ITR E - ఫైల్ చేస్తున్నారా ఈ ఏడాది వచ్చిన మార్పులు తెలుసుకోండి | ఆదాయపు పన్ను రిటర్నులను ఈ ఏడాది E - ఫైల్ చేస్తున్నపుడు గమనించాల్సిన కొత్త మార్పులు | Income tax Efilling New we portal modification to ITR E-Returns AY 2022 FY 2021 New ITR Guidelines and modification's
ITR E - ఫైల్ చేస్తున్నారా ఈ ఏడాది వచ్చిన మార్పులు తెలుసుకోండి
ఆదాయపు పన్ను రిటర్నులను ప్రతీ సంవత్సరం ఫైల్ చేయాల్సిందే. అయితే టాక్స్-పైల్లింగ్ చేసే విధానంలో ఆదాయపు పన్ను శాఖ ప్రతీ సంవత్సరం కొన్ని మార్పులు చేస్తుంటుంది. పన్ను చెల్లింపుదారులు తప్పులు లేకుండా ఐటీ రిటర్నులను ఫైల్ చేసేందకు ఈ మార్పులను తెలుసుకోవడం చాలా ముఖ్యం.
మదింపు సంవత్సరం AY 22 కోసం రిటర్ను ఫారాలను ఐటీ శాఖ నోటిఫై చేసింది. ఐటీఆర్ దాఖలు గడువును కూడా సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. సమయం ఉన్నప్పటికీ, పన్ను దాఖలుకు కావలసిన పత్రాలను సిద్ధం చేసుకుని వీలైనంత త్వరగా ఫైల్ చేయడం మంచిది. దీంతో మీ వైపు లోపాలు ఎత్తి చూపే అవకాశాలు తగ్గడంతో పాటు, రిఫండ్‌ల ప్రాసెస్ ప్రక్రియ కూడా వేగంగా పూర్తిచేసేందుకు ఇది సహాయపడుతుంది. అయితే, పన్ను దాఖలు ప్రాసెస్‌ను ప్రారంభించేముందు ఈ నాలుగు విషయాలను గుర్తుంచుకోవాలి.
కొత్త vs పాత పన్ను విధానం..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2020 బడ్జెట్‌లో కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. అయితే పాత పన్ను విధానాన్ని రద్దు చేయలేదు. ఆర్థిక సంవత్సరం FY 21 నుంచి వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు పాత, కొత్త పన్ను విధానాలలో తమకు అనుకూలంగా ఉండే పన్ను విధానాన్ని ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు.
ఐటీ రిటర్న్స్ Form 26AS కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ ఫైల్ చేసే ముందు చెక్ చేయాల్సిన వివరాలు
కొత్త విధానంలో తక్కువ స్లాబ్ రేట్లు అందుబాటులో ఉన్నాయి. కానీ పాత విధానంలో ప్రకారం వర్తించే తగ్గింపులు, మినహాయింపు ప్రయోజనాలు కొత్త పన్ను పాలసీలో వదులుకోవలసి ఉంటుంది. ఏ విధానాన్ని ఎంచుకున్నా సంవత్సరం ప్రారంభంలోనే ఎంచుకోమని సలహా ఇస్తున్నారు నిపుణులు. పాత పన్ను విధానంలో వర్తించే తగ్గింపులు, మినహాయింపు ప్రయోజనాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా పెట్టుబడులు చేయనివారు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవడం మంచింది. దీంతో తక్కువ స్లాబ్‌కి వస్తారు కాబట్టి పన్ను తగ్గుతుంది.
వ్యాపారస్తులు మరింత జాగ్రత్తగా సరైన పన్ను విధానాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. కారణం పన్నువిధానాన్ని ఎంచుకున్న తరువాత ఒకసారి మాత్రమే మార్చుకునేందుకు వీలవుతుంది. అయితే జీతం, ఇంటి ఆస్తి, ఇతర మార్గాల ద్వారా ఆదాయం పొందుతున్న వారు ప్రతీ సంవత్సరం మార్చుకోవచ్చు. రెండు విధానాలలోనూ వర్తించే నిబంధనలను పరిగణలోకి తీసుకుని పన్ను లెక్కించి, ఏ విధానం ప్రయోజనకరంగా ఉంటుందో నిర్ణయించుకోవాలని ఆదాయపు పన్ను ఫైల్లింగ్ పోర్టల్ ట్యాక్స్2విన్.ఇన్ (Tax2win.in) సహా వ్యవస్థాపడకుడు సీఈఓ అభిషేక్ సోని తెలిపారు.
