SC/BC/OBC కులాలకు చెందిన కుటుంబ పోషణకర్త కోవిడ్ - 19 కారణంగా చనిపోయినట్లైతే 5.00 లక్షల వరకు లోను సదుపాయం | SC మరియు BC కార్పొరేషన్ వారి ఆదేశాల ప్రకారము SC మరియు BC/ OBC కులాలకు చెందిన కుటుంబ పోషణకర్త కోవిడ్ - 19 కారణంగా చనిపోయినట్లైతే వారి కుటుంబాలకు 5.00 లక్షల వరకు లోను సదుపాయం కలిగించే అవకాశం కలదు.
SC/BC/OBC కులాలకు చెందిన కుటుంబ పోషణకర్త కోవిడ్ - 19 కారణంగా చనిపోయినట్లైతే 5.00 లక్షల వరకు లోను సదుపాయం
SC మరియు BC కార్పొరేషన్ వారి ఆదేశాల ప్రకారము SC మరియు BC/ OBC కులాలకు చెందిన కుటుంబ పోషణకర్త కోవిడ్ - 19 కారణంగా చనిపోయినట్లైతే వారి కుటుంబాలకు 5.00 లక్షల వరకు లోను సదుపాయం కలిగించే అవకాశం కలదు.
అర్హతలు :-
1). సదరు కోవిడ్ - 19 కారణంగా చనిపోయిన కుటుంబ పోషణ కర్త వయస్సు 18 - 60 సంవత్సరాల మధ్య ఉండవలెను.
2). వారి కుటుంబ సంవత్సర ఆదాయం 3.00 లక్షలకు మించరాదు.
3). కేవలం ఈ పధకం SC మరియు BC కులస్తులకు మాత్రమే
కావాల్సిన సర్టిఫికెట్లు :-
A. రేషన్ కార్డు
B. ఆధార్ కార్డు
C. కుల ధ్రువీకరణ పత్రం
D. చనిపోయిన వ్యక్తి మరణ ధ్రువీకరణ పత్రం
E. బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్ కాపీ
F. కోవిడ్ - 19 కారణంగా చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రం
కావున ఎవరైనా ఇలాంటి బాధితులు ఉన్నట్లయితే వెంటనే మీ గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిలు మరియు వెల్ఫేర్ అసిస్టెంట్ లకు మీ అప్లికేషన్లు అందజేయాలని కోరడమైనది. మీ సచివాలయం పరిధిలో ఎవరైనా షెడ్యూల్డ్ కులాలు మరియు వెనుక బడిన తరగతుల కులస్తులై ఉండి కోవిడ్ కారణంగా చనిపోయిన కుటుంబ పోషణకర్త అయి ఉన్నచో ఆ వివరాలు వెంటనే అనగా రేపే సంబంధిత పత్రాలతో మీ సచివాలయంలో అందజేయాలి
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.