10 వ తరగతి గ్రేడ్లు పై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం ఈ ఏడాదితో పాటు గత విద్యాసంవత్సరం ఫార్మాటివ్ మార్కులే ప్రాతిపదికగా 10 వ తరగతి గ్రేడ్లు రెండు ఫార్మాటివ్ అసెస్ మెంట్లలో సాధించిన మార్కుల్ని సగటు తీసి ఆ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ప్రకటిస్తారు - ఛాయారతన్ కమిటీ నివేదిక
10 వ తరగతి గ్రేడ్లు పై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
ఏపీలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు చివరి క్షణం వరకూ పట్టుబట్టిన ప్రభుత్వం వాటిని రద్దు చేయక తప్పలేదు.
అయితే విద్యార్ధులకు భవిష్యత్తులో నష్టం కలగకుండా పాస్ మార్కులు వేసే విషయంలో ఏం చేయాలన్న దానిపై ఛాయారతన్ కమిటీని నియమించింది.
ఆ కమిటీ అధ్యయనం పూర్తి చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్దం చేసింది.
ఏపీలో పదో తరగతి విద్యార్ధులకు వారు ఈ విద్యా సంవత్సరంలో సాధించిన ఫార్మాటివ్ అసెస్మెంట్ ( ఇంటర్నల్ మార్కులు) ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తోంది.
పరీక్షలు రద్దు కావడంతో ఎవరూ నష్టపోకుండా విద్యార్ధులు ఈ ఏడాది సాధించిన ఇంటర్నల్ మార్కుల్లో సగటు తీసి దాని ఆధారంగా గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు ఇవ్వాలని నిర్ణయించింది.
అంటే రెండు ఫార్మాటివ్ అసెస్ మెంట్లలో సాధించిన మార్కుల్ని సగటు తీసి ఆ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ప్రకటిస్తారు.
గ్రేడ్లు ప్రకటించిన తర్వాత రెండు, మూడు రోజుల్లో స్కూళ్ల నుంచి మార్కు మెమోల్ని తీసుకునే అవకాశం కల్పిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇప్పటికే ప్రకటించారు.
ఈ ఏడాదితో పాటు గత విద్యాసంవత్సరంలో పదో తరగతి పరీక్షలు రద్దయినా వారికీ గ్రేడింగ్ ఇవ్వలేదు. మార్కులూ ప్రకటించలేదు.
దీంతో ఛాయారతన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా 2019-20 విద్యాసంవత్సరం పదో తరగతి చదివిన విద్యార్ధులకు కూడా గ్రేడ్లు ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది.
పరీక్షలు రద్దు చేసిన ప్రభుత్వం గ్రేడ్లు ప్రకటించకపోవండతో ఇప్పటికే అప్పటి విద్యార్ధులు ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈ ప్రక్రియను త్వరలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.