Friday, 2 July 2021

ప్రీ ప్రైమరీ విద్యలో టీచర్లు లేరు 9, 10 తరగతుల్లో డ్రాపౌట్లు - యూడీఐఎస్‌ఈ ప్లస్‌ నివేదికలో వెల్లడి

ప్రీ ప్రైమరీ విద్యలో టీచర్లు లేరు 9, 10 తరగతుల్లో డ్రాపౌట్లు - యూడీఐఎస్‌ఈ ప్లస్‌ నివేదికలో వెల్లడి

ప్రీ ప్రైమరీ విద్యలో టీచర్లు లేరు 9, 10 తరగతుల్లో డ్రాపౌట్లు యూడీఐఎస్‌ఈ ప్లస్‌ నివేదికలో వెల్లడి 2019-20 విద్యా సంవత్సరానికి గాను రూపొందించిన యునైటెడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ ప్లస్‌(యూడీఐఎ్‌సఈ+) నివేదికను కేంద్ర మంత్రి రమేష్‌ పోఖ్రియల్‌ నిశాంక్‌ గురువారం విడుదల చేశారు దేశ వ్యాప్తంగా పాఠశాల విద్యలో ప్రీ ప్రైమరీ నుంచి హయ్యర్‌ సెకండరీ విద్య వరకు మొత్తం 26.45 కోట్ల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు


ప్రీ ప్రైమరీ విద్యలో టీచర్లు లేరు 9, 10 తరగతుల్లో డ్రాపౌట్లు - యూడీఐఎస్‌ఈ ప్లస్‌ నివేదికలో వెల్లడి


రాష్ట్రంలో ప్రీ ప్రైమరీ విద్యలో ఉపాధ్యాయులే లేరని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. దేశంలో పాఠశాల విద్యకు సంబంధించి 2019-20 విద్యా సంవత్సరానికి గాను రూపొందించిన యునైటెడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ ప్లస్‌(యూడీఐఎ్‌సఈ+) నివేదికను కేంద్ర మంత్రి రమేష్‌ పోఖ్రియల్‌ నిశాంక్‌ గురువారం విడుదల చేశారు. 2019-20 నాటికి ఏపీలో 63,824 పాఠశాలలు ఉండగా, వీటిలో ప్రాథమిక పాఠశాలలు 39,388, ప్రాథమికోన్నత పాఠశాలలు 9,282, సెకండరీ పాఠశాలలు 12,353, ఉన్నత పాఠశాలలు 2,802 ఉన్నాయి. రాష్ట్రంలో విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తి (పీటీఆర్‌) ప్రాథమిక పాఠశాల్లో 24.4, ప్రాథమికోన్నత పాఠశాలలో 16.8, సెకండరీ విద్యలో 15.9, ఉన్నత విద్యలో 39.8 వంతున ఉన్నట్లు పేర్కొన్నారు.




పాఠశాల విద్యారంగంలో 3,17,430 మంది ఉపాద్యాయులు ఉండగా, వీరిలో 1,59,302 మంది పురుషులు, 1,58,128 మంది మహిళలు ఉన్నారు. అయితే ప్రీ ప్రైమరీ విద్యలో టీచర్లే లేకపోవడం గమనార్హం. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ పాఠశాలల్లో ఒక్క టీచరు కూడా లేరు. ప్రాథమిక పాఠశాలల్లో 1,40,685 మంది ఉపాధ్యాయులు ఉండగా, వీరిలో పురుషులు 62,603 మంది, మహిళలు 78,082 మంది ఉన్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 14,309 మంది టీచర్లు ఉండగా, వీరిలో పురుషులు 5,638 మంది, మహిళలు 8,671మంది ఉన్నారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 56,670 మంది ఉపాధ్యాయులు ఉండగా వీరిలో 29,191మంది పురుషులు,  27,479 మంది మహిళలు ఉన్నారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 56,182 మంది ఉపాధ్యాయులు ఉండగా, వీరిలో 30,692మంది పురుషులు 25,490మంది మహిళలు. ప్రభుత్వ ఎయిడెడ్‌ ప్రాథమిక పాఠశాలలో మొత్తం 7,616మంది టీచర్లు ఉండగా, వీరిలో ప్రాథమిక పాశశాలలకు 2,624మంది టీచర్లు ఉండగా, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1,015మంది ఉండగా, 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు, సెకండరీ పాఠశాలల్లో 9, 10 తరగతులకు ఒక్క టీచరూ లేరు.

అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలలకు సంబంధించి 6నుంచి 8వ తరగతి వరకు కేవలం 12 మంది, 9, 10 తరగతులకు కేవలం 67 మంది ఉపాధ్యాయులే ఉన్నారు. ఉన్నత విద్యకు సంబంధించి 6నుంచి 12వ తరగతి వరకు కేవలం 30మంది టీచర్లే ఉండగా, 9 నుంచి 12వరకు కేవలం 25మందే ఉన్నారు. ఉన్నత విద్యా పాఠశాలల్లో తరగతులు చెప్పడానికి ఒక్క టీచరు కూడా లేకపోవడం గమనార్హం. ప్రాథమిక విద్యకు సంబంధించి 1 నుంచి 5వ తరగతి వరకు డ్రాపౌట్లు లేరు. 6 నుంచి 8వ తరగతి వరకు బాలురులో 0.3శాతం, బాలికల్లో 0.2శాతం ఉన్నారు. 9, 10 తరగతుల్లో 17.2శాతం మంది బాలురు, 12.2శాతం మంది బాలికలు డ్రాపౌట్లు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. మొత్తంమీద సెకండరీ విద్యలో డ్రాపౌట్ల శాతం 14.8గా ఉంది. ఇదిలా ఉండగా, దేశ వ్యాప్తంగా పాఠశాల విద్యలో ప్రీ ప్రైమరీ నుంచి హయ్యర్‌ సెకండరీ విద్య వరకు మొత్తం 26.45 కోట్ల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

2018-19తో పోలిస్తే వీరి సంఖ్య 42.3 లక్షలు పెరిగినట్లు పేర్కొన్నారు. 2018-19తో పోలిస్తే, 2019-20లో ప్రాథమిక పాఠశాల విద్యలో స్థూల నమోదు నిష్పత్తి, విద్యార్ధి, ఉపాధ్యాయ నిష్పత్తి అన్ని స్థాయుల్లో మెరుగుపడింది. 

గత ఏడాదితో పోలిస్తే కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ సదుపాయాలతో పాటు పాఠశాలలకు విద్యుత్‌ సౌకర్యం గణనీయంగా పెరిగినట్లు ఆ నివేదిక తెలిపింది. 2019-20లో 96.87 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా, అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య 2.57 లక్షలు ఎక్కువని ఆ వెల్లడించింది.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.