Sunday, 4 July 2021

త్వరలో బ్యాక్ లాగ్ DSC నోటిఫికేషన్

త్వరలో బ్యాక్ లాగ్ DSC నోటిఫికేషన్ బ్యాక్ లాగ్ పోస్టుల్లో పాఠశాల, బీసీ, ట్రైబల్, సోషల్ వెల్ఫేర్ విభాగాల్లో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల ఖాళీలున్నాయి

త్వరలో బ్యాక్ లాగ్ DSC నోటిఫికేషన్ బ్యాక్ లాగ్ పోస్టుల్లో పాఠశాల, బీసీ, ట్రైబల్, సోషల్ వెల్ఫేర్ విభాగాల్లో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల ఖాళీలున్నాయి


త్వరలో బ్యాక్ లాగ్ DSC నోటిఫికేషన్


త్వరలో వివిధ విభాగాల ప్రభుత్వ విద్యా సంస్థల నుంచి బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకిగాను డీఎస్సీ రానుంది. 




రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బ్యాక్ లాగ్ పోస్టుల్లో పాఠశాల, బీసీ, ట్రైబల్, సోషల్ వెల్ఫేర్ విభాగాల్లో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల ఖాళీలున్నాయి. వాటన్నిటికీ కలిపి బ్యాక్లాగ్ డీఎస్సీ విధానంలో నోటిఫికేషన్లు జారీజేయనున్నారు.

ఈనెలఖరులోగా ఆ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ట్రైబల్ వెల్ఫేర్లో పోస్టు గ్రాడ్యుయేషన్ టీచర్ (పీజీటీ)-3, ట్రైన్ గ్రాడ్యుయేషన్ టీచర్ (టీజీటీ)-2 ఖాళీలున్నాయి. బీసీ వెల్ఫేర్ పీజీటీ-8, టీజీటీ-1 ఖాళీలను డీఎస్సీ(డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ) ద్వారా భర్తీ చేయాలని ఆర్థికశాఖ ఆదేశించింది.

సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ గ్రేడ్-2 పోస్టులు-1, టీజీటీ - 38, కేర్ టేకర్ వార్డెన్-7 పోస్టులున్నాయి. వాటిని సోషల్ వెల్ఫేర్ ద్వారా నోటిఫికేషన్ ఇస్తారు.

స్కూల్ ఎడ్యుకేషన్లో ఎస్సీ, ఎస్టీలకు లాంగ్వేజీ పండిట్లు/మ్యూజిక్ టీచర్లు- 30, పీజీటీ -53, స్కూల్ అసిస్టెంట్-39, సెకండరీ గ్రేడ్ టీచర్స్-7 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీకి ఆర్థికశాఖ ఆదేశించింది.

కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జూనియర్ లెక్చరర్లు - 54 ఖాళీల భర్తీ బాధ్యతలను ఏపీపీఎస్సీకి అప్పగించింది.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.