Sunday, 20 June 2021

ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చు వార్షిక ఇంక్రిమెంట్లు రకాలు పూర్తి వివరణ

ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చు వార్షిక ఇంక్రిమెంట్లు రకాలు పూర్తి వివరణ

ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చు వార్షిక ఇంక్రిమెంట్లు రకాలు పూర్తి  వివరణ | వార్షిక ఇంక్రిమెంట్ అంటే ఏమిటి ? ఇంక్రిమెంట్లు ఎన్ని రకాలు, ఇంక్రిమెంట్ కు పరిగణింపబడు/పరిగణింపబడని కాలము, ఇంక్రిమెంట్లు నిలుపుదల సందర్భాలు | ఇంక్రిమెంట్లు రకాలు స్టాగ్నేషన్  ఇంక్రిమెంట్లు/ప్రీపోన్మెంట్ ఆఫ్ ఇంక్రిమెంట్/ ఫిక్సేషన్లు-ఇంక్రిమెంట్లు FR 18 / F.R.22(a) (i)/ F.R.22(a) (iv)/ F.R.22B,F.R.22b / FR 31 (2)/ FR 24/FR 26/FR 37 పై సంపూర్ణ వివరణ


ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చు వార్షిక ఇంక్రిమెంట్లు రకాలు పూర్తి  వివరణ 


ఒక సంవత్సర కాలము పాటు సంతృప్తికరంగా సేవలందించిన ఉద్యోగికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని వార్షిక ఇంక్రిమెంట్లు అందురు.

ఒక ఉద్యోగిపై ఆరోపణలు చార్జిషిటు పెండింగ్ లో ఉంటే తప్ప ఆ ఉద్యోగి వార్షిక ఇంక్రిమెంటు నిలపరాదు




APFC లోని ఫారం-49 లో డ్రాయింగ్ అధికారి ఇంక్రిమెంట్ ధృవపత్రంపై సంతకం చేసి వేతన బిల్లుకు జతపరచకపోతే ,ప్రభుత్వ ఉద్యోగికి ఇంక్రిమెంటు చెల్లించరు. (G.O.Ms.No.212 Fin Dt:16-05-1961)

నెల మధ్యలో ఇంక్రిమెంట్ తేది ఉంటే అదే నెల మొదటి తేదికి మార్చబడుతుంది.

(G.O.Ms.No.133 Fin Dt:13-05-1974)

(G.O.Ms.No.546 Edn Dt:05-07-1974)

DSE ఉత్తర్వులు 3781/74 Dt:13-22-1974 ప్రకారం దండన క్రింద ఇంక్రిమెంట్లను నిలిపివేసిన కేసులలో ఇంక్రిమెంట్లు దండన సమాప్తమైన తేది నుండి మంజూరు చేయబడతాయి/పునరుద్ద రించబడతాయి.

ఉద్యోగి సెలవులో ఉన్నప్పుడు ఇంక్రిమెంట్లు మంజూరు చేయరాదు. డ్యూటీలో చేరిన తరువాతే మంజూరు చేయాలి.(Memo.No.49463 Dt:06-10-1974)

ఉద్యోగి మొదటి వార్షిక  ఇంక్రిమెంట్ 12 నెలలు పూర్తికాకుండానే మంజూరు చేయబడుతుంది.

Eg: ఒక ఉద్యోగ నియామక తేది 28-12-2012 సదరు ఉద్యోగి మొదటి ఇంక్రిమెంట్ 01-12-2013 న మంజూరు అవుతుంది.

నెల ఆఖరి రోజు సాయంత్రం నూతనంగా సర్వీసులో చేరినవారు తరువాత నెల మొదటి తేది నుండి జీతమునకు అర్హులు.జీతం తీసుకున్న నెలయే ఇంక్రిమెంట్ తేది అవుతుంది.

వార్షిక ఇంక్రిమెంట్ కు లెక్కించబడిన కాలమే అప్రయత్న పదోన్నతి పథకం(AAS) స్కేళ్ళ మంజూరుకు పరిగణించబడుతుంది.


   ఇంక్రిమెంట్ కు పరిగణింపబడు కాలము 


- ఒక వేతన స్కేలు లో ఉద్యోగి చేసిన డ్యూటీ కాలం.

- అన్ని రకాల సెలవులు (జీత నష్టపు సెలవు తప్ప)

- డిప్యూటేషన్ పై పనిచేసిన కాలము.

- అనుమతించబడిన మేరకు జాయినింగ్ కాలం.

