మున్సిపాల్ పురపాలక బడుల్లో నేటి నుంచే ఆన్‌లైన్ పాఠాలు ప్రతి పట్టణంలో ఎడ్యుకేషన్ సెల్ ఏర్పాటు జూమ్ యాప్ లింకు ద్వారా ఏకకాలంలో 300 మందికి బోధన అందేలా చర్యలు తీసుకున్నారు. 7 నుంచి 10 తరగతుల విద్యార్థులకు పాఠాల బోధన ఉండబోతోంది. వీరిలో 9, 10 తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్ బోధన, అభ్యసనపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు
మున్సిపాల్ పురపాలక బడుల్లో నేటి నుంచే ఆన్‌లైన్ పాఠాలు
కొవిడ్‌తో ఇప్పట్లో పాఠశాలలు పూర్తిస్థాయిలో తెరచుకునే అవకాశం లేకపోవడంతో ఆన్‌లైన్ బోధనకు పురపాలకశాఖ పర్యవేక్షణలోని బడులు సిద్ధమయ్యాయి ఇప్పటికే ఆన్‌లైన్ బోధన, అభ్యసనపై ఉపాధ్యాయులు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఒక్కో జూమ్ యాప్ లింకు ద్వారా ఏకకాలంలో 300 మందికి బోధన అందేలా చర్యలు తీసుకున్నారు. 7 నుంచి 10 తరగతుల విద్యార్థులకు పాఠాల బోధన ఉండబోతోంది. వీరిలో 9, 10 తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్ బోధన, అభ్యసనపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
రోజూ ఉదయం 9.45 నుంచి 12గంటల వరకు రెండు పాఠ్యాంశాలు. మధ్యాహ్నం 1.45 నుంచి సాయంత్రం 4 వరకు మిగిలిన తరగతులు నిర్వహిస్తారు. ఒక్కో తరగతికి రోజూ నాలుగు పిరియడ్లు, తెలుగు, హిందీ, ఆంగ్లం, బయోలజీ, సోషల్ స్టడీస్‌కు వారంలో 3 చొప్పున, లెక్కలకు 5, భౌతికశాస్త్రానికి 4 పిరియడ్లను కేటాయించారు.
ప్రతి పట్టణంలోనూ యూఎల్‌బీ ఎడ్యుకేషన్ సెల్ ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ తరగతుల్ని ఈ సెల్ పర్యవేక్షిస్తుంది. బడుల్లో బోధనకు అవసరమైన సామగ్రిని ఈ సెల్ ద్వారా సమకూర్చుతున్నారు. పురపాలక మేనేజర్, పాఠశాలల పర్యవేక్షకుడు, ప్రధానోపాధ్యాయుడితో కూడిన బృందం ఏ సమయంలో ఏ ఉపాధ్యాయుడు బోధన చేయనున్నారు, ఆ సమయంలో ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారనే వివరాల్ని పరిశీలిస్తుంది.
ఆన్‌లైన్‌లో పాఠాల బోధన, విద్యార్థుల హాజరును రోజూ నమోదు చేసుకుంటారు మొబైల్ స్టాండ్లు, బ్లూటూత్‌లు, జూమ్ తరగతుల నిర్వహణకు కెమెరాల్ని కొనుగోలు చేశారు. విజయవాడ నగరంలోని 28 పాఠశాలల ఉపాధ్యాయులు పది రోజుల క్రితం ఆన్‌లైన్ బోధన, అభ్యసనపై సన్నాహాక తరగతుల్ని విజయవంతంగా నిర్వహించారు. పాఠ్యాంశాల వీడియోలను రూపొందించి జూమ్ యాప్ లింకు ద్వారా పిల్లలకు పంపించవచ్చు
గుంటూరు జిల్లాలో గుంటూరు నగరంతో పాటు తెనాలి, మంగళగిరి, పొన్నూరు, బాపట్ల, నరసరావుపేట, వినుకొండ, చిలకలూరిపేట, రేపల్లెలో కలిపి 280 పురపాలక పాఠశాలలు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో విజయవాడ నగరంతో పాటు గుడివాడ, మచిలీపట్నంలో కలిపి మొత్తం 183 పుర బడులు నడుస్తున్నాయి
డీఎంఏ ఆదేశాల మేరకు పురబడుల్లో ఆన్‌లైన్ తరగతుల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు గుంటూరు ఆర్డీ జి.శ్రీనివాసరావు ‘న్యూస్‌టుడే’తో అన్నారు. ఆన్‌లైన్ బోధన, అభ్యసనను పట్టణ స్థాయిలో ఏర్పాటు చేసే యూఎల్‌బీ ఎడ్యుకేషన్ సెల్ పర్యవేక్షిస్తుందని చెప్పారు. సాంకేతిక వనరులు అందుబాటులో ఉన్న విద్యార్థులందరూ ఆన్‌లైన్ తరగతులకు హాజరవ్వాలని కోరారు.
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.