వివరాల నవీకరణతోనే ‘అమ్మఒడి నగదు తల్లుల ఖాతాలోకి అమ్మఒడి నగదు తల్లుల ఖాతాలోకి పడాలి అంటే విలీనమైన బ్యాంకులకు సంబంధించిన ఐఎఫ్‌ఎస్ కోడ్‌లు మార్పులను సదరు కోడ్‌ను అమ్మఒడికి సంబంధించిన ఛైల్డ్ ఇన్ఫో డేటా ద్వారా వెబ్‌సైట్లో అప్‌డేట్ చేయించుకోవలి అలా చెంచుకొని వారికి వచ్చే ఏడాది జనవరిలో పథకానికి సంబంధించిన నగదు జమకాదు విలీనమైన బ్యాంకులకు సంబంధించిన ఐఎఫ్‌ఎస్ కోడ్‌లు మార్పులు సదరు కోడ్‌ను అమ్మఒడికి సంబంధించిన ఛైల్డ్ ఇన్ఫో డేటా ద్వారా వెబ్‌సైట్లో అప్‌డేట్ చేయించుకోని వారికి వచ్చే ఏడాది జనవరిలో పథకానికి సంబంధించిన నగదు జమకాదు.
వివరాల నవీకరణతోనే ‘అమ్మఒడి నగదు తల్లుల ఖాతాలోకి
బ్యాంకింగ్ రంగ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలు బ్యాంకుల విలీన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించింది. ఇలా విలీనమైన బ్యాంకులకు సంబంధించిన ఐఎఫ్‌ఎస్ కోడ్‌లు మారాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అమ్మఒడి పథకం లబ్ధి చేకూరాలంటే మారిన కోడ్‌ల వివరాలను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా బ్యాంకుల ఖాతా సంఖ్యలు మారకున్నా ఐఎఫ్‌ఎస్ కోడ్ మారింది. సదరు కోడ్‌ను అమ్మఒడికి సంబంధించిన వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయించుకోని వారికి వచ్చే ఏడాది జనవరిలో పథకానికి సంబంధించిన నగదు జమకాదు.
అమ్మఒడి నగదు తల్లుల ఖాతాలోకి పడాలి అంటే విలీనమైన బ్యాంకులకు సంబంధించిన ఐఎఫ్‌ఎస్ కోడ్‌లు మార్పులు సదరు కోడ్‌ను అమ్మఒడికి సంబంధించిన ఛైల్డ్ ఇన్ఫో డేటా ద్వారా వెబ్‌సైట్లో అప్‌డేట్ చేయించుకోవలి అలా చెంచుకొని వారికి వచ్చే ఏడాది జనవరిలో పథకానికి సంబంధించిన నగదు జమకాదు
అనర్హుల జాబితాలో 41,809 మంది
అమ్మఒడి పథకం ద్వారా 2020-21 విద్యా సంవత్సరం 3,55,051 మంది తల్లులకు లబ్ధి చేకూరింది. ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 వేల చొప్పున ప్రభుత్వం జమ చేసింది. 2019-20 విద్యా సంవత్సరం 3,39,259 మంది తల్లులు లబ్ధి పొందారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరం 6,33,949 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందగా.. అమ్మఒడి ద్వారా 5,52,783 మందికి ప్రయోజనం కలిగింది. 2019- 20 విద్యా సంవత్సరం 6,18,925 మంది విద్యార్థులు చదవగా వీరిలో 5,45,201 మంది లబ్ధి పొందారు. 2020-21 సంవత్సరానికి సంబంధించి 41,809 మంది విద్యార్థులను పథకానికి అనర్హులుగా ప్రకటించారు. 9,179 మందిని విత్‌హెల్డ్ జాబితాలో ఉంచారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఆరంచెల పరిశీలనలో పలువురు అనర్హులుగా తేలారు. నిబంధనల కంటే ఎక్కువ సొంత భూమి కలిగిన వారు, విద్యుత్తు బిల్లు అధికంగా చెల్లించినవారు, ప్రభుత్వ ఉద్యోగులు తదితర కేటగిరీల వారు ఇందులో ఉన్నారు. అనర్హులుగా గుర్తించిన వారిలో అర్హులు ఎవరైనా ఉంటే ఆరంచెలకు సంబంధించిన అంశాల్లో తాము లేమని తగిన ఆధారాలతో నిరూపించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా బ్యాంకు ఐఎఫ్‌ఎస్ కోడ్ మారినవారు వెబ్‌సైట్‌లో ఆ వివరాలను అప్‌డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది.
మార్చి నెలాఖరు వరకు పాత కోడ్‌లతోనే
విలీనం కావడం ద్వారా పలు బ్యాంకులకు సంబంధించి మారిన ఐఎఫ్‌ఎస్ కోడ్‌లు జులై ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి. మార్చి 31 వరకు పాత కోడ్‌ల ద్వారానే అమ్మఒడి పథకం లబ్ధిని చేకూర్చారు. 2021-22 విద్యా సంవత్సరం ప్రయోజనం పొందాలంటే ఐఎఫ్‌ఎస్ కోడ్‌ను మార్చుకోవడం తప్పనిసరి. ‘చైల్డ్ ఇన్ఫో’ డేటా ప్రకారం లబ్ధిదారులకు సంబంధించిన ఐఎఫ్‌ఎస్ కోడ్‌లు మార్చినట్లు జిల్లా విద్యా శాఖ వర్గాల వారు తెలిపారు.
2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ పథకానికి ఇంకా అర్హులైన వారుంటే సదరు తల్లులకు చెందిన బ్యాంక్ ఐఎఫ్‌ఎస్ కోడ్‌లనూ ఛైల్డ్ ఇన్ఫో డేటా ద్వారా వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేస్తామని చెబుతున్నారు.
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.