Tuesday, 27 July 2021

సచివాలయాల ఉద్యోగుల్లో ప్రొబేషన్‌ ఖరారుకు శాఖాపరమైన పరీక్షలు నేడు సీఎంవోలో ఉన్నతస్థాయి సమావేశం పరీక్షలపై స్పష్టత వచ్చే అవకాశం

సచివాలయాల ఉద్యోగుల్లో ప్రొబేషన్‌ ఖరారుకు శాఖాపరమైన పరీక్షలు నేడు సీఎంవోలో ఉన్నతస్థాయి సమావేశం పరీక్షలపై స్పష్టత వచ్చే అవకాశం

సచివాలయాల ఉద్యోగుల్లో ప్రొబేషన్‌ ఖరారుకు శాఖాపరమైన పరీక్షలు నేడు సీఎంవోలో ఉన్నతస్థాయి సమావేశం పరీక్షలపై స్పష్టత వచ్చే అవకాశం వాలంటీర్లకు వారంలో మూడుసార్లు బయోమెట్రిక్‌ హాజరు


సచివాలయాల ఉద్యోగుల్లో ప్రొబేషన్‌ ఖరారుకు శాఖాపరమైన పరీక్షలు నేడు సీఎంవోలో ఉన్నతస్థాయి సమావేశం పరీక్షలపై స్పష్టత వచ్చే అవకాశం


ప్రొబేషన్‌ ఖరారు చేసేందుకు పరీక్షలు నిర్వహిస్తారా? ఎన్ని పరీక్షలు పెడతారు? రాయకపోతే ఏమవుతుంది? రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులందరిలో ప్రస్తుతం ఇవే ప్రశ్నలు. వీటిపై ఉద్యోగ సంఘాల నాయకులు రోజుకో రకంగా ప్రకటనలు చేయడంతో ఉద్యోగుల్లో ఆందోళన మరింత పెరుగుతోంది.




రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.21 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో 2021 అక్టోబరు 2 నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారికి ప్రొబేషన్‌ ఖరారు చేసి శాశ్వత ఉద్యోగులుగా పరిగణించాలి. ఇందుకోసం శాఖాపరమైన అంశాలపై పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సన్నాహాలు చేస్తోంది.

సంబంధిత ఉద్యోగులకు శాఖాపరమైన అంశాలపై ఉన్న అవగాహనను తెలుసుకునేందుకు మరో పరీక్ష నిర్వహించనున్నారు. వంద మార్కులకు రెండు పరీక్షలూ నిర్వహించి, ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారికే ప్రొబేషన్‌ ఖరారు చేస్తారన్న ప్రచారంపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు

ఉద్యోగుల ప్రొబేషన్‌ ఖరారుకు ఎలాంటి విధానాన్ని అమలు చేస్తే బాగుంటుందని అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. రెండు దశల్లో ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ మొదట ప్రతిపాదించింది. దీనిపై ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం కావడంతో పునఃపరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై సీఎం కార్యాలయ అధికారులతో సచివాలయాల శాఖ అధికారులు మంగళవారం సమావేశమవుతున్నారు. ప్రొబేషన్‌ ఖరారు చేసేందుకు ఒక పరీక్ష సరిపోతుందా? రెండూ నిర్వహించాలా? అనే విషయంలో ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది


వాలంటీర్లకు వారంలో మూడుసార్లు బయోమెట్రిక్‌ హాజరు


గ్రామ, వార్డు సచివాలయాలకు అనుబంధంగా పని చేస్తున్న వాలంటీర్లకు వారంలో మూడు రోజులు (సోమ, బుధ, శుక్రవారాల్లో) బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి కానుంది. ఇప్పటికే ఉన్న ఈ నిబంధనను ఆగస్టు 1 నుంచి కచ్చితంగా అమలు చేయనున్నారు. ఈ మేరకు సంయుక్త కలెక్టర్లు.. సచివాలయాలను పర్యవేక్షించే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  బయోమెట్రిక్‌ హాజరు ఆధారంగానే గౌరవ వేతనం లెక్కించి చెల్లించనున్నారు.

1 comment:

Note: only a member of this blog may post a comment.