NEP అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ రాష్ట్రంలో విద్యారంగ సంస్కరణలు భేష్ - ఎపి చైర్మన్ కస్తూరి రంగన్
NEP అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ రాష్ట్రంలో విద్యారంగ సంస్కరణలు భేష్ - ఎపి చైర్మన్ కస్తూరి రంగన్
రాష్ట్రంలో విద్యారంగ సంస్కరణలు భేష్ అని జాతీయ విద్యావిధానం - 2020 చైర్మన్ కస్తూరి రంగన్ పేర్కొన్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆధ్వర్యాన '21వ శతాబ్దంలో శక్తిమంతమైన సమాజ నిర్మాణం' అంశంపై వీడియో కాన్ఫరెన్స్ శనివారం జరిగింది.
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి రంగన్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యార్థుల్లో నూతన సృజన, విజ్ఞానం, క్రమశిక్షణ పెరిగే ఎపిని