పది ఫలితాలు సిద్ధం రెండు, మూడు రోజులో వెల్లడి ఎఫ్ఎ, స్లిప్ టెస్ట్ల ఆధారంగా గ్రేడ్లు - విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
పది ఫలితాలు సిద్ధం రెండు, మూడు రోజులో వెల్లడి
రెండు, మూడు రోజుల్లో పదో తరగతి ఫలితాలను ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. బుధవారం ఓ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పదో తరగతి ఫలితాలపై స్పందించారు. 2020-21లో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు గ్రేడ్లు కేటాయిస్తామన్నారు. కరోనా కారణంగా పది పరీక్షలను రద్దు చేసినందున పరీక్ష ఫీజు కట్టిన వారందర్నీ ఉత్తీర్ణులుగా పరిగణిస్తున్నామని స్పష్టం చేశారు.
పది ఫలితాలను గ్రేడ్లుగా ప్రకటించేందుకు నిపుణుల బృందంతో ఒక కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. పదో తరగతి విద్యార్థుల ఫార్మేటివ్ అసెస్స్మెంట్(ఎఫ్ఎ)–1,ఎఫ్ఎ-2 పరీక్షల మార్కులు విద్యాశాఖ దగ్గర ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయన్నారు.
స్లిప్ టెస్ట్లు, ప్రాజెక్టు వర్కులు, ఎఫ్ఎ పరీక్షలకు, విద్యార్థుల భాగస్వామ్యం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని మార్కులు కేటాయిస్తామని వివరించారు. స్లిప్ టెస్ట్లకు 70శాతం, ఎఫ్ఎ టెస్ట్లకు 30శాతం మార్కులుగా నిర్ణయించి, విద్యార్థులకు గ్రేడ్లతో ఫలితాలను వెల్లడిస్తామని చెప్పారు.
విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించలేకపోయినందునే ఏపీ ఎంసెట్లో ఇంటర్ వెయిటేజీ రద్దు చేశామన్నారు. ఎంసెట్లో 150 మార్కుల ఆధారంగా ర్యాంకింగ్ కేటాయిస్తామని, ఇంటర్ మార్కులను పరిగణలోకి తీసుకోబోమని పేర్కొన్నారు.
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.