Salary holders link your PAN card number in Aadhaar immediately till June 30 | If your salary is to be credited to your bank account by the end of this month, link your PAN card and Aadhaar number immediately till June 30 | పాన్, ఆధార్ నెంబర్లను లింక్ చేయడానికి చివరిసారిగా జూన్ 30 వరకు గడువు జూలై 1 నుంచి ఆధార్ లింక్ చేయని పాన్ కార్డులు చెల్లవు | ఈ నెలాఖరులో కూడా మీ జీతం మీ బ్యాంక్ అకౌంట్‌లో పడాలంటే వెంటనే మీ పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయండి జూన్ 30 వరకు గడువు
Salary holders link your PAN card number in Aadhaar immediately till June 30
ఎప్పట్లాగే ఈ నెలాఖరులో కూడా మీ జీతం మీ బ్యాంక్ అకౌంట్‌లో పడాలంటే వెంటనే మీ పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయండి. ఇప్పటికే మీరు పాన్, ఆధార్ లింక్ చేసినట్టైతే ఇబ్బందేమీ లేదు. కానీ పాన్, ఆధార్ లింక్ చేయకపోతే మాత్రం ఈ నెల జీతం మీ అకౌంట్‌లోకి రాకపోవచ్చు
పాన్, ఆధార్ నెంబర్లను లింక్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ అనేకసార్లు గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. చివరిసారిగా జూన్ 30 వరకు గడువు పొడిగించింది. అంటే పాన్, ఆధార్ లింక్ చేయడానికి మరో వారం రోజులే గడువు ఉంది.అంతేకాదు పాన్, ఆధార్ లింక్ చేయకపోతే పాన్ కార్డ్ హోల్డర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంది. అందులో జీతం అకౌంట్‌లో క్రెడిట్ కాకపోవడం కూడా ఒకటి.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139ఏఏలో క్లాజ్ 41 ప్రకారం జూన్ 30 లోగా పాన్, ఆధార్ నెంబర్లు లింక్ చేయకపోతే పాన్ కార్డ్ ఇనాపరేటీవ్‌గా మారుతుంది. అంటే చెల్లనిదిగా మారుతుంది. జూలై 1 నుంచి ఆధార్ లింక్ చేయని పాన్ కార్డులు చెల్లవు.
పాన్, ఆధార్ నెంబర్లు లింక్ చేయడానికి 4 మార్గాలున్నాయి. ఎస్ఎంఎస్ ద్వారా పాన్, ఆధార్ నెంబర్ లింక్ చేయాలంటే UIDPAN అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి 10 డిజిట్ పాన్ నెంబర్ ఎంటర్ చేసి 567678 లేదా 56161 నెంబర్లకు ఎస్ఎంఎస్ పంపాలి.
ఆన్‌లైన్‌లో https://www.incometax.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి హోమ్ పేజీలో Link Aadhaar ఆప్షన్ క్లిక్ చేసి పాన్, ఆధార్ నెంబర్లు ఎంటర్ చేసి సబ్మిట్ చేసినా చాలు
How to link to aadhar to pan card click here
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.