తేది పొడిగింపు, వడ్డీ ఉపశమనం లేదు
ఐటీఆర్ దాఖలుకు సెప్టెంబరు 30 వరకు గడువు పొడిగించారు. అయితే పన్ను లైబిలిటీలో మాత్రం ఎలాంటి ఉపశమనం ఇవ్వలేదు. ముందుస్తు పన్ను(అడ్వాన్స్ ట్యాక్స్) చెల్లింపులు చేయనివారు పెనాల్టీ వడ్డీ చెల్లించాలి. అందువల్ల పన్ను చెల్లించి వీలైనంత త్వరగా ఐటీఆర్‌ను దాఖలు చేయడం మంచిది.
సెక్షన్ 234ఏ కింద పెనాల్టీ వడ్డీకి సంబంధించి కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం సిబిడిటి కొంత సడలింపు ఇచ్చింది. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సిన పన్ను చెల్లింపుదారుల స్వీయ-అంచనా పన్ను (టీడీఎస్, అడ్వాన్స్ టాక్స్ మొదలైనవి చెల్లించిన తరువాత) రూ. లక్షకు మించకుంటేనే ఈ సడలింపు వర్తిస్తుంది. ఇది రూ.1లక్ష కంటే ఎక్కువ ఉంటే సెక్షన్ 234ఏ కింద ఉపశమనం లభించదని ఆర్ఎస్ఎమ్ ఇండియా వ్యవస్థాపకుడు సురేష్ సురానా అన్నారు.
ఐటీఆర్ దాఖలు చేయడంలో ఆలస్యం జరిగితే సెక్షన్ 234ఏ కింద 1శాతం చొప్పున నెలవారీ వడ్డీని వసూలు చేస్తరు. పన్ను విభాగం నిర్ణయించిన తేదిలలోపు నిబంధనలకు లోబడి అడ్వాన్స్ పన్ను చెల్లించడంలో విఫలం అయిన ముందస్తు పన్ను చెల్లింపుదారులకు సెక్షన్ 234బి, 234సి వడ్డీ చార్జ్ చేస్తారు.
పన్ను చెల్లింపుదారుడు ముందస్తు పన్ను చెల్లించపోయినా, పన్ను అంచనాలో 90 శాతం కంటే తక్కువ మొత్తాన్ని జమ చేసినా బకాయి ఉన్న మొత్తంపై సెక్షన్ 234బి ప్రకారం 1 శాతం వడ్డీ వర్తిస్తుంది.
సాధారణంగా అడ్వాన్స్ ట్యాక్స్ త్రైమాసికంగా చెల్లించాలి. వీటికి ఆదాయపు పన్ను శాఖ కొన్ని తేదీలను నిర్ణయిస్తుంది. ఈ తేదికి ముందే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించని వారికి సెక్షన్ 234సి కింద వడ్డీ పెనాల్టీ పడుతుంది.
అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించే గడువు
జూన్ 15 - మొత్తం ఆదాయంపై చెల్లించాల్సిన పన్నులో 15శాతం అడ్వాన్స్ చెల్లించాలి, సెప్టెంబర్ 15- మొత్తం ఆదాయంపై చెల్లించాల్సిన పన్నులో 45శాతం అడ్వాన్స్ చెల్లించాలి. డిసెంబర్ 15- మొత్తం ఆదాయంపై చెల్లించాల్సిన పన్నులో 75శాతం లెక్కించి దాని నుంచి అప్పటికే కట్టిన ముందస్తు పన్నును తీసివేయగా మిగిలిన మొత్తం చెల్లించాలి. మార్చి 15- మొత్తం ఆదాయంపై చెల్లించాల్సిన పన్ను 100శాతం నుంచి అప్పటికే కట్టిక ముందస్తు పన్నును తీసివేయగా మిగిలిన మొత్తం చెల్లించాలి. వ్యాపారం ద్వారా ఆదాయం లేని సినియర్ సిటిజన్లకు ముందుస్తు పన్ను నుంచి మినహాయింపు కల్పించారు.