- పై పోస్టులో గడిపిన కాలం క్రింది పోస్టులో ఇంక్రిమెంట్ కు పరిగణించబడుతుంది.

- ప్రభుత్వ సెలవులు మరియు వెకేషన్ కాలం.

- ఉద్యోగం చేస్తూ పొందిన శిక్షణా కాలం (డ్యూటీ గా పరిగణించబడి నప్పుడు మాత్రమే)


   ఇంక్రిమెంటునకు పరిగణింపబడని కాలం


- జీతనష్టపు సెలవు ఇంక్రిమెంట్ కు పరిగణించబడదు. సదరు సెలవు వాడుకున్న రోజులు ఇంక్రిమెంటు వాయిదా పడుతుంది.

- జీతనష్టపు సెలవు వాడు కొన్నానూ ఇంక్రిమెంటు వాయిదా పడని సందర్భము:

- వైద్య కారణాలపై,శాస్త్ర,సాంకేతిక ఉన్నత విద్యకై ఇంకా ఉద్యోగ పరిధిలో లేని కారణాలపై జీతనష్టపు సెలవు వాడుకొన్ననూ 6 నెలల వరకు సెలవు కాలాన్ని ఇంక్రిమెంటుకు లెక్కించు అధికారం ప్రభుత్వ శాఖాధిపతులకు ఇచ్చింది (ఉపాధ్యాయుల విషయంలో కమిషనర్ మరియు విద్యా సంచాలకుల వారు) (FR-26(2)) & G.O.Ms.No.43 F&P Dt:05-02-1976)

- 6 నెలల కంటే ఎక్కువ జీతనష్టపు సెలవు వాడుకున్న సందర్భాలలో ప్రభుత్వానికి అప్పీలు చేసుకోవాలి.


   ఇంక్రిమెంట్లు నిలుపుదల సందర్భాలు:


తప్పుడు ప్రవర్తనా, విధి నిర్వహణలో అలక్ష్యం కారణంగా క్రమశిక్షణా చర్యగా ఉద్యోగి వార్షిక ఇంక్రిమెంట్లు 2 రకాలుగా నిలుపుదల చేయవచ్చును.


 Without Cumulative Effect:


FR-24(1) ప్రకారం కేవలం ఒక సం॥ మాత్రమే నిలుపుదల చేసి తదుపరి ఇంక్రిమెంట్ తేది నాడు విడుదలచేస్తారు. అంటే సదరు ఉద్యోగి ఒక సం॥ పాటు లేదా అంతకన్నా తక్కువ కాలం ఏరియర్స్ పోగొట్టుకుంటారు.


With Cumulative Effect:


దీన్ని అమలుచేసే ముందు విచారణాధికారిని నియమించాలి. సదరు ఉద్యోగి తన వాదనను వినిపించేoదుకు అవకాశం ఇవ్వాలి. ఉద్యోగికి చార్జిషిటు అందించడమే కాకుండా ఏ సాక్ష్యాధారాల ప్రకారం ఉద్యోగిపై ఆరోపణ చేయబడినదో కూడా అందించాలి. ఈ శిక్ష ప్రకారం ఉద్యోగి శాశ్వతంగా ఇంక్రిమెంటు కోల్పోతాడు.


ఇంక్రిమెంట్లు-రకాలు


స్టాగ్నేషన్  ఇంక్రిమెంట్లు:


-తక్కువ వేతన స్కేలు యందు ఎక్కువ కాలం పనిచేసే ఉద్యోగులుకు వారి  వేతన స్కేల్ లలో గరిష్ఠం చేరుకునే అవకాశం ఉంది.అటువంటి వారు భవిష్యత్తు లో ఇంక్రిమెంట్లు లేక అదే వేతనంపై పదవీ విరమణ పొందేవరకు లేదా వేతన స్కేలు మారే వరకు పనిచేయాల్సి ఉంటుంది. అటువంటి వారికి న్యాయం చేసేందుకు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు మంజూరుచేస్తారు. ఈ స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లను అన్ని రకాల సౌలభ్యాల కొరకు (ఫిక్సేషన్,ప్రమోషన్లు, AAS )లకు పరిగణిస్తారు.

10వ పి.అర్.సి లో 5 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు మంజూరుచేయబడ్డాయి.

