కరోనాకు సూపర్ వ్యాక్సిన్ అన్ని కరోనా వేరియంట్లకూ చెక్ | డెల్టా ప్లస్ పట్ల అప్రమత్తత అవసరం మరీ ఆందోళన వద్దు వ్యాక్సిన్, మాస్క్లు, ఇతర జాగ్రత్తలతో రక్షణ ‘సాక్షి’ ఇంటర్వ్యూలో పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ కె. శ్రీనాథ్ రెడ్డి
కరోనాకు సూపర్ వ్యాక్సిన్ అన్ని కరోనా వేరియంట్లకూ చెక్
ఈ ఏడాది చివరికి అందుబాటులోకి వచ్చే ఛాన్స్ సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదు తాకిడి మాత్రమే తగ్గింది డెల్టా ప్లస్ పట్ల అప్రమత్తత అవసరం మరీ ఆందోళన వద్దు వ్యాక్సిన్, మాస్క్లు, ఇతర జాగ్రత్తలతో రక్షణ
ఆ ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్లను ఎదుర్కొ నేలా కొత్త వ్యాక్సిన్లపై పరిశోధనలు జరుగుతు ఉన్నాయి. వాస్తవానికి వైరస్లలో ఉపరితలంపై ఉండే స్పైక్ ప్రొటీన్తో పోలిస్తే అంతర్గతంగా ఉండే యాంటీజెన్లు చాలా నెమ్మదిగా ముటెట్ అవుతాయీ
అందువల్ల స్పైక్ ప్రొటీన్ తోపాటు యాంటీజెన్లపైనా పనిచేసేలా భిన్నమైన వేరియంట్లను సమర్థంగా ఎదుర్కొనేలా కొత్త వ్యాక్సిన్లను రూపొందిస్తున్నారు.
అమెరికాలో ఇలాంటి సూపర్ వ్యాక్సిన్ కు సంబంధించి మార్చిలోనే ట్రయల్స్ మొదలయ్యాయి. స్పైక్ ప్రొటీన్, న్యూక్లియో క్యాప్సిడ్, ఇంటీరియర్ వైరల్ యాంటీజెన్లతో కూడిన ఓఆర్ఎఎఫ్ 3ఏ'లను సమ్మిళితం చేసి ఆ వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు. దీనిపై ప్రస్తుతం తదుపరి దశల ట్రయల్స్ జరుగుతున్నాయి. అవన్నీ పూర్తయి ఈ ఏడాది చివరి నాటికి సూపర్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.