Wednesday, 14 July 2021

CFMS ప్రక్షాళన దిశగా ఆర్థికమంత్రి కొత్త సంస్థతో అనుసంధానానికి యత్నాలు

CFMS ప్రక్షాళన దిశగా ఆర్థికమంత్రి కొత్త సంస్థతో అనుసంధానానికి యత్నాలు

CFMS ప్రక్షాళన దిశగా ఆర్థికమంత్రి కొత్త సంస్థతో అనుసంధానానికి యత్నాలు వరుస ఆరోపణలతో సర్కారు ఆలోచన


CFMS ప్రక్షాళన దిశగా ఆర్థికమంత్రి కొత్త సంస్థతో అనుసంధానానికి యత్నాలు

 

 గత కొన్నేళ్లుగా ఆర్ధికశాఖలో కీలకంగా మారిన సిఎఫ్ఎంఎస్ (సమగ్ర ఆర్ధిక నిర్వహణ సిస్టమ్)పై రాష్ట్ర ప్రభుత్వం పెదవి విరుస్తోంది. దీని స్థానంలో కొత్త విధానాన్ని అమలులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సాంకేతికంగా సహాయ సహకారాలు అందిస్తున్న శాప్ సాఫ్ట్వేర్ సంస్థకు ప్రత్యామ్నాయంగా ఇంకొక సంస్థను తీసుకురావాలని భావిస్తోంది. తెరపైకి తీసుకురావాలని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించారు. 




గతంలో ట్రెజరీల ద్వారా నిర్వహించిన ఆర్ధిక లావాదేవీలు సాంకేతిక సహాయంతో నిర్వహించేందుకు గాను 2018 ఏప్రిల్లో సిఎఫ్ఎంఎస్ ను ఏర్పాటుచేశారు. ఈ విభాగం ద్వారా అనేక అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలు, ఒకే బిల్లుకు రెండేసి చెల్లింపులు వంటివి తరచూ సంభవించాయి. 

దీనికి తోడు ప్రభుత్వంతో సంబంధం లేని ఒక కన్సల్టెంట్ కు ఏకంగా సిఇఓ పదవి ఇవ్వడం వల్ల కూడా ఆర్థిక లావాదేవీలపై ప్రభుత్వం పట్టుకోల్పోయే పరిస్థితి నెలకొంది. ఇద్దరు ఐఎఎస్లు దీనిని పర్యవేక్షిస్తున్నా ఫలితం కనపడకపోవడంతో సిఎఫ్ఎంఎస్ ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 

ముందుగా సిఎఫ్ఎంఎసకు సాంకేతిక సహాయకారిగా ఉంటున్న ఎస్ఎపి సంస్థకు ప్రత్యామ్నాయంగా సిఎస్పిజి, ఇడిబి  వంటి సంస్థలను తయారుచేసుకోవాలని భావిస్తున్నట్లు బుగ్గన వెల్లడించారు. సమాంతరంగా ఇంకో సంస్థ కూడా ఉంటే ఫలితాలు మెరుగ్గా ఉంటాయన్న భావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.