబట్టి ఆ పని పూర్తి చేయాలి
విద్యార్థుల యూనిఫాం కుట్టు కూలీ నిమిత్తం 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు జతకు రూ. 40 చొప్పున 3 జతలకు రూ. 120లు, 9.10 తరగతుల విద్యార్థులకు జతకు రూ.80 చొప్పున 3 జతలకు రూ.240లు నగదును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం అందిస్తుందన్న విషయాన్ని విద్యార్థులకు, వారి ద్వారా తల్లిదండ్రులకు తెలియజేయాలి.
హెచ్ఎం లాగిన్లలో పిల్లల కుట్టుకూలీ జమకాని పిల్లల తల్లుల ఆధార్ డేటాను వెరిఫికేషన్ చేయాలి. వివరాలు తప్పుగా ఉంటే కుట్టు కూలీ జమ కాదు అంతేకాకుండా బూట్లు సైజులు విషయంలో, మార్పు చేయడం వంటి సమస్యలను
పరిష్కరించడం మొదలైన అంశాలు పూర్తి చేయడం జిల్లా అధికారులు ఆ సమస్యలను పరిష్కరించే దిశగా చొరవ చూపాలి. బూట్లు, బ్యాగులు మార్పిడికి సంబంధించి ఆయా జిల్లాల్లో సరఫరాదారులకు చెందిన ఏజెంట్ల నంబర్లను 'ఆర్.సి.నం. SS-16021/8/2020- MIS SEC - SSA, dt: 23.10.2020 ద్వారా ఆదేశాలు ఇవ్వడమైనది. వారిని సంప్రదించి పరిష్కారం చేయాలి.
వీటితో పాటు వచ్చే విద్యా సంవత్సరంలో మరింత 'జగనన్న విద్యా కానుక' కార్యక్రమం నిర్వహించడం కోసం ప్రతి పాఠశాలలో ఈసారి గమనించిన సమస్యలు, లోటుపాట్లు పరిష్కారాలు, సూచనలు, సలహాల నివేదిక రూపంలో జిల్లా అధికారికి అందజేయాలి జిల్లా అధికారులు రాష్ట్ర కార్యాలయానికి నివేదిక పంపించాలి
Get Download Complete Information at
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.