నేషనల్ పెన్షన్ సిస్టమ్ NPS సబ్‌స్క్రైబర్లకు తీపికబురు ఒకేసారి రూ.5 లక్షలు తీసుకోండిలా | NPS పెన్షనర్లకు కేంద్రం తీపికబురు ఒకేసారి రూ.5 లక్షలు తీసుకోండిలా
నేషనల్ పెన్షన్ సిస్టమ్ NPS సబ్‌స్క్రైబర్లకు తీపికబురు ఒకేసారి రూ.5 లక్షలు తీసుకోండిలా
కేంద్ర ప్రభుత్వం ఎన్‌పీఎస్ స్కీమ్‌లో చేరిన వారికి తీపికబురు అందించింది. పీఎఫ్ఆర్‌డీఏ తాజాగా ఎన్‌పీఎస్ విత్‌డ్రాయెల్ లిమిట్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో చాలా మందికి ఊరట కలుగనుంది.
పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ పీఎఫ్‌ఆర్‌డీఏ కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ NPS సబ్‌స్క్రైబర్లకు తీపికబురు అందించింది. పెన్షన్ కార్పస్ డబ్బులను ఒకేసారి విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో చాలా మందికి ఊరట కలుగనుంది.
ఎన్‌పీఎస్ స్కీమ్‌లో చేరిన వారు మెచ్యూరిటీ సమయంలో పూర్తి డబ్బులు వెనక్కి తీసుకోవడానికి వీలుండదు. కొంత డబ్బుతో యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో సబ్‌స్క్రైబర్లకు ప్రతి నెలా పెన్షన్ వస్తుంది. అయితే ఇప్పుడు కేంద్రం కొత్త రూల్స్ తీసుకువచ్చింది.
పెన్షన్ కార్పస్ రూ.5 లక్షలకు వరకు ఉంటే పూర్తి డబ్బులను ఒకేసారి వెనక్కి తీసుకోవచ్చు. అంటే యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేయాల్సిన పని లేదు.
ఇది వరకు రూ.2 లక్షల వరకు మాత్రమే ఈ బెనిఫిట్ ఉండేది. అంటే కార్పస్ మొత్తం రూ. 2 లక్షల వరకు ఉంటే పూర్తి డబ్బులు వెనక్కి తీసుకునేవారు. ఇకపై రూ.5 లక్షల వరకు డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు.
ఇకపోతే ఎన్‌పీఎస్ స్కీమ్‌లో రెండు రకాల అకౌంట్లు ఉంటాయి. ఒకటేమో టైర్ 1 అకౌంట్. రెండోదేమో టైర్ 2 అకౌంట్. టైర్ 1 ఎన్‌పీఎస్ అకౌంట్ పెన్షన్ అకౌంట్. ఇక టైర్ 2 అకౌంట్ అనేది ఇన్వె్స్ట్‌మెంట్ అకౌంట్. ప్రస్తుతం యాన్యుటీ ప్లాన్‌పై 5.5 శాతం వరకు రాబడి లభిస్తోంది
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.