Monday, 21 June 2021

హాజరు ఆధారంగా అధ్యాపకులకు గ్రేడ్లు

హాజరు ఆధారంగా అధ్యాపకులకు గ్రేడ్లు

హాజరు ఆధారంగా అధ్యాపకులకు గ్రేడ్లు విద్యార్థుల సమస్యలు పట్టించుకోని వైనం డిగ్రీ ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ తీరిది - విఠపు బాలసుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ


హాజరు ఆధారంగా అధ్యాపకులకు గ్రేడ్లు


ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులకు విద్యార్థుల హాజరుపై అధ్యాపకులకు లక్ష్యాలను విధించడం చర్చనీయాంశంగా మారింది. విద్యార్థుల హాజరు 75శాతం తగ్గితే చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతోపాటు విద్యార్థుల హాజరు ఆధారంగా మూడు కేటగిరిలుగా విభజించేందుకు చర్యలు చేపట్టారు. ఒక్కో పీరియడ్‌కు గంట సమయాన్ని కేటాయించాలనే నిబంధన విధించారు




ఉదయం 10గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. అన్ని గంటలు ఫోన్లలో హాజరుకాలేక కొందరు విద్యార్థులు నచ్చిన తరగతులకే హాజరవుతున్నారు. బీఎస్సీ వారిలో కొందరు గణితం, భౌతిక, రసాయన శాస్త్రం తరగతులకు హాజరవుతూ.. భాష సబ్జెక్టులకు రావడం లేదు. దీంతో భాషా తరగతులకు హాజరు తక్కువగా ఉంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా 154 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. వీటిల్లో 84వేలకు పైగా విద్యార్థులు ఉన్నారు.

సమాచారం లేకుండానే

సాధారణంగా ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించే ముందు ఎంతమంది విద్యార్థులకు ఫోన్లు, కంప్యూటర్లు ఉన్నాయి? ఎంతమందికి డేటా అందుబాటులో ఉంది? ప్రతి నెలా రీఛార్జి చేయించుకునే స్థోమత ఉందా? అనే విషయాలపై సమాచారం సేకరించలేదు. సాధారణంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు పొందే వారిలో చాలా వరకు పేదవారే. ఇలాంటి వారు డేటా ఖర్చులను భరించడం కష్టంగా మారుతోంది. 

ముఖ్యంగా చాలా మంది అమ్మాయిలకు ప్రత్యేకంగా ఫోన్‌ ఉండడం లేదు. వీరు తల్లిదండ్రుల వద్ద ఉండే వాటినే వినియోగించుకోవాల్సి వస్తుంది. దీంతో తరగతులకు హాజరు కాలేకపోతున్నారు. కొన్నిచోట్ల విద్యార్థుల హాజరు కోసం కొందరు అధ్యాపకులు పిల్లలకు డేటాను వేయిస్తున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ అధ్యాపకుడు గత నెలలో ముగ్గురు విద్యార్థులకు డేటా రీఛార్జి చేయించారు.

అధ్యాపకులకు గ్రేడ్లు

పిల్లల హాజరు 75 శాతం ఉంటే అధ్యాపకులకు గ్రేడ్‌-ఏ, 50శాతం ఉంటే గ్రేడ్‌-బీ, 50శాతం కంటే తక్కువగా ఉంటే గ్రేడ్‌-సీ ఇస్తున్నారు. వరుసగా మూడు రోజులు విద్యార్థుల హాజరు 50శాతం లోపు ఉంటే వివరణ ఇవ్వాలనే ఆదేశాలు జారీ చేశారు. అధ్యాపకులు ఆన్‌లైన్‌ తరగతుల వీడియోలను రికార్డు చేసి, వాటిని కళాశాల విద్య వెబ్‌సైట్‌లో పెడుతున్నారు. తరగతులు చెప్పడం కంటే విద్యార్థులు ఎంతమంది హాజరయ్యారనే దానిపైనే అధ్యాపకులు దృష్టిసారిస్తున్నారు.

విద్యార్థుల హాజరుకు వారు బాధ్యులు ఎలా?

‘‘కళాశాలలు లేకపోవడంతో కొందరు కుటుంబ పోషణకు పనులకు వెళ్తున్నారు. కొందరికి ఫోన్ల సదుపాయం లేకపోవడం, మరికొందరికి రీఛార్జి చేయించుకునే స్థోమత ఉండడం లేదు. విద్యార్థుల హాజరుకు అధ్యాపకులను బాధ్యులను చేయడం సమంజసం కాదు. గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ సదుపాయం ఉండడం లేదు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది’’

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.