సిబిల్ స్కోర్‌కు బ్యాంకు రుణాలకు సంబంధమేంటి? లోన్ పొందాలంటే ఎంత స్కోర్ ఉండాలి? సిబిల్ అంటే ఏంటి? సిబిల్ స్కోర్ ఎందుకంత ముఖ్యం సిబిల్ స్కోర్ ఎంత ఉంటే పర్సనల్ లోన్ వస్తుంది హోమ్ లోన్ పొందాలంటే సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి? మీ సిబిల్ స్కోర్ ఎంత? ! క్రెడిట్ స్కోర్ బాగుంటేనే రుణం దొరుకుతుంది
సిబిల్ స్కోర్‌కు బ్యాంకు రుణాలకు సంబంధమేంటి? లోన్ పొందాలంటే ఎంత స్కోర్ ఉండాలి?
క్రెడిట్ కార్డు కావాలన్నా.. పర్సనల్ లోన్ లేదా హోం లోన్ పొందాలన్నా బ్యాంక్‌కు వెళ్తే ముందుగా వినిపించే ప్రశ్న.. మీ సిబిల్ స్కోర్ ఎంత? ! క్రెడిట్ స్కోర్ బాగుంటేనే రుణం దొరుకుతుంది లేదంటే లోన్ రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.
పర్సనల్ లోన్, కార్ లోన్, హోం లోన్ ఇలా రుణం ఏదైనా అది మంజూరు కావాలంటే సిబిల్ స్కోర్ అంత ముఖ్యం. ఇంతకీ సిబిల్ స్కోర్ అంటే ఏంటి? దఆదానికి లోన్లు పొందడానికి ఏంటి సంబంధం? క్రెడిట్ స్కోర్‌ను ఎలా తెలుసుకోవాలంటే వివరాలు ఇప్పుడు చూద్దాం.
సిబిల్ అంటే ఏంటి?
లోన్ తీసుకునే వ్యక్తికి దాన్ని తిరిగి తీర్చగలిగే సామర్థ్యం ఉందా లేదా తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన సంస్థనే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్. దాన్నే సిబిల్ అని పిలుస్తుంటారు. గతంలో మీరు తీసుకున్న రుణాలను చెల్లించిన తీరు, క్రెడిట్ కార్డుల చెల్లింపు వ్యవహారాలు వంటి సమాచారాన్ని సేకరించి ఈ సంస్థ ఒక నివేదిక తయారు చేస్తుంది. దీని ఆధారంగా మనకు ఒక స్కోర్ నిర్ణయిస్తుంది. దాన్నే సిబిల్ స్కోర్ అని అంటారు. ఈ స్కోర్ ఆధారంగానే బ్యాంకులు లోన్లను మంజూరు చేస్తుంటాయి.*
సిబిల్ స్కోర్ ఎందుకంత ముఖ్యం
బ్యాంకుల నుంచి గతంలో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో ఎంత బాధ్యతగా ఉన్నారనేది సిబిల్ స్కోర్ ఆధారంగా తెలుస్తుంది. ఈ సిబిల్ స్కోర్ కనిష్టంగా 300, గరిష్ఠంగా 900 గా ఉంటుంది. ఈ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత సులువుగా రుణాలను పొందవచ్చు. రుణాలను తిరిగి సకాలంలో చెల్లించడంలో విఫలమైనా.. ఇచ్చిన చెక్‌లు బౌన్స్ అయినా ఈ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే ఒక్కోసారి లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నిర్ణీత గడువులోగా క్రెడిట్ కార్డు బిల్లులు, లోన్లు చెల్లించడం తప్పనిసరి.
సిబిల్ స్కోర్ ఎంత ఉంటే పర్సనల్ లోన్ వస్తుంది
బ్యాంకుల నుంచి పర్సనల్ పొందాలంటే సిబిల్ స్కోర్ కనీసం 720 నుంచి 750 మధ్య ఉండాలి. అప్పుడే లోన్ సులభంగా ఉందవచ్చు. అంతకంటే తక్కువగా సిబిల్ స్కోర్ ఉంటే లోన్ కోసం చేసుకున్న దరఖాస్తు తిరస్కరించే అవకాశం ఉంది. ఒకవేళ లోన్ మంజూరు అయినా సాధారణ వడ్డీ రేటు కంటే అధికంగా వడ్డీ రేట్ వసూలు చేస్తారు.
హోమ్ లోన్ పొందాలంటే సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి?
హోమ్ లోన్‌లో మనం కొనుగోలు చేసిన ఇంటిని బ్యాంకుతో మార్టిగేజ్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల క్రెడిట్ స్కోర్ 750 కంటే తక్కువగా ఉన్నప్పటికీ బ్యాంకులు హోం లోన్లు ఇస్తుంటాయి.
కొన్ని ఫైనాన్స్ కంపెనీలు అయితే క్రెడిట్ స్కోర్ 650 కంటే తక్కువగా ఉన్నప్పటికీ గృహ రుణాలను మంజూరు చేస్తున్నాయి. అయితే క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉండటం వల్ల అధిక వడ్డీ రేటును వసూలు చేస్తుంటాయి.
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.