7th Pay Commission పెన్షన్ విధానంలో మార్పులు పెరిగిన ఫ్యామిలీ పెన్షన్ లిమిట్ మరణించిన ఉద్యోగుల పిల్లలు లేదా తల్లిదండ్రులు రెండు పెన్షన్లను పొందేందుకు అర్హత
7th Pay Commission పెన్షన్ విధానంలో మార్పులు పెరిగిన ఫ్యామిలీ పెన్షన్ లిమిట్
భార్యాభర్తలిద్దరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులై, సిసిఎస్ (పెన్షన్) 1972 పరిధిలో ఉంటే.. వారి మరణానంతరం వారసులు రెండు పెన్షన్లను పొందే అవకాశం కల్పించింది. ఇకపై రెండు పెన్షన్ల నుంచి వారసులు గరిష్టంగా ప్రతి నెలా రూ. 1.25 లక్షల వరకు పొందవచ్చు.
సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్ 1972 లోని రూల్ 54, సబ్-రూల్ (11) ప్రకారం మరణించిన ఉద్యోగుల పిల్లలు లేదా తల్లిదండ్రులు రెండు పెన్షన్లను పొందేందుకు అర్హత ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
తల్లిదండ్రుల్లో ఒకరు సర్వీసులో ఉన్నప్పుడు లేదా రిటైర్మెంట్ తరువాత మరణిస్తే, వారికి సంబంధించిన ఫ్యామిలీ పెన్షన్‌ను.. బతికున్న భర్త లేదా భార్యకు చెల్లిస్తారు. అయితే ఉద్యోగులైన భార్యాభర్తలిద్దరూ మరణిస్తే, వారి వారసులు రెండు ఫ్యామిలీ పెన్షన్లను మంజూరు చేయవచ్చని 7వ వేతన సంఘం సిఫార్సు చేసింది
కొత్త పెన్షన్ రూల్స్
ఏడవ వేతన సవరణ సంఘం సిఫార్సుల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల అత్యధిక వేతనాన్ని రూ. 2,50,000గా నిర్ణయించారు. అందువల్ల, రెండు పెన్షన్ పరిమితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, ఈ రెండు ఫ్యామిలీ పెన్షన్ పరిమితులను నెలకు రూ .75,000 నుంచి రూ .1.25 లక్షలకు పెంచింది కేంద్ర ప్రభుత్వం.
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.