Monday, 26 July 2021

రాష్ట్రంలో త్వరలో ఆరు రకాల పాఠశాలలు జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా నిర్ణయం

రాష్ట్రంలో త్వరలో ఆరు రకాల పాఠశాలలు జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా నిర్ణయం

రాష్ట్రంలో త్వరలో ఆరు రకాల పాఠశాలలు జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా నిర్ణయం జూనియర్‌ కళాశాలలతో హైస్కూల్‌ ప్లస్‌ ఏర్పాటు


రాష్ట్రంలో త్వరలో ఆరు రకాల పాఠశాలలు జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా నిర్ణయం


రాష్ట్రంలో ప్రస్తుతం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత... ఇలా మూడు రకాల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. త్వరలో ఇవి ఆరు రకాలుగా మార్పు చెందనున్నాయి. పూర్వ ప్రాథమిక విద్య(పీపీ)-1, 2 ప్రవేశ పెట్టడం, జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా ప్రభుత్వం ఈ మార్పులు తీసుకురాబోతోంది అంగన్‌వాడీలు - ప్రాథమిక బడులు - ఉన్నత పాఠశాలలకు మధ్య ఉన్న దూరానికి సంబంధించి ఇప్పటికే విద్యాశాఖ సర్వే నిర్వహించింది. దీని ఆధారంగా విద్యా వ్యవస్థలో మార్పులు చేస్తోంది. కొత్త విధానంలో పూర్వ ప్రాథమిక విద్య నుంచి 12వ తరగతి వరకు ఆరు రకాల పాఠశాలలు అందుబాటులోకి వస్తాయి.




అంగన్‌వాడీలను శాటిలైట్‌ ఫాండేషన్‌ పాఠశాలలుగా మార్పు చేస్తారు. ఇక్కడ పీపీ-1, 2 మాత్రమే బోధిస్తారు. ప్రాథమిక పాఠశాలలకు దూరంగా ఉన్న ప్రతి ఆవాసంలోనూ వీటిని ఏర్పాటు చేస్తారు

పీపీ-1, 2, ఒకటి, రెండు తరగతులు బోధించే బడులను ఫౌండేషన్‌ పాఠశాలలుగా పిలుస్తారు. విద్యార్థుల ఆవాసాలకు కిలోమీటరులోపు దూరంలో ఇవి ఉంటాయి. ఉన్నత పాఠశాలలకు సమీపంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను తీసుకెళ్లి, హైస్కూళ్లలో కలుపుతారు. మిగిలే 1, 2 తరగతులకు అదనంగా పీపీ-1, 2 ప్రారంభిస్తారు.

ఉన్నత పాఠశాలలకు దూరంగా ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో పీపీ-1, 2 ప్రారంభించి, వీటిని ఫౌండేషన్‌ ప్లస్‌ బడులుగా మారుస్తారు. వీటిలో పీపీ-1, 2తోపాటు 1-5 తరగతులు ఉంటాయి.

ప్రాథమికోన్నత పాఠశాలల స్థానంలో ప్రీహైస్కూళ్లు రానున్నాయి. వీటిలో పీపీ-1, 2తోపాటు 1-7 తరగతులు ఉంటాయి.

ప్రస్తుత ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10 తరగతులు ఉండగా... ఇకపై 3-10 తరగతులు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఉన్నత పాఠశాలలకు సమీపం లేదా అదే ప్రాంగణంలోని ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను తీసి, ఉన్నత పాఠశాలల్లో కలుపుతారు.

విద్యార్థుల డిమాండును అనుసరించి ప్రతి మండలానికి ఒకటి/రెండు జూనియర్‌ కళాశాలలను ప్రారంభించాలని ఆలోచిస్తున్నారు. వీటిని ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేయడంతోపాటు ఇప్పటికే ఉన్న కొన్ని కళాశాలలను దూరాన్ని అనుసరించి పాఠశాలల ప్రాంగణానికి తరలిస్తారు. 3-12 తరగతులు ఏర్పాటు చేసి, హైస్కూల్‌ ప్లస్‌గా మార్పు చేస్తారు

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.