SBI బాదుడు ఇక నెలకు నాలుగే 'ఉచిత' విత్ డ్రాయల్స్ జూలై 1 నుంచి అమలు
SBI బాదుడు ఇక నెలకు నాలుగే 'ఉచిత' విత్ డ్రాయల్స్
న్యూఢిల్లీ : బీదా బిక్కీ జనానికి బ్యాంకుల్లో ఉండే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్ఓబీడీ) ఖాతాల ఛార్జీలను జూలై 1 నుంచి ఎస్బీఐ సవరిస్తోంది. వీరి ఉచిత నగదు ఉపసంహరణ (విత్ డ్రాయల్స్) సదుపాయాన్ని నెలకు నాలుగుకు పరిమితం చేస్తోంది.
ఆ పరిమితి మించితే ప్రతి నగదు ఉపసంహరణపైనా రూ.15 ప్లస్ జీఎస్టీ భారం పడుతుంది. బ్యాంక్ శాఖలు, ఏటీఎంలు, ఇ బ్యాంకుల ఏటీఎంల నుంచి చేసే అన్ని అదనపు నగదు విత్ డ్రాయల్స
ఈ ఛార్జీలు వర్తిస్తాయి. చెక్బుక్లూ ప్రియం : SBI ఖాతాదారులకు ప్రస్తుతం ఏడాదికి 10 లీఫ్స్ ఉండే ఒక చెక్ బుక్ ఎస్ బీఐ ఉచితంగా జారీ చేస్తోంది.
జూలై 1 నుంచి ఆ పరిమితి మించితే 10 లీఫ్స్ చెకుకు రూ.40 ప్లస్ జీఎ ఎటీ, 25 లీఫ్స్ చెకుకు రూ.75 ప్లస్ జీఎస్టీ చెల్లించాలి. అత్యవసరంగా 10 లీఫ్స్ చెక్ బుక్ కావాలన్నా బీఎస్బీడీ ఖాతాదారులు రూ.50 ప్లస్ జీఎస్ఆ చెల్లించాలి.
అయితే సీనియర్ సిటిజన్లను ఈ అదనపు చెకుక్ చార్జీల నుంచి మినహాయిస్తున్నట్టు ఎస్బీఐ తెలిపింది.
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.