పన్ను ఫారంలలో మార్పులు
పన్నులు చెల్లించడంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా ప్రతీ సంవత్సరం కొత్త ఐటీ ఫారంలను రూపొందిస్తుంది ఆదాయపు పన్ను శాఖ. సరైన ఫారంను ఎంచుకునేందుకు ఈ మార్పులను తెలుసుకోవడం అవసరం. ఈ సంవత్సరం కూడా ఐటీఆర్-1 అర్హత ప్రమాణాలలో కొన్ని మార్పులు చేశారు. దీనిని సాధారణంగా జీతం ద్వారా ఆదాయం పొందుతున్న పన్ను చెల్లింపుదారులు ఉపయోగిస్తారు. సెక్షన్ 194ఎన్ కింద నగదు విత్‌డ్రా కోసం టీడీఎస్ డిడక్ట్ చేసిన వ్యక్తులు లేదా యజమాని నుంచి ఎంప్లాయిస్ స్టాక్ ఆప్షన్(ఈఎస్ఓపీ)పై డిపర్డ్ ట్యాక్స్ పొందిన వారు ఐటీఆర్ 1 ను దాఖలు చేయకూడదు. ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని ఫారంలను ఎంచుకోవాలి.
క్లెయిమ్ చేయని తగ్గింపులు
పన్ను మినహాయింపు పెట్టుబడుల(జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్రీమియంలు వంటివి)కు సంబంధించిన ఫ్రూఫ్‌లను యజమానికి ఇవ్వడంలో విఫలం అయితే పన్ను డిడక్ట్ అవుతుంది. అయితే దీన్ని గురించి ఆందోళన చెందనవసరం లేదు. ఐటీఆర్ దాఖలు చేసేప్పుడు ఈ తగ్గింపులను క్లెయిమ్ చేసి, చెల్లించిన పన్నును వాపసు పొందవచ్చు. అయితే వీటికి సంబందించి ఒక కాఫీని మీ వద్ద భద్రపరచడం మంచిది.
ఈ సంవత్సరం వడ్డీ ఆదాయం, అందుకున్న డివిడెండ్, మ్యూచువల్ ఫండ్లు, షేర్లపై వచ్చిన మూలధన లాభాలు వంటి వాటన్నింటికి సంబంధించిన సమాచారం ఐటీఆర్ ఫారంలలో నిక్షిప్తం చేస్తుంది ఐటీశాఖ. తప్పులు లేకుండా ఐటీఆర్ ఫైల్ చేసేందుకు ఈ సమాచారాన్ని మీ వద్ద ఉన్న పత్రాలతో పోల్చి చూడండి. ఇందుకోసం ఫారం 16, ఫారం 26ఏఎస్ వంటి పత్రాలను, బ్యాంకు స్టేట్‌మెంట్లను ఐటీఆర్ ఫైల్లింగ్‌కు ముందే సేకరించి పెట్టుకోవాలి.
టీడీఎస్(మూలం వద్ద పన్ను), టీసీఎస్(మూలం వద్ద సేకరించిన పన్ను) వంటివి ఫారం 26ఏఎస్‌లో జులై 15వ తేది నాటికి వారి వారి ఫారం 26ఏఎస్‌లో అప్‌డేట్ అవుతాయి. అప్పటి వరకు మదింపుదారులు వేచి ఉండమనేది నిపుణుల సలహా. టీడీఎస్, టీసీఎస్ రిటర్నులను దాఖలు చేసేందుకు చివరి తేది జూన్30 వరకు పొడిగించారు. అందువల్ల జులై 15 లోపు ఫారం 26ఏఎస్‌లో అప్‌డేట్ అయ్యే అవకాశం ఉందని కన్సల్టింగ్ సంస్థ టాక్స్ కనెక్ట్ అడ్వైజరీ సర్వీసెస్ ఎల్ఎల్‌పీకి చెందిన వివేక్ జలన్ తెలిపారు.
ఐటీఆర్‌ను ధృవీకరించే వరకు పన్ను దాఖలు ప్రక్రియ పూర్తికాదు. ఐటీఆర్ దాఖలు చేసిన 120 రోజుల్లో ఇది జరగాలి. ఆన్‌లైన్ ద్వారా గానీ, సంతకం చేసిన ఐటీఆర్ -V ను పోస్ట్ చేయడం ద్వారా గానీ ధృవీకరించవచ్చు.
GET IT E - Returns AY 2022 FY 2021 official web portal Click here
ఐటీ రిటర్న్స్ Form 26AS కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ ఫైల్ చేసే ముందు చెక్ చేయాల్సిన వివరాలు
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.