Tuesday, 6 July 2021

Income tax ఐటీఆర్ ఫైలింగ్ గడువు సెప్టెంబర్ 30కు పెంపు

Income tax ఐటీఆర్ ఫైలింగ్ గడువు సెప్టెంబర్ 30కు పెంపు జులైతో ముగియనున్న గడువు

Income tax ఐటీఆర్ ఫైలింగ్ గడువు సెప్టెంబర్ 30కు పెంపు జులైతో ముగియనున్న గడువు


Income tax ఐటీఆర్ ఫైలింగ్ గడువు సెప్టెంబర్ 30కు పెంపు


2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్కం ట్యాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్) ఫైలింగ్ గడువును పొడగించారు. సెప్టెంబర్ 30, 2021 వరకు ఐటీఆర్ ఫైలింగ్ చేసే అవకాశం ఉందని ఆదాయపన్ను శాఖ తెలిపింది. సాధారణంగా ఆదాయ పన్ను చట్టం ప్రకారం వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయాల్సిన తేదీ జులై 31 వరకు నిర్ణయించారు. 




సీబీడీటీ వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల ఆదాయపు పన్ను రిటర్న్స్ ను సెప్టెంబర్ 30, 2021 వరకు దాఖలు చేయాల్సి ఉంది. 

ఇప్పుడు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుడు తన ఆదాయపు పన్ను రిటర్న్స్ ను సెప్టెంబర్ 30 వరకు దాఖలు చేయవచ్చని ట్యాక్స్ బడ్డీ.కామ్ వ్యవస్థాపకుడు సుజిత్ బం గర్ తెలిపారు. 

జీతం పొందుతున్న ఉద్యోగులు తమ యజమానుల నుంచి ఫాం 16ను పొందాల్సి ఉంటుంది. ఇది ఐటీఆర్ దాఖలు చేయడంలో సహాయపడుతుంది. యజమానులు తమ ఉద్యోగులకు ఫాం 16ను అందించేచివరి తేదీని కూడా పొడగించారు. 

ఇన్కంట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఆర్థిక సంవత్సరం ముగిసిన తరువాత ప్రతీ ఏడాది జూన్ 15వ తేదీకి ముందు ఫాం 16 అందజేయాల్సి ఉంటుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సీబీడీటీ ఫారం 15 జారీ చేయడానికి గడువు తేదీని పొడగించారు. ఉద్యోగికి ఫాం 16 జారీ చేయడానికి యాజ మాన్యానికి కొత్త గడువును జులై 31, 2021 వరకు పొడగించినట్టు తెలిపారు.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.