Sunday 25 July 2021

AP POLYCET 2021 Admission Notification Online Application Important Scheduled Dates at sbtetap.gov.in

AP POLYCET 2021 Admission Notification Online Application Important Scheduled Dates at sbtetap.gov.in

AP POLYCET 2021 Admission Notification Online Application Important Scheduled Dates at sbtetap.gov.in | AP POLYCET 2021 Admission Common Entrance Test Notification Online Application Important Scheduled Dates Admission Notification for Admission into polytechnic diploma course in various polytechnic colleges for Academic year 2021 Admission Notification Online Application Important Scheduled Dates @ http://sbtetap.gov.in


AP POLYCET 2021 Admission Notification Online Application Important Scheduled Dates at sbtetap.gov.in


State Council for Technical Education and Training Andhra Pradesh - Vijayawada Announcement For candidates seeking admission in various Diploma Courses in all Polytechnics colleges in the State of Andhra Pradesh for the academic year 2021-22, the State Board of Technical Education and Training, Andhra Pradesh, Vijayawada has issued the "Polytechnic Common Entrance Test - Polycet - 2021 Notification conducting Scheduled dates below Are going to be maintained as per the details.




రాష్ట్ర సాంకేతిక విద్యా మరియు శిక్షణా మండలి ఆంధ్రప్రదేశ్ - విజయవాడ ప్రకటన 2021-22 విద్యా సంవత్సరమునకు పాలిటెక్నిక్ కామన్ ప్రవేశ పరీక్ష - పాలిసెట్ - 2021 ప్రకటన విడుదల చేసింది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్లలో వివిధ డిప్లమో కోర్సులలో ప్రవేశం కోరుతున్న అభ్యర్థుల కొరకు రాష్ట్ర సాంకేతిక విద్యా మరియు శిక్షణామండలి, ఆంధ్రప్రదేశ్, విజయవాడ వారు "పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్టు - పాలిసెట్ - 2021"ను ఈ క్రింద తెలిపిన వివరముల ప్రకారము నిర్వహించబోవుచున్నారు.


పాలిసెట్-2021 నకు హాజరగుటకు అర్హత : 


ఎస్.ఎస్.సి. లేదా తత్సమాన పరీక్ష నందు ఉత్తీర్ణత మరియు ఎస్.ఎస్.సి. లేదా తత్సమాన పరీక్షకు మార్చి/ఏప్రియల్ 2021లో హాజరైన విద్యార్థులు అర్హులు.



ముఖ్యమైన తేదీలు గమనించండి : 




  • ఆన్లైన్ దరఖాస్తు ఫారం రూ.400/
  • Helpline Centres/Gateway చెల్లింపు ద్వారా దాఖలు చేయుటకు ప్రారంభపు తేది - 26-07-2021
  • ఆన్లైన్ దరఖాస్తు ఫారం దాఖలు పరచుటకు ఆఖరి తేది  - 13-08-2021
  • పాలిసెట్ - 2021 నిర్వహించు తేది - 01-09-2021



ప్రకటన పూర్తి వివరములకు వెబ్సైట్: http://sbtetap.gov.in ను దర్శించండి మరియు

ఆన్లైన్ దరఖాస్తు దాఖలుకు https://polycetap.nic.in చూడండి.


సెప్టెంబర్ 1న పాలిసెట్ రాష్ట్రంలో 45 కోఆర్డినేషన్ కేంద్రాలు లక్షా 50వేల మంది అభ్యర్థులు హాజరు కావచ్చని అంచనా

రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే పాలీసెట్ ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తారు. (2021-22) సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్ష జరుగుతుంది.

పదవ తరగతిలో ఉత్తీర్ణులైన వారంతా పాలిసెట్కు అర్హులు. రాష్ట్రం మొత్తంగా ఇందుకోసం 45 సమన్వయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుమారు లక్షా 50 వేల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్టీఈటీ) చైర్మన్, కమిషనర్లు పరీక్షల నిర్వహణకు అనుభవం ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్న నియమిస్తారు. ప్రైవేట్ సంస్థలకు చెందిన ఓ ప్రతినిధి అసిస్టెంట్ కోఆర్డినేటర్గా నియమితులవుతారు.

విస్తృత బందోబస్తు నడుమ పరీక్షలను కట్టుదిట్టంగా ప్రశాంతంగా నిర్వహించాలని ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఆరుగురు కానిస్టేబుళ్లు, పోలీస్ అధికారులతో బందోబస్తు నిర్వహిస్తారు.

ప్రశ్నాపత్రాలను పరీక్షా సమయానికి రెండు గంటల ముందు కోఆర్డినేటర్కు అందజేస్తారు. రెవెన్యూ, పోలీస్, విద్యాశాఖ అధికారులతో ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటవుతాయి.

పాఠశాల విద్య డైరెక్టర్, కళాశాల విద్య కమిషనర్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనడ్, మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్, అన్ని విశ్వ విద్యాలయాల వైస్చన్సార్లు ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఎస్పీలు, విజయవాడ, విశాఖపట్నం అర్బన్ పోలీస్ కమిషనర్లు తమ విభాగాల నుంచి పరీక్షల నిర్వహణకు సిబ్బందిని డిప్యూటేట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.


Get Download Complete Notification Click here

Get Apply Online Application Click here


0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.