(G.O.Ms.No.152 F&P Dt:04-11-2000)

(G.O.Ms.No.25 F&P Dt:18-03-2015)


ప్రీపోన్మెంట్ ఆఫ్ ఇంక్రిమెంట్:


-ఉద్యోగుల వేతన స్థిరీకరణ  సందర్భాలలో గాని,పదోన్నతి పొందిన స్థితిలో గాని,వేతన నిర్ణయం చేయవలసి వచ్చినప్పుడు,జూనియర్,సీనియర్ ఉద్యోగుల వేతనం ఒకే స్కేలు లో ఒకే దశ యందు వేతన స్థిరీకరణ కాబడి సీనియర్ ఉద్యోగి కంటే జూనియర్ ఉద్యోగి ఎక్కువ వేతనం పొందుతున్న సందర్భంలో సీనియర్ ఉద్యోగి ఇంక్రిమెంట్ తేదీని జూనియర్ ఇంక్రిమెంట్ తేదికి ప్రీపోన్ చేయబడి వేతన రక్షణ కలుగజేయుట నే ప్రీపోన్మెంట్ ఆఫ్ ఇంక్రిమెంట్ అందురు.


ఇంక్రిమెంట్లు కొన్ని ముఖ్యాంశాలు:


- ఆఫీసులో పనిచేసే ఉద్యోగుల యొక్క ఇంక్రిమెంట్ ఏ నెలలో ఉన్నదో తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఒక రిజిస్టరు (ఇంక్రిమెంటు వాచ్ రిజిష్టర్) నిర్వహించాలి.

- ఉద్యోగి తన వార్షిక ఇంక్రిమెంటు మంజూరు చేయాలని విన్నవించుకోనవసరం లేదు.గడువు తేదీన డ్రాయింగ్ అధికారే సర్టిఫికెట్ పై స్వయంగా సంతకం చేయాలి. (Memo.No.16965/77/A&L/185 Dt:13-02-1987)

- అర్జిత సెలవు లో(EL) కొనసాగుతూ మరణించినా,రిటైర్ అయినా సెలవు కాలంలో మొదటి 120 రోజులలో డ్యూ ఉన్న ఇంక్రిమెంట్ పెన్షన్,గ్రాట్యూటీలకు లెక్కించబడుతుంది.

- డైస్ నాన్ గా పరిగణించిన కాలము ఇంక్రిమెంట్లకు పరిగణించబడదు- FR 18

-ఉద్యోగి పదవీ విరమణ చేసిన మొదటి రోజున ఇంక్రిమెంట్ 'డ్యూ' ఉంటే దానిని నోషనల్ గా పరిగణించాలి.పెన్షనరీ ప్రయోజనాలకు లెక్కించాలి.కాని పదవీ విరమణ తరువాత చెల్లించే ఫైనల్ ఇంక్రిమెంట్ ఆఫ్ ఎర్న్ డ్ లీవ్ కు ఈ నోషనల్ ఇంక్రిమెంట్ పరిగణలోకి తీసుకోరాదు.

*(G.O.Ms.No.352 Fin Dt:27-10-1998)

-ఏదైనా పరీక్షా లేదా టెస్టు వల్ల ప్రభుత్వ ఉద్యోగికి ఏదైనా హక్కు లేదా మినహాయింపు వచ్చినట్లయితే ఆ సౌలభ్యం చివరి పరీక్ష తేది నుండి మంజూరైనట్లుగా భావించాలి.


ఫండమెంటల్ రూల్సు (ఫిక్సేషన్లు-ఇంక్రిమెంట్లు)


ఒక ఉద్యోగి వేరొక పోస్టునందు నియమించబడి నప్పుడు లేక ప్రమోషను పొందినప్పుడు ఫండమెంటల్ రూల్స్ 22,30,31 ననుసరించి అతని వేతన స్థిరీకరణ జరుగుతుంది. అయితే ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులిచ్చిన సందర్భంలో బాధ్యత మార్పుతో సంబంధం లేకుండగనే ఈ నిబంధనల ప్రకారము వేతన స్థిరీకరణ చేయబడుతుంది. సెలక్షన్ గ్రేడు, 6/12/18/24 సంవత్సరముల స్కేల్సు, రివైజ్డ్ పే స్కేల్సు, మొ,, వానియందు ఆ విధంగానే వేతన స్థిరీకరణ చేయబడుచున్నది

అట్లే ఉద్యోగి యొక్క సర్వీసును బట్టి ఇంక్రిమెంట్లు మంజూరు చేయబడతాయి. వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు, ప్రీపోన్మెంటు, పోస్టు పోన్మెంటు మొదలుగునవి ఫండమెంటల్ రూల్పు 24, 26, 27ననుసరించి చేయబడతాయి.


F.R.22(a) (i) : అదనపు బాధ్యతలతో కూడిన పోస్టునందు నియమించబడినప్పుడు, నూతన స్కేలు నందలి 'తదుపరి పై స్టేజి' వద్ద వేతన స్థిరీకరణ జరుగును.అట్టి వేతన స్థిరీకరణ జరిగిన తేదీ నుండి 12 నెలల సర్వీసు నిండిన పిదప ఇంక్రిమెంటు ఇవ్వబడుతుంది.

ఉదా : 21,230-63,010 స్కేలులో రూ. 25,840/- వేతనము తీసుకొనే ఉద్యోగి 28,940 - 78,910 స్కేలు గల పోస్టులో నియమించబడినప్పుడు అతని వేతనము రూ. 28,940గా స్థిరీకరించబడుతుంది.


F.R.22(a) (ii) : అదనపు బాధ్యతలు లేని పోస్టునందు నియమించబడినప్పుడు, నూతన స్కేలు నందలి “దిగువస్టేజి' వద్దనే వేతన స్థిరీకరణ జరుగుతుంది.* అయితే -


ఎ) ఒకవేళ పాత స్కేలులోని మూల వేతనమునకు సరిసమానమైన స్టేజి నూతన స్కేలులో వున్నచోఅట్టి 'సమాన స్టేజి' వద్ద వేతన స్థిరీకరణ జరుగుతుంది. పాత ఇంక్రిమెంటు తేదీ కొనసాగుతుంది.

ఉదా: 21,230-63,010 స్కేలులో రూ. 30,580/-లు వేతనం పొందుతున్న ఉద్యోగి 28, 940 - 78,910  స్కేలు లో నియమించబడినప్పుడు అతని వేతనము రూ 30,580ల వద్దనే స్థిరీకరించబడుతుంది.

బి) ఒకవేళ పాత స్కేలులోని మూలవేతనమునకు సమానమైన స్టేజి లేనిచో దిగువ స్టేజి వద్ద వేతన స్థిరీకరణ జరుగుతుంది. వేతన వ్యత్యాసము 'పర్సనల్ పే'గా నమోదు చేయబడుతుంది. పాతఇంక్రిమెంటు తేదీ కొనసాగుతుంది.(93, 99,05, 10, 15 స్కేళ్ళలో అన్నీ సమాన స్టేజీలే వుంటాయి.

సి) పాత స్కేలులోని మూలవేతనము నూతన స్కేలు యొక్క మినిమం కంటే తక్కువగా నున్నప్పుడు అట్టి మినిమం వద్ద వేతన స్థిరీకరణ జరుగుతుంది. సంవత్సరం సర్వీసు తదుపరి మాత్రమే ఇంక్రిమెంటు ఇవ్వబడుతుంది.

ఉదా : రూ. 21,230-63,010 స్కేలులో రూ. 25,840/-లు పొందుచున్నచో, 28,940-78,910  స్కేలులో రూ. 28,940/- వద్ద వేతన స్థిరీకరణ జరుగుతుంది.

F.R.22(a) (iv) : ఉద్యోగి పబ్లిక్ సర్వీస్ కమీషన్ చే ఎంపిక చేయబడిన మరొక పోస్టులో నేరుగా నియమించబడినప్పుడు పాత పోస్టులోని వేతనమునకు తక్కువ కాకుండా క్రొత్త పోస్టులోని వేతనము స్థిరీకరించబడుతుంది.

F.R.22 B:  నిబంధన ననుసరించి వేతన స్థిరీకరణ రెండువిధములుగా చేయవచ్చును. వాస్తవ ప్రమోషన్ తేదీనాడైనను లేక ప్రమోషన్ పొందిన పిదప క్రింది పోస్టులోని తదుపరి ఇంక్రిమెంటుతేదీనాడైనను వేతన స్థిరీకరణ చేయవచ్చును జిఓ.ఎంఎస్.నం. 145, తేది. 19.05.2009 ప్రకారము ఉద్యోగి ఎటువంటి ఆప్షన్ ఇవ్వకుండగనే ఉద్యోగికి ప్రయోజనకరమైన విధముగా ప్రమోషన్ తేదీ లేక తదుపరి ఇంక్రిమెంటు తేదీలలో దేనికైననూ వేతన నిర్ణయం చేయవలెను.

ఉదా: 21,230-63,010 స్కేలులో రూ. 28,120/-లు వేతనం పొందుతూ పదోన్నతి పొందినచో పదోన్నతి పొందిన రోజున వేతనం రూ. 28,940/-లుగా ఎస్ఆర్ 223(1) ప్రకారం నిర్ణయించి తదుపరి ఇంక్రిమెంటు తేదీ నాటికి ఒక నోషనల్ ఇంక్రిమెంటు రూ. 820/-లు కలిపి వేతనాన్ని రూ 28,940-78,910 స్కేలులో తదుపరి స్టేజి వద్ద అనగా రూ 30,580/-లుగా వేతన స్థిరీకరణ జరుగుతుంది.

FR 31 (2): నిబంధన ఎస్ఆర్ 22కు అనుబంధమైనది. దీని ప్రకారం సబ్ స్టాంటివ్ (క్రింది) పోస్టులో కొనసాగివుంటే ఇంక్రిమెంటు మంజూరు వలన గాని లేక ఇతర మంజూరుల వలనగాని ఆ స్కేలులోని వేతనము పెరిగినచో, అట్టి పెరుగుదల తేదీన అఫిషియేటింగ్ (పై) స్కేలులోని అతని వేతనము తదుపరి పై స్టేజి వద్ద పునస్థిరీకరణ చేయబడుతుంది. (లాభకరమైనప్పుడు)

ఉదా : 21,230-63,010 స్కేలులో రూ. 30,580/-లు పొందుచున్న ఉద్యోగి వేతనము 28,940 - 78,910  స్కేలులో రూ. 31,460/-ల వద్ద స్థిరీకరణ జరుగుతుంది. అయితే పాత స్కేలులోని ఇంక్రిమెంటు వలన వేతనము రూ. 31,460/-లుగా పెరుగుతుంది. కనుక సదరు ఇంక్రిమెంటు తేదీన క్రొత్త స్కేలులో అతని వేతనము 32,340/- వద్ద పున:స్థిరీకరణ చేయబడుతుంది.

F. R. 26:  నిబంధన ననుసరించి వార్షిక ఇంక్రిమెంటు మంజూరు చేయబడును. వార్షిక ఇంక్రిమెంటు మంజూరుకు - ఒక పోస్టులోని డ్యూటీ కాలము, జీత నష్టములేని సెలవు కాలము, ఫారిన్ సర్వీసు కాలము, జాయినింగ్ కాలము మొదలగునవి లెక్కించబడతాయి. అనారోగ్య కారణముపై గాని, ఉన్నత శాస్త్ర, సాంకేతిక విద్యనసభ్యసించు కారణముపై గాని పెట్టిన జీతనష్టపుసెలవు 6 నెలల కాలపరిమితికి లోబడి ఇంక్రిమెంటుకు పరిగణించ బడుతుంది. అందుకుగాను సంబంధిత శాఖాధిపతి అనుమతిని పొందవలసి వుంటుంది. శిక్షా చర్యగా సస్పెండు చేయబడిన కాలము ఇంక్రిమెంటుకు లెక్కించబడదు.

FR 27: నిబంధన ననుసరించి జూనియర్‌ కంటే సీనియర్ తక్కువ వేతనము పొందుచున్న సందర్భములో- ప్రీమెచ్యూర్ ఇంక్రిమెంట్ (ప్రీపోన్మెంట్) మంజూరు చేయబడుతుంది. ఒక పోస్టును మంజూరు చేయు అధికారియే అట్టి ఇంక్రిమెంటును మంజూరు చేయు అధికారము గలిగి యుండును. అయితే ప్రభుత్వపు ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా సదరు అధికారము దాఖలు పరచబడిన సందర్భములో సంబంధిత క్రింది అధికారులు కూడా అట్టి ఇంక్రిమెంటును మంజూరు చేయవచ్చును.

ప్రీపోన్మెంట్ తోపాటు స్టెప్పింగ్ అప్ కూడా యీ నిబంధన క్రిందే చేయబడుతుంది.

F R 24 : నిబంధన అనుసరించి దుష్ప్రవర్తన గల లేక అసంతృప్తికరమైన విధముగా విధులను నిర్వహించుచున్నట్టి ఉద్యోగిపై శిక్షా చర్యగా ఇంక్రిమెంటును కొంత కాలము నిలుపు చేయవచ్చును.

ఇంక్రిమెంటు మంజూరు చేయు అధికారియే అట్టి నిలుపుదల చేయవచ్చును. 

ఈ నిలుపుదల రెండు విధములు - 

1. క్యుములేటివ్ ఎఫెక్టుతో - అనగా ప్రతి సంవత్సరము నిర్ణీత కాలము వాయిదా పడుతుంది.

2. క్యుములేటివ్ ఎఫెక్టు లేకుండా - అనగా ఆ ఒక్క సంవత్సరమునకు మాత్రమే నిర్ణీత కాలము వాయిదా పడుతుంది.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.