AP EAPCET 2021 షెడ్యూల్ విడుదల ఈ నెల 24న నోటిఫికేషన్ విడుదల ఈ నెల 26 నుంచి జూలై 25 వరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు ఆగష్టు 19 నుంచి 25 వరకు EMCET/EAPCET (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా) పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తారు
AP EAPCET 2021 షెడ్యూల్ విడుదల
ఏపీ EAPCET(గతంలో ఎంసెట్) షెడ్యూల్ను మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఈ నెల 24న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా ఈ నెల 26 నుంచి జూలై 25 వరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.
ఆగష్టు 19 నుంచి 25 వరకు EAPCET(ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా) పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తామని మంత్రి చెప్పారు.
ఏపీలో ఎంసెట్ పేరు మార్పు ఈ నెల 24న నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ షెడ్యూల్ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఎంసెట్ పేరును ఈఏపీ సెట్ (EAPCET-2021 Engineering, Agriculture and Pharmacy Common Entrance Test) గా మార్చుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్టుగా ఈఏపీ సెట్‌ను నిర్వహిస్తామని వెల్లడించారు. ఈనెల 24న నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని, జులై 25 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని వివరించారు. ఆగస్టు 19 నుంచి 25 వరకు ఎంసెట్ నిర్వహిస్తామని మంత్రి సురేష్ తెలిపారు.
నోటిఫికేషన్ వివరాలు
● జూన్ 24న నోటిఫికేషన్ విడుదల
● జూన్ 26 నుంచి జూలై 25 వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ల స్వీకరణ
● జూలై 26 నుంచి ఆగస్ట్ 5 వరకు 500 లేట్ ఫీజుతో అప్లికేషన్ల స్వీకరణ
● అగస్ట్ 6 నుంచి 10 వరకు 1000 రుపాయిల లేట్ ఫీజుతో అప్లికేషన్ల స్వీకరణ
● అగస్టు 11 నుంచి 15 వరకు 5 వేల రుపాయలు లేట్ ఫీజుతో అప్లికేషన్ల స్వీకరణ
● అగస్టు 16 నుంచి 18 వరకు 10 వేల రుపాయిలు లేట్ ఫీజుతో అప్లికేషన్ల స్వీకరణ
● ఆగస్ట్ 19 నుంచి 25 వరకు ఈఏపీ సెట్ పరీక్షలు
ఇదిలా ఉంటే.. ఈసెట్, ఐసెట్, పీజీ సెట్, లాసెట్, ఎడ్‌సెట్, పీసెట్, ఎంట్రెన్స్ టెస్ట్‌లను సెప్టెంబర్ మొదటి వారం లేదా రెండో వారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కరోనా నేపథ్యంలో ఎక్కువ సెంటర్లలో పరీక్షలను నిర్వహిస్తున్నట్లు మంత్రి అన్నారు.
More Information About AP EAMCET 2021 Notification Scheduled dates and more - Click here
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.