Employee Seniority list సీనియారిటీ లిస్ట్ తయారీలో తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యాంశాలు | Preparation of Employee Seniority list Guidelines | How to Prepared Employee Seniority list |ఉద్యోగ జ్యేష్టత క్రమం (Seniority) తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యాంశాలు విహంగవీక్షణం
Employee Seniority list సీనియారిటీ లిస్ట్ తయారీలో తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యాంశాలు
1.భాగం/ చక్రమార్గం (Quంటు/Rంటు) ప్రత్యేక నియమావళి (Special Rules) తాత్కాలిక నిర్దిష్ట ప్రయోజన నిమిత్తం (Adhoc Rules) ఏర్పాటు చేసిన నియమానకుం లయందు, నేరుగా నియామకాలు (Direct Recruitment) నిశ్చయించుటకు, వారికి పదోన్నతుల విషయంలోను మాత్రమే వర్తిస్తాయి. కాని అవి అంతర్గత సీనియారిటీ (Internal Seniority) విషయంలో వర్తించవు. అలాంటి అంతర్గత సీనియారిటీ రాష్ట్ర ఉన్నత శ్రేణి మరియు క్రిందిస్థాయి ఉద్యోగ శ్రేణి (State and Subordinates Service Rules, 1996) యందలి నియమావళి 33 ప్రకారం నిర్ణయించబడుతుంది. (G.O, Ms. No. 607, GA (Ser. A) Department, dt. 6-11-1992)
2. క్రింది స్థాయి నాన్ సెలెక్షన్ (Non-Selection Posts) పోస్టుల విషయంలో (N.G.Os) వారి ఉద్యోగ జ్యేష్టత జాబితా/అర్హత జాబితా (Fitness list) ప్రకారం పదోన్నతులు కల్పిస్తారు. అట్టి జాబితా సంవత్సరంలోని సెప్టెంబరు నెల మొదటి తేదీ నుంచి మరుసటి సంవత్సరం ఆగస్టు నెల 31వ తేదీ వరకు అమలులో వుండునట్లు తయారు చేయబడుతుంది. (Govt. Circular Memo No. 41886/DPC/2011.GA (DPC-Desk) Dept., dt. 6-9-2001).
3. ఇంతకుమునుపే నిర్ధారించబడిన సీనియారిటీ జాబితా మూడు సంవత్సరముల తర్వాత పునఃసమీక్షగాని మార్పుగాని (Review-Revision) చేయకూడదు. (Govt. Circular Memo No. 57759/(Ser. A) of GAD, dared 20-05-2004 issued based on a Judgment of Supreme Court).
4. సీనియరు అయిన ఉద్యోగిని కాకుండా, జూనియరుకు పదోన్నతి కల్పించిన సందర్భాలలో, బాధితుడు (Senior) సంబంధిత అప్పిలేట్ అధికారి (Appellite Authority) కి న్యాయం కోసం 90 రోజులలోపల అప్పీలు చేసుకొనవలసియున్నది. [Rule 26 (df] అప్పిలేటు అధికారి (Appellate Authority) అట్టి విషయమై సంవత్సరములోపల అట్టి అప్పీలును పరిష్కరించవలసియున్నది.. శాఖాధిపతి/ప్రభుత్వం కల్పించుకొని అట్టి దానిని గురించి తుది నిర్ణయం తీసుకుంటారు. అలా కాని పక్షము (Rule 26 (c) of State and Subordinate Service Rules, 1996).
5. ఉద్యోగ జ్యేష్టత క్రమం తెలుసుకోవలసిన ముఖ్యాంశాలు 5. పునర్విమర్శ (Revision) అర్జీ (Petition) పై తీసుకున్న నిర్ణయం, అప్పిలేట్ అధికారి (Appellate Authority) ప్రభుత్వానికి మూడు (3) నెలలలోపల సమర్పించవలసియున్నది. (GO. Ms. No. 76, GA (Ser. D) Department, dt. 11-03-2003).
6. ఉద్యోగుల నియామకాధికారులు (Appointing Authority) ప్రతి వర్గానికి (Category) ప్రతి సంవత్సరం ఎట్టి ఆలస్యం లేకుండా ఉద్యోగ జ్యేష్టత జాబితా (Seniority list) తయారు చేయవలసియున్నది. (GO Ms. No. 291, GA (Ser.A) Dept., dt. 10-05-1984).
7. శాఖాధిపతులు కార్యాలయాలను తనిఖీ (Inspection) చేయు సందర్భాలలో, సీనియారిటీ జాబితా (Seniority list) తయారు చేసి ఉద్యోగులకు సరఫరా చేసినదీ లేనిదీ (Communicate) పరిశీలించవలసియున్నది. (Govt. Memo No. 856/Scr. A/93-2. GA. (Ser. A) Dept., dt. 21-08-1993).
8. సీనియారిటీ జాబితా, తాత్కాలిక పద్ధతులపై తయారు చేసినది (Provisional Seniority list) ప్రతి ఉద్యోగికి తెలియజేస్తూ, అట్టిదానిపై ఏవైనా అభ్యంతరాలు వున్న యెడల 15 రోజులలోపల వారి అభ్యంతరాలు తెలియజేయవలెనని కోరవలసియున్నది. అలాంటి అభ్యంతరాలు, నియమ నిబంధనల మేరకు సరిచూసి మార్పు చేయవలసియున్నది. అటు తర్వాత సీనియారిటీ జాబితా స్థిరీకరించవలసి _యున్నది. (Govt. Memo No. 1197/Set. 94-1 GA (Set. A) Dept., dt. 20-10-1994).
9. తాత్కాలిక సీనియారిటీ విషయములో ఎవరైనా అభ్యంతరములు సమర్పించియున్న యెడల, అట్టి అభ్యంతరములు వారికి అనుకూలముగా నిర్ణయించు సందర్భములలో తద్వారా నష్టపోవు ఇతర ఉద్యోగులకు కారణం చూపు సంజాయిషీ నోటీసు (Show Cause Notice) ఇవ్వవలసియున్నది. వాటన్నిటిని పరిశీలించిన తర్వాత నియమ నిబంధనలకనుగుణంగా తుది సీరియారిటీ జాబితా నిర్ధారించి అందరు ఉద్యోగులకు తెలియజేయవలసియున్నది. (Govt. Memo No. 1/97/ Get A) Dept., dt. 20-10-1994),
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.