పీఎఫ్ ఖాతా నుంచి 75 శాతం తీసుకోవచ్చు ఉద్యోగం కోల్పోయి నెల దాటినవారికి అవకాశం - EPFO
పీఎఫ్ ఖాతా నుంచి 75 శాతం తీసుకోవచ్చు ఉద్యోగం కోల్పోయి నెల దాటినవారికి అవకాశం
న్యూఢిల్లీ, జూన్ 20: ఒక నెల, అంతకంటే ఎక్కువ రోజులు నిరుద్యోగిగా ఉన్నవారు తమ పీఎఫ్ ఖాతా సొమ్ములో 75ు వరకు అడ్వాన్స్‌గా తీసుకునే అవకాశాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(EPFO) కల్పించింది. ఈ అడ్వాన్స్‌ను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే వారి ఈపీఎఫ్ ఖాతాలు క్లోజ్ చేయనందున వారి పెన్షన్ సభ్యత్వా న్ని కొనసాగించుకునే అవకాశాన్నీ ఈపీఎ్‌ఫవో కల్పించింది.
నిరుద్యోగిగా ఉన్నప్పుడు వారికి ఈ అవకాశం ఆర్థికంగా సహాయపడుతుందని ఈపీఎ్‌ఫవో తెలిపింది. కరోనా కష్ట కాలంలో పీఎఫ్ ఖాతా నుంచి కొవిడ్ అడ్వాన్స్ తీసుకునేందు కు ఈపీఎఫ్‌వో ఇప్పటికే అవకాశం కల్పించింది. కరోనా తొలి దశలో అడ్వాన్స్ తీసుకున్నవారికీ.. కరోనా రెండో దశలోనూ రెండో అడ్వాన్స్ తీసుకునే అవకాశం కల్పించింది.
ఈ అడ్వాన్సును కూడా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. కొవిడ్ అడ్వాన్సును 3 నెలల బేసిక్, డీఏ లేదా ఖాతాలోని సొమ్ములో 75 (ఏది తక్కువైతే అది) ఇస్తారు. కాగా, ఉద్యోగం వీడినప్పటికీ ఈపీఎఫ్ ఫైనల్ విత్‌డ్రా పూర్తి కాని సభ్యులూ కొవిడ్ అడ్వాన్సు సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని EPFO తెలిపింది. అలాగే పీఎఫ్ ఖాతాదారు కొవిడ్ వల్ల లేదా మరే కారణంతో మరణిస్తే ఈడీఎల్ ఐ(ఎంప్లాయీస్ డిపాజిట్ లిం క్‌డ్ ఇన్సూరెన్స్)లో భాగంగా వారి కుటుంబానికి రూ.2.5-7 లక్షలు లభిస్తాయని ఈపీఎ్‌ఫవో తెలిపింది.
కొవిడ్ వల్ల చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి ఈఎ్‌సఐసీ పథకం కింద జీతం పరిహారం, అంత్యక్రియల ఖర్చులు చెల్లిస్తారు.
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.