ఓటర్ కార్డులో అడ్రస్ ను సులభంగా మార్చుకునే విధానం ఆఫ్ లైన్ తో పాటు ఆన్ లైన్ లో కూడా ఓటర్ కార్డుకు సంబంధించిన అడ్రస్ ను సులభంగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి.
ఓటర్ కార్డులో అడ్రస్ను సులభంగా మార్చుకునే విధానం
ఆన్ లైన్ లో ఓటర్ కార్డ్ అడ్రస్ మార్చుకోవాలని అనుకునే వాళ్లు మొదట https://www.nvsp.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేసి ఆ వెబ్ సైట్ లో వివరాలతో లాగిన్ కావాల్సి ఉంటుంది
లాగిన్ అయిన తర్వాత అందులో forms పై క్లిక్ చేయాలి
అందులో వేర్వేరు ఫామ్స్ అందుబాటులో ఉండగా form8a పై క్లిక్ చేయాల్సి ఉంటుంది
అందులో రాష్ట్రం, పుట్టినతేదీ, ప్రస్తుత అడ్రస్, పర్మినెంట్ అడ్రస్, నియోజకవర్గం వివరాలను ఎంటర్ చేయాలి
ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ను కూడా ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి
ఒకే నియోజకవర్గంలో అడ్రస్ మారితే form 8a వేరే నియోజకవర్గంలోకి అడ్రస్ మార్చాలనుకుంటే form 6 ఉపయోగించాలి
ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకుని ఆ ఫామ్ కు అవసరమైన డాక్యుమెంట్లను జత చేసి ఎన్నికల అధికారి కార్యాలయంలో వాటిని అందజేయాల్సి ఉంటుంది
సబ్మిట్ చేసిన అప్లికేషన్ స్టేటస్ ను తెలుసుకోవాలంటే వెబ్ సైట్ లో track application status పై క్లిక్ చేసి స్టేటస్ ను సులభంగా తెలుసుకోవచ్చు
Get Updated Adress in your Voter card Click here
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.