Monday, 28 June 2021

AP Integrated Educational Rules -1966 Rules and regulations in school management

AP Integrated Educational Rules -1966 Rules and regulations in school management

AP Integrated Educational Rules -1966 Rules and regulations in school management | ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటేడ్ ఎడ్యుకేషనల్  రూల్స్-1966 పాఠశాల నిర్వహణలోని నిబంధనలు ఉత్తర్వులు (ANDHRA PRADESH INTIGRATED EDUCATIONAL RULES-1966)


AP Integrated Educational Rules -1966 Rules and regulations in school management


ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటేడ్ ఎడ్యుకేషనల్  రూల్స్-1966 పాఠశాల నిర్వహణలోని నిబంధనలు ఉత్తర్వులోని - కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం




Andhra Pradesh Integrated Educational Rules -1966 Rules and regulations in school management in below 


AP Integrated Educational Rules -46(A):


ప్రవేశ సం॥లో ఆగస్టు-31 నాటికి 5సం॥(5+) వయస్సు కలిగియున్న విద్యార్ధులను ఒకటో తరగతిలో చేర్చుకోవాలి.


AP Integrated Educational Rules -46(B):


అనుబంధం 10 ప్రవేశ దరఖాస్తు ద్వారా పాఠశాలలో విద్యార్ధులను చేర్చుకోవాలి.


AP Integrated Educational Rules - 42(C):


ఒక విద్యా సం॥లో పాఠశాల ఖచ్చితంగా 220 పనిదినాలు కలిగియుండాలి.


AP Integrated Educational Rules -46(J):


పాఠశాలను విడిచి వేరొక పాఠశాలకు పోవునపుడు ,వేరొక పాఠశాల నుండి ఈ పాఠశాలలో చేరినపుడు రికార్డు షీటు నిర్వహించాలి.


AP Integrated Educational Rules -45:


ఒక నెలరోజులు దాటిననూ,సెలవు లేకుండా పాఠశాలకు హాజరుకాని విద్యార్ధులను పాఠశాల రోలు నుండి తొలగించవచ్చును.


AP Integrated Educational Rules -35:


విద్యార్ధుల హాజరును,ఉదయము, మధ్యాహ్నం మొదటి పీరియడ్ ఆఖరున పుర్తిచేయాలి.


AP Integrated Educational Rules - 123(B):


ఉపాధ్యాయుల హాజరుపట్టిని అనుబంధం-4 ఫారాలున్న పేజీలనువాడాలి.


AP Integrated Educational Rules -33


ప్రధానోపాధ్యాయులు విద్యా సం॥ ప్రారంభంలోనే పాఠశాల సిబ్బంది యొక్క రోజువారీ కార్యక్రమాలను "జనరల్ టైం టేబుల్" ద్వారా తెలియజేయాలి.ఆఫీస్ రూంలోనూ,ప్రతి తరగతి గదులోనూ టైం టేబుల్ ను వ్రేలాడదీయాలి.


Rc.No.527/E2/97,Dt:16-07-1997:


పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సహోపాధ్యాయులు, ఇతర సిబ్బంది తప్పనిసరిగా అసెంబ్లీ (Prayer) కు హాజరుకావాలి. లేట్ పర్మిషన్లు ఉపాధ్యాయులకు వర్తించవు.


AP Integrated Educational Rules - 77


ప్రతి ఉపాధ్యాయునికి కనీసం 24 పీరియడ్లు కేటాయించాలి


AP Integrated Educational Rules - 99:


విదేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి T.C పై ప్రవేశము కోరు విద్యార్థులు వారు చేరే జిల్లా విద్యాశాఖాధికారి గారి కౌంటర్ సిగ్నిచర్ విధిగా ఉండవలెను.


 AP Integrated Educational Rules -124(A):


అడ్మిషన్ రిజిస్టరుకు ప్రతి పేజీకి నెంబరు తప్పనిసరిగా వేయాలి. సీరియల్ నెంబరును చిన్న స్కూళ్లకు 5 సంవత్సరముల కు ఒకసారి, పెద్ద స్కూళ్లకు 3 సంవత్సరములకు ఒకసారి సంఖ్య పెద్దదై అసౌకర్యముగా ఉంటే మార్చుకోవాలి.


ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్కు స్థానికత ఆధారంగా  లోకల్ / నాన్ లోకల్ నిర్ణయించు విధానం:


స్కూల్ స్టడీ 7 సంవత్సరములలో ఏ జిల్లాలో ఎక్కువ కాలం చదివితే దానినిబట్టి లోకల్,నాన్ లోకల్ నిర్ణయిస్తారు.

ఒక వ్యక్తి 10వ తరగతి వరకు వేరే జిల్లాలో చదివితే అతను సొంత జిల్లాలో నాన్ లోకల్ గా పరిగణించబడతారు

ఎక్కడా చదవకుండా ప్రయివేటుగా పరీక్ష వ్రాస్తే ఎక్కడ నివాస సర్టిఫికెట్ చూపిస్తే ఆ జిల్లాకు లోకల్ అవుతారు.

2 లేదా 3 జిల్లాల్లో చదివితే 7 సంవత్సరాలలో ఎక్కువ కాలం ఏ జిల్లాలో ఉంటే అదే లోకల్ అవుతుంది.

రెండు జిల్లాలోనూ సమానంగా 3+3 ఉంటే చివరి 3 సంవత్సరాలు చదివిన జిల్లాయే లోకల్ అవుతుంది.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.