Monday, 7 June 2021

MJP BC APRJC CET 5th Class English Medium Admissions 2021-22 through lottery system

MJP BC APRJC CET 5th Class English Medium Admissions 2021-22 through lottery system

MJP BC APRJC CET 5th Class English Medium Admissions 2021-22 through lottery system Notification Online Application at http://apgpcet.apcfss.in/మహాత్మ జ్యోతిబాపూలే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయము 2021-22 విద్యా సంవత్సరానికి గానూ 5 వ తరగతి (ఇంగ్లిష్ మీడియం)లో విద్యార్థులను లాటరీ పధ్ధతి ద్వారా ఎంపిక నోటిఫికేషన్ ఆన్లైన్ దరఖాస్తు విధానం

MJP BC APRJC CET 5th Class English Medium Admissions 2021-22 through lottery system

మహాత్మ జ్యోతిబాపూలే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయముల సంస్థచే నడుపబడుచున్న 92 పాఠశాలలు 2021-22 విద్యా సంవత్సరానికి గానూ 5 వ తరగతి (ఇంగ్లిష్ మీడియం)లో విద్యార్థులను లాటరీ పధ్ధతి ద్వారా ఎంపిక చేసి, ఎంపికైన వారికి పాటశాలల కేటాయింపు జరుగును.




ప్రవేశానికి అర్హత వయస్సు బి.సి మరియు ఈ బి.సి (BC /EBC) లకు చెందిన వారు 01-09-2010 నుండి 31-08-2012 మధ్య పుట్టి వుండాలి. యస్.సి. మరియు యస్.టి. (ఎప్సి/ఎసి) లకు చెందిన వారు 01-09 2008 నుండి 31-08-2012 మధ్య పుట్టి వుండాలి.

సంబంధిత జిల్లాలో 2019-20 & 2020-21 విద్యా సంవత్సరములలో నిరవదికముగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 3 మరియు 4 తరగతులు చదివి వుండాలి. 

ఆదాయ పరిమితి అభ్యర్థి యొక్క తల్లి, తండ్రి/సంరక్షకుల సంవత్సర ఆదాయము 2020-21 ఆర్థిక సంవత్సరమునకు రూ.1,00,000/-లు మించి ఉండరాదు. 

దరఖాస్తు: దరఖాస్తు చేయడానికి ముందుగా పూర్తి వివరాలతో కూడిన సమాచార పత్రం కొరకు http://www.mjpapbcwr.in ను చూడగలరు. 

దరఖాస్తు చేయు విధానం అభ్యర్థులు పై అర్హతలు పరిశీలించుకొని సంతృప్తి చెందిన తరువాత ఆన్ లైన్ లో తేదీ 14-06-2021 నుండి తేదీ 30-06 2021 లోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయు విధానములో సందేహమున్నచో పాఠశాల కార్యాలయ పని వేళలు ఉదయం 10.00 గం.ల నుండి సాయంత్రం 4.30 గం.ల లోపు క్రింద పేర్కొన్న పాఠశాలల ప్రిన్సిపాల్ వార్ల నెంబర్ లకు సంప్రదించగలరు.



విద్యార్థులకు అందించే సదుపాయములు



ఉచిత వసతి మరియు గురుకుల విధానంలో చదువుకునే అవకాశం.

నెలకు రూ. 1250/- ల తో పౌష్టిక విలువలతో కూడిన మెనూ

3 జతల యూనిఫామ్ దుస్తులు

దుప్పటి మరియు జంఖన

బూట్లు, సాక్స్

టై మరియు బెల్ట్

నోట్ పుస్తకములు

ప్లేట్, గ్లాస్, కటోర

కాస్మోటిక్ దార్జీల నిమిత్తం బాలురకు 100 రూ.లు చొప్పున (v, vi), VII నుండి ఇంటర్మీడియట్ వరకు బాలురకు 125/-రూ.ల బాలికలకు 6, 7 వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు నెలకు 110/రూ.ల చొప్పున మరియు 8 వ తరగతి ఆ పై తరగతుల పిల్లలకు నెలకు 160/- రూ.ల చొప్పున చెల్లించడం జరుగుచున్నది మరియు బాలురకు నెలకు రూ. 30/-లు చొప్పున సెలూన్ నిమిత్తం ఖర్చు చేయడం జరుగుచున్నది.

5 వ తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థి ఇంటర్మీడియట్ వరకు గురుకుల పాఠశాలలోనే విద్యనభ్యసించ వచ్చును * సమీకృత పౌష్టిక ఆహారం క్రింది. రోజు వేరుశనగ చిక్కి, వారానికి ఆరు దినములు గ్రుడ్డు, రెండు సార్లు చికెన్ ఇవ్వబడును.

ఉల్లాసభరితమైన, ఆహ్లాదకరమైన వాతావరణములో విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయబడుతుంది. క్రీడలతో పాటు బోధనేతర కార్యక్రమాలలో కూడా శిక్షణ ఉంటుంది. గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, డిజిటల్ తరగతులతో విద్యాబోధన జరుగుతుంది. దరఖాస్తులను ఆన్ లైన్ లో http://apgpcet.apcfss.in/MJPAPBCWR/ వెబ్ సైట్ లో ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ నుండి దరఖాస్తు చేసుకొనగలరు.


Get Complete Notification Information at


Get More Details at official website at

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.