ఏపీ టెన్త్, ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ గ్రేడ్ల విధానంతో ఫలితాలు త్వరలోనే! తాజాగా టెన్త్, ఇంటర్ ఫలితాలపై ఏపీ విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఫలితాలపై నివేదిక రెడీ చేసింది. గ్రేడ్ల విధానంతో మార్కులు విడుదల చేయాలని నిర్ణయించింది
ఏపీ టెన్త్, ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ గ్రేడ్ల విధానంతో ఫలితాలు త్వరలోనే
అమరావతి: కరోనా కారణంగా ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు అయిన విషయం తెలిసిందే. దాంతో ఫలితాలు ఎలా ఉంటాయోనని విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. తాజాగా టెన్త్, ఇంటర్ ఫలితాలపై ఏపీ విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఫలితాలపై నివేదిక రెడీ చేసింది.
గ్రేడ్ల విధానంతో మార్కులు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇంటర్, టెన్త్ ఇంటర్ పరీక్షలు విడుదల చేయనుంది.
టెన్త్, ఇంటర్ ఫలితాలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ బుధవారం మీడియా సమావేశం నిర్వహించి క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే టెన్త్, ఇంటర్ పరీక్షలను విడుదల చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. ఫలితాల ప్రకటనపై ఇప్పటికే సీఎం జగన్‌కు ప్రతిపాదనలు పంపామన్నారు.
త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. టెన్త్ పరీక్షల ఫలితాలు ప్రకటించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామని ఆదిమూలపు సురేశ్ తెలిపారు.
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.