Wednesday, 23 June 2021

ఉద్యోగులకు వైద్య బిల్లుల చెల్లింపు పై ఇక మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్

ఉద్యోగులకు వైద్య బిల్లుల చెల్లింపు పై ఇక మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్

ఉద్యోగులకు వైద్య బిల్లుల చెల్లింపు పై ఇక మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్ ఉద్యోగులకు మెడికల్ రీయింబర్సుమెంటు మంజూరు అయిన వెంటనే ఆరోగ్య శ్రీ ట్రస్టు నుంచి ఫోన్లకు మెస్సేజి (వర్తమానం) అందేలా ఏర్పాట్లు - ట్రస్టు సీఈవో మల్లికార్జున్


ఉద్యోగులకు వైద్య బిల్లుల చెల్లింపు పై ఇక మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్


ఉద్యోగులకు వైద్య బిల్లుల చెల్లింపు పై ఇక మొబైల్ ఫోన్లకు SMS OP తో పాటు టెస్టులకూ అవకాశం 4 రోజుల్లో అందరికీ స్మార్టు కార్డుల పంపిణీ  కమిటీ సమావేశంలో ట్రస్టు సీఈవో మల్లికార్జున్ వెల్లడి




ఆంధ్రప్రదేశ్ లోని ఉద్యోగులకు ఆరోగ్య స్కీం  స్మార్టు హెల్త్ కార్డులను నాలుగు రోజుల్లో పంపిణీ చేస్తామని ట్రస్టు సీఈవో మల్లికార్జునరావు ప్రకటించారు. 

డ్రాయింగు డిస్ బర్సుమెంటు అధికారుల ద్వారా వీటిని పంపిణీ చేస్తామని చెప్పారు. ఉద్యోగుల ఆరోగ్య స్కీం కింద చికిత్స ఖర్చుల పరిమితిని రూ. 3 లక్షలకు పెంచినట్లు ఆయన వివరించారు. 

ఆరోగ్య స్కీం ప్యాకేజీ రేట్లను పెరిగిన ధరలకు అనుగుణంగా సవరించినట్లు వెల్లడించారు. అవసరమయితే మరో 10శాతం పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు మల్లికార్జున రావు ప్రకటించారు. 

ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ఆరోగ్య కార్డులు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఎయిడెడ్, మెడల్ స్కూళ్ల టీచర్లకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చిన వెంటనే పంపిణీ చేస్తామని ట్రస్టు సీఈవో వెల్లడించారు. 

ఇకపై మెడికల్ కాలేజ్ లు, గవర్నమెంట్ హాస్పిటల్స్ ద్వారా ఔట్ పేషెంట్ చికిత్సతో బాటు టెస్టులు కూడా చేసేలా ఏర్పాటు చేస్తున్నారు. తొలుత ఒక జిల్లాలో ప్రయోగాత్మకంగా చేసి చూసి మిగిలిన జిల్లాలకు ఈ వసతిని విస్తరిస్తారు. 

ఉద్యోగులకు మెడికల్ రీయింబర్సుమెంటు మంజూరు అయిన వెంటనే ఆరోగ్య శ్రీ ట్రస్టు నుంచి ఫోన్లకు మెస్సేజి (వర్తమానం) అందేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మంజూరు ఉత్తర్వులు కూడా ఆన్ లైను లో పొందే వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.