ఉన్నత విద్యలో ఏపీ భేష్ పలు రంగాల్లో టాప్; రాష్ట్రాల జాబితాలో ఏపీ
ఉన్నత విద్యలో ఏపీ భేష్ పలు రంగాల్లో టాప్
విద్యార్థుల చేరికలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల సరసన చోటు అత్యధిక ఉన్నత విద్యా సంస్థలు ఉన్న టాప్–8 రాష్ట్రాల్లో ఒకటిగా స్థానం ప్రతి లక్ష మంది జనాభాకు ఏపీలో 51 కాలేజీలు
జాతీయస్థాయిలో ఉన్నత విద్యలో చేరికలు 3.85 కోట్లు ఆలిండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ నివేదిక–2019–20లో వెల్లడి
అమరావతి: ఉన్నత విద్యకు సంబంధించి పలు రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్ రాష్ట్రాల జాబితాలో నిలిచింది.
ఆలిండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏఐఎస్‌హెచ్‌ఈ) 2019–20 నివేదికను కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ గురువారం విడుదల చేశారు.
ఇందులో ఏపీ పలు అంశాల్లో సత్తా చాటింది. దేశంలో అత్యధిక విద్యార్థుల చేరికలున్న టాప్ రాష్ట్రాల్లో ఒకటిగా, అలాగే అత్యధిక ఉన్నత విద్యా సంస్థలున్న టాప్–8 రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది.
మన రాష్ట్రంలో ప్రతి లక్ష మంది జనాభాకు 51 కాలేజీలు ఉన్నాయని నివేదిక వెల్లడించింది
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.