ఏపీలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేసినట్లు జగన్ సర్కార్ ప్రకటించింది. జూలైలో మరోసారి సమీక్ష జరిపి.. అప్పటి పరిస్థితుల బట్టి పరీక్షలపై తుది నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వాస్తవానికి పదో తరగతి పరీక్షలు జూన్ 7 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటిదాకా షెడ్యూల్ ప్రకారమే పరీక్షలను నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతూ వచ్చినా. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో తాజాగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఏపీ లో పదవ తరగతి పరీక్షలు వాయిదా
ఇదిలా ఉంటే టెన్త్ పరీక్షలపై హైకోర్టు విచారణ చేపట్టగా ప్రభుత్వాన్ని వివరణ కోరింది. దీనితో పది పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం న్యాయస్థానానికి వివరించింది.
పదవ తరగతి పరీక్షలు వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం .
జూలైలో మరోసారి సమీక్షించిన తర్వాత నిర్ణయం లిఖితపూర్వకంగా తెలపాలని ప్రభుత్వం ఆదేశించిన హైకోర్టు.
స్కూలు తెరిచే ఆలోచన కూడా లేదన్న ఏపీ ప్రభుత్వం.
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.