Monday, 12 July 2021

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో తగ్గిన పని దినాలు నేటి నుంచి ఆన్‌లైన్‌ తరగతులు

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో తగ్గిన పని దినాలు నేటి నుంచి ఆన్‌లైన్‌ తరగతులు

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో తగ్గిన పని దినాలు నేటి నుంచి ఆన్‌లైన్‌ తరగతులు జులై 12 నుంచి ఆన్‌లైన్‌ తరగతులకు ప్రభుత్వం అనుమతించింది. కానీ ఈసారి పని దినాలు కాస్త తగ్గడంతో ఇటు విద్యార్థులకు, అటు అధ్యాపకులకు సమయంతో పాటు ప్రణాళిక కూడా కీలకంగా మారింది జులై 12 నుంచి 2022 ఏప్రిల్‌ 23 వరకు తరగతుల నిర్వహణకు షెడ్యూలు విడుదల 


ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో తగ్గిన పని దినాలు నేటి నుంచి ఆన్‌లైన్‌ తరగతులు


ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల చేసింది. సాధారణంగా రెండో ఏడాది విద్యార్థులకు మేలోనే తరగతులు ఆరంభం కావాలి. కానీ కరోనా రెండో దశ విజృంభణ కారణంగా మే, జూన్‌ నెలల్లో కూడా నిర్వహణ సాధ్యం కాలేదు. 




ప్రస్తుత పరిస్థితులు మారడంతో జులై 12 నుంచి ఆన్‌లైన్‌ తరగతులకు ప్రభుత్వం అనుమతించింది. కానీ ఈసారి పని దినాలు కాస్త తగ్గడంతో ఇటు విద్యార్థులకు, అటు అధ్యాపకులకు సమయంతో పాటు ప్రణాళిక కూడా కీలకంగా మారింది.


వారం రోజులు తక్కువగా.


ఇంటర్‌ ద్వితీయ సంవత్సరానికి ప్రభుత్వం జులై 12 నుంచి 2022 ఏప్రిల్‌ 23 వరకు తరగతుల నిర్వహణకు షెడ్యూలు విడుదల చేసింది. దీని ప్రకారం.. మొత్తం పని దినాలు 213గా నిర్ణయించింది. జులై 12 నుంచి ఏప్రిల్‌ వరకు మొత్తం 286 రోజులు ఉండగా.. అందులో 73 రోజులు సెలవు దినాలకు కేటాయించారు. మిగిలిన 213 రోజుల్లో సిలబస్‌ పూర్తి చేయటం, పరీక్షలు, ప్రయోగ పరీక్షలు నిర్వహించటం వంటి అంశాలకు తేదీలు ఖరారు చేశారు. గతంలో పని దినాలు 220గా ఉండేవి. ఈసారి అంతకంటే ఏడు రోజుల తక్కువ పని దినాలతో ఇంటర్‌ ద్వితీయ వార్షిక ప్రణాళిక సిద్ధం చేశారు.


పూర్తి సిలబస్‌తో పాఠ్యాంశాలు


గత ఏడాది డిసెంబరులో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం తరగతులు ప్రారంభించారు. ఇంటర్‌లో 30 శాతం సిలబస్‌ తగ్గించి పాఠ్యాంశాలు పూర్తి చేశారు. కరోనా రెండో దశ నేపథ్యంలో పరీక్షలు కూడా నిర్వహించలేదు. ఇంటర్‌ మొదటి ఏడాదిలో 70, పదో తరగతిలో 30 శాతం మార్కులతో ద్వితీయ సంవత్సరం మార్కులు కేటాయించనున్నారు. కానీ ఈ విద్యా సంవత్సరం 2021-22 ద్వితీయ సంవత్సరానికి సిలబస్‌ పూర్తి చేయాల్సి ఉంది. సిలబస్‌లో కోత లేదు. 213 రోజుల్లో మొత్తం సిలబస్‌ పూర్తి చేయాల్సిన బాధ్యత అధ్యాపకులపై ఉంది.


విద్యార్థుల హాజరు తప్పనిసరి ప్రిన్సిపాళ్ల నుంచి లాగిన్‌ కావాలి -  పి.రవికుమార్‌, ఇంటర్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి


ఆన్‌లైన్‌ తరగతులు అయినప్పటికీ నిత్యం విద్యార్థుల హాజరు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. అమ్మఒడి లేదా ఇతర పథకాలకు ఈ హాజరు శాతం పరిగణలోకి తీసుకుంటారు. హాజరు ఉంటేనే పరీక్షలకు అనుమతించే అవకాశం ఉంది.

ఈనెల 12 నుంచి ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపాల్స్‌ నుంచి లాగిన్‌ అయి పాసువర్డులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆన్‌లైన్‌ హాజరును పరిగణలోకి తీసుకుంటాం. విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులు శ్రద్ధగా విని సద్వినియోగం చేసుకోవాలి

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఆన్‌లైన్‌ తరగతుల నిర్ణయం మంచిదే. లేకుంటే విద్యా సంవత్సరం వృథా అవుతుంది. ఇంటర్‌ పూర్తి కాకుంటే పోటీ పరీక్షలకు రాయలేరు. త్వరగా ద్వితీయ సంవత్సరం పూర్తయితే అనంతరం ఐఐటీ, నిట్‌, ఈఏపీసెట్‌ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకునే అవకాశముంది.


కళాశాలలకు ఆదేశాలు


ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణలో భాగంగా సోమవారం నుంచి ఉదయం 9.30 గంటలకు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఆయా కళాశాలలకు తప్పనిసరిగా రావాల్సిందిగా ఆర్‌ఐవో ఆదేశాలు జారీ చేశారు. ఇంటి వద్ద అధ్యాపకులు ఆన్‌లైన్‌ తరగతులు చెప్పే విధానానికి అడ్డుకట్ట వేయడానికి ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రిన్సిపల్‌ వద్ద నుంచి లాగిన్‌ అవడానికి కావాల్సిన పాస్‌వర్డులను విద్యార్థులకు ఇవ్వనున్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆన్‌లైన్‌ తరగతుల నిమిత్తం విద్యార్థులు సెల్‌ఫోన్లు సిద్ధం చేసుకోవాలని ఆదేశాలిచ్చారు. ఆన్‌లైన్‌ తరగతుల పర్యవేక్షణ బాధ్యతలు ఆర్‌ఐవో, ఆర్‌జేడీ, డీఈవోలు చూస్తారు.


ప్రథమ సంవత్సరంపై స్పష్టత కరవు


పదో తరగతి ఫలితాలను విద్యాశాఖ త్వరలో విడుదల చేయనుంది. ఇప్పటికే కొన్ని ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలలు విద్యార్థులను కళాశాలల్లో చేర్చుకుని ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నాయి. ఇంటర్‌ బోర్డు నుంచి ప్రథమ సంవత్సరం అడ్మిషన్లకు సంబంధించి ఎలాంటి స్పష్టత రాలేదు. గత ఏడాది ఆన్‌లైన్‌ ద్వారా అడ్మిషన్లు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై కొందరు కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు మేరకు గత ఏడాది ఆన్‌లైన్‌ అడ్మిషన్ల నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఈ ఏడాది అడ్మిషన్లకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చాకా స్పష్టత రానుంది. ఈ సంవత్సరం ఆన్‌లైన్‌ అడ్మిషన్లు అమలు చేస్తారని అధికారవర్గాల సమాచారం.

ఇప్పటివరకు ప్రథమ సంవత్సరం అడ్మిషన్లకు బోర్డు అనుమతులు ఇవ్వలేదు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలి"

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.