Monday, 19 July 2021

ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పధకం ఇంటర్మీడియట్‌ నుంచి పీజీ విద్యార్థినులకు విద్యా రుణం

ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పధకం ఇంటర్మీడియట్‌ నుంచి పీజీ విద్యార్థినులకు విద్యా రుణం

ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పధకం ఇంటర్మీడియట్‌ నుంచి పీజీ విద్యార్థినులకు విద్యా రుణం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకాన్ని అమలులోకి తెచ్చింది ఎస్‌బీఐ, కెనరా, విజయ, ఐవోబీ, యూనియన్‌, ఐడీబీఐ, యూబీఐ తదితర బ్యాంకుల ద్వారా రుణాలు పొందవచ్ఛు రూ.4.5 లక్షల వరకు రుణానికి కేంద్ర ప్రభుత్వమే వడ్డీ భరిస్తుంది Guidelines for Registration Vidya Lakshmi Portal


ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పధకం ఇంటర్మీడియట్‌ నుంచి పీజీ విద్యార్థినులకు విద్యా రుణం


ఇంటర్మీడియట్‌ నుంచి పీజీ వరకు విద్యా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్ఛు పేద, మధ్యతరగతి వర్గాలకు ఉన్నత విద్య అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకాన్ని అమలులోకి తెచ్చింది.




Welcome to Vidya Lakshmi Portal Vidya Lakshmi Portal provides single window for Students to access information about various loan schemes provided by banks and make applications for Educational Loans.

If you want to apply for education loan on Vidya Lakshmi portal, you must register on portal. Please provide essential details as mentioned in registration form.


Important Instructions


Please ensure that the registration details filled in are correct

Please enter password in required format


Guidelines for Registering on Vidya Lakshmi Portal


Name- Please enter student name as per 10th class marksheet or as per the marksheet attached with your loan application

Mobile Number- Enter a valid mobile number. Student can provide mobile number of parent/guardian

Email ID- Enter a valid email ID. Email ID will not be allowed to change. All necessary communications will be sent on this email ID.

కేంద్ర ఆర్థిక, ఉన్నత విద్య, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలు, ఇండియన్‌ బ్యాంక్‌ అసోసియేషన్‌ (ఏబీఏ) సంయుక్తంగా విద్యాలక్ష్మి పోర్టల్‌ను రూపొందించాయి. ఎన్‌ఎస్‌డీఎల్‌ ఈ-గవర్నర్స్‌ వ్యవస్థ ద్వారా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లో విద్యాలక్ష్మి పోర్టల్‌ అని క్లిక్‌ చేయగానే వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి.

39 రకాల బ్యాంకులు విద్యాలక్ష్మి పోర్టల్‌లో నమోదై ఉన్నాయి. 130 రకాల విద్యా రుణాల్ని అవి అందిస్తున్నాయి. ఎస్‌బీఐ, కెనరా, విజయ, ఐవోబీ, యూనియన్‌, ఐడీబీఐ, యూబీఐ తదితర బ్యాంకుల ద్వారా రుణాలు పొందవచ్ఛు


2021-22 విద్యా సంవత్సరానికి  రుణాల్ని మంజూరు చేసేందుకు కార్యచరణ సిద్ధమైంది.


ఇంటర్మీడియట్‌, గ్రాడ్యుయేషన్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, పీజీ డిప్లమో ఇన్‌ ప్రొఫెషనల్‌ కోర్సులు, కాస్ట్‌ అకౌంటెన్సీ, ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌, ఐఐఎం మేనేజ్‌మెంట్‌, ఐఐటీ, వృత్తి విద్యాకోర్సులు, విమానయాన రంగానికి సంబంధించి ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ కోర్సులకు రుణాలిస్తారు.

యూజీసీ, ఏఐసీటీఈ, ఎంసీఐ, ఇతర ప్రభుత్వ అధీకృత సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో చదువుకునే వారికి మాత్రమే రుణాలు అందజేస్తారు.

రూ.4.5 లక్షల వరకు రుణానికి కేంద్ర ప్రభుత్వమే వడ్డీ భరిస్తుంది. బాలికల విద్యను ప్రోత్సహించడంలో భాగంగా విద్యార్థినులకు మరింత రాయితీ ఉంటుంది. రుణం రూ.7.5 లక్షలు దాటితే పూచీకత్తు ఉండాలి. రూ.10 లక్షల వరకు రుణాన్ని పొందవచ్ఛు

మూడు పద్ధతుల్లో సులభంగా విద్యా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్ఛు తొలుత విద్యాలక్ష్మి పోర్టల్‌లో నమోదవ్వాలి. ఆ తరువాత దరఖాస్తు పూరించాలి. చివరగా ఇష్టమైన బ్యాంకులను ఎంపిక చేసుకోవాలి. ఒకేసారి గరిష్ఠంగా మూడు వేర్వేరు బ్యాంకుల్ని ఎంపిక చేసుకోవచ్ఛు ఈ ప్రక్రియ సాఫీగా పూర్తయితే రుణానికి సంబంధించిన వివరాలు సెల్‌ఫోన్‌, ఈ-మెయిల్‌కు ఎప్పటికప్పుడు వస్తాయి.

విద్యాలక్ష్మి పోర్టల్‌ ద్వారా జాతీయస్థాయి ప్రతిభా ఉపకార వేతనాలకు సైతం దరఖాస్తు చేసుకోవచ్ఛు ఎక్కువ మంది విద్యార్థులు, ఉన్నత చదువులు పూర్తి చేసిన వారిని ఈ పోర్టల్‌తో అనుసంధానం చేయడంలో భాగంగా ప్రతిభా ఉపకార వేతనాల వివరాలను కూడా ఇందులో పొందుపరుస్తున్నారు.


Get visit official website Click here


Get Apply and Registration Vidya Lakshmi Portal


0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.