Thursday, 17 June 2021

సీబీఎస్ఈ ఫలితాలకు 30:30:40 ఫార్ములా

సీబీఎస్ఈ ఫలితాలకు 30:30:40 ఫార్ములా

సీబీఎస్ఈ ఫలితాల విడుదలకు 30:30:40 ఫార్ములా నేడు సుప్రీం ముందుకు నివేదిక | CBSE Results following Formula 30:30:40 | 10, 11 తరగతుల్లో మార్కులు, 12వ తరగతిలో ఇంటర్నల్స్ మార్కుల ఆధారంగా వార్షిక ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) ప్రకటించే అవకాశం | సీబీఎస్ఈ ఫలితాలకు పది, పదకొండు తరగతుల్లోని మార్కులకు 30% చొప్పున 2020-21లో నిర్వహించిన 12వ తరగతి ఇంటర్నల్ పరీక్షలకు 40% వెయిటేజీ ఇచ్చి ఫలితాలను నిర్ణయిస్తారు


సీబీఎస్ఈ ఫలితాలకు 30:30:40 ఫార్ములా


హైదరాబాద్, ముంబై, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): పన్నెండో తరగతి ఫలితాలను సీబీఎస్ఈ ఏ విధంగా ప్రకటిస్తుందో? అని అటు విద్యార్థులు ఇటు తల్లిదం డ్రులు ఎదురు చూస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు ముందుకు ఓ ఫార్ములాకు సంబంధించిన నివేదిక గురువారం(నేడు) వెళ్లనుందని చెబుతున్నారు. 




10, 11 తరగతుల్లో మార్కులు, 12వ తరగతిలో ఇంటర్నల్స్ మార్కుల ఆధారంగా వార్షిక ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) ప్రక టించే అవకాశం ఉంది. 

దీనికోసం నియమించిన 13మంది సభ్యుల కమిటీ 30:30:40 ఫార్ములాకు అను కూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం పది, పదకొండు తరగతుల్లోని మార్కులకు 30% చొప్పున 2020-21లో నిర్వహించిన 12వ తరగతి ఇంటర్నల్ పరీక్షలకు 40% వెయిటేజీ ఇచ్చి ఫలితాలను నిర్ణయిస్తారు. 

ఫార్ములాకు సంబంధించిన నివేదికను గురు వారంనాడు సుప్రీంకోర్టుకు కమిటీ సమర్పిస్తుందని తర్వాత నిర్ణయం ప్రకటిస్తుందని సమాచారం.


CBSE RESULTS Official website


0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.