Wednesday, 21 July 2021

రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారిని కలిసిన రాష్ట్ర ఉపాధ్యాయ FAPTO ప్రతినిధి బృందం

రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారిని కలిసిన రాష్ట్ర ఉపాధ్యాయ FAPTO ప్రతినిధి బృందం

రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారిని కలిసిన  రాష్ట్ర ఉపాధ్యాయ FAPTO ప్రతినిధి బృందం నెలవారీ పదోన్నతులు,NEP పై పరిశీలన, ఉమ్మడి సర్వీసు రూల్స్ అంశం పై సుదీర్ఘ చర్చ 


రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారిని కలిసిన  రాష్ట్ర ఉపాధ్యాయ FAPTO ప్రతినిధి బృందం


ఈ రోజు సాయంత్రం రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారిని  రాష్ట్ర ఫ్యాప్టో చైర్మన్ శ్రీ CH జోసఫ్ సుధీర్ బాబు గారి ఆధ్వర్యంలో  రాష్ట్ర FAPTO ప్రతినిధి బృందం  కలిసి ఉపాధ్యాయుల సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిపింది.




1 . నెలవారీ పదోన్నతుల ప్రక్రియ ఆగిపోయిందని మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లగా మంత్రి గారు స్పందిస్తూ వెంటనే  నెలవారీ పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించాలని రాష్ట్ర విద్యాశాఖాధికారులకు   ఆదేశాలు జారీ చేసారు 

2. NEP పై FAPTO  సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించిన మంత్రివర్యులు FAPTO ప్రతిపాదనల ను  గౌరవ  ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి ఉపాధ్యాయ సంఘాలకు ఆమోదయో గ్యంగా ఉండే విధంగా NEP పై ముందు కెళ్తామని తెలిపారు 

3 .రెండు దశాబ్దాలకు పైగా ఉన్న ఉమ్మడి సర్వీసు రూల్స్ అంశం పై మంత్రి గారు స్పందిస్తూ   భవిష్యత్తులో గౌరవ న్యాయస్థానాల్లో ఇబ్బందులు కలుగకుండా ఉండేవిధంగా పకడ్బందీగా రూపొందించి అమలు పరచటానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని త్వరలో మంత్రి గారి ఆధ్వర్యములో సంఘాలతో సర్వీసు రూల్స్ పై సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.

ఈ సమావేశములో FAPTO చైర్మన్ CH జోసఫ్ సుధీర్ బాబు ,సెక్రటరీ జనరల్ చేబ్రోలు శరత్ చంద్ర, కో - ఛైర్మన్స్ నక్కా వెంకటేశ్వర్లు ,కె. వెంకటేశ్వరరావు కార్యవర్గ సభ్యులు K S S ప్రసాద్ పాల్గొన్నారు .

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.