నేటి నుంచి గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఈనెల 17నుంచి వచ్చేనెల 7వ తేదీ వరకు ఆన్లైన్లో అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరణ
నేటి నుంచి గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
నూజివీడు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా లయాల్లో 2021-22 విద్యాసంవత్సరానికి గానూ ఐదో తరగతిలో ప్రవేశ పరీక్ష ద్వారా చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయకర్త, నూజివీడు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కంచర్ల చంద్ర బుధవారం తెలిపారు.
ఈనెల 17నుంచి వచ్చేనెల 7వ తేదీ వరకు ఆన్లైన్లో అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు చెప్పారు.
ఏపీజీపీ సెట్.ఏపీసీఎ ఫ్ఎస్ఎస్.ఇన్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలన్నారు. ప్రవేశ పరీక్ష తేదీని దరఖాస్తుదారుల రిజిస్టర్ సెల్ఫోన్ నంబర్లకు మెసేజ్ ద్వారా తెలియజేస్తారన్నారు.
విద్యార్థులు తమ సొంత జిల్లాలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. జిల్లాలో బాలురకు రుద్రవరం, కృష్ణారావుపాలెం, తిరువూరు, పామర్రులలోను.. బాలికలకు రంగాపురం, వీరపనేనిగూడెం, బల్లిపర్రు, చల్ల పల్లి, నర్సాపురం, ముప్పాళ్ల, గుడివాడ, నూజి వీడు, జగ్గయ్యపేట, కుంటముక్కలలో గురుకుల పాఠశాలలున్నట్లు తెలిపారు.
Get More Information about APGP CET Click here
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.