AP Vaccine Drive లో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ ఒక్కరోజులోనే రాష్ట్రంలో 11 లక్షలమందికి వ్యాక్సిన్ అందింది | AP Vaccine Drive లో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ జరిగింది వ్యాక్సిన్ డ్రైవ్‌కు అనూహ్య స్పందన రావడంతో ప్రభుత్వం నిర్దేశిత లక్ష్యాన్ని దాటి వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగింది ఒక్కరోజులోనే రాష్ట్రంలో 11 లక్షలమందికి వ్యాక్సిన్ అందింది
AP Vaccine Drive లో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ ఒక్కరోజులోనే రాష్ట్రంలో 11 లక్షలమందికి వ్యాక్సిన్ అందింది
కరోనా మహమ్మారి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఓ వైపు కర్ఫ్యూ అమలు చేస్తూనే మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. నిన్న రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టింది. గతంలో ఒకేరోజు 6 లక్షలకు పైగా వ్యాక్సిన్లను రెండుసార్లు చేసి రికార్డు సాధించిన ఏపీ ప్రభుత్వం ఈసారి 8 లక్షల వ్యాక్సిన్లు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకుంది. నిన్న ఉదయం రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టింది.
అయితే ప్రజల్నించి విశేషంగా స్పందన లభించడంతో టార్గెట్‌ను మించి వ్యాక్సినేషన్ (Vaccination) కొనసాగింది ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకూ జరిగిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో 10.93 లక్షల మంది అంటే దాదాపుగా 11 లక్షలమందికి వ్యాక్సిన్ అందింది.
దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 232 వ్యాక్సిన్ కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. 45 ఏళ్లు దాటినవారికి, ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు వ్యాక్సినేషన్ జరిగింది.
తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1.50 లక్షలమందికి వ్యాక్సిన్ ఇచ్చారు. మరోవైపు గ్రామాల్లో ఫీవర్ సర్వే కొనసాగిస్తోంది. లక్షణాలున్నవారిని గుర్తించి ఆరోగ్య శ్రీ కింద చికిత్స అందిస్తోంది.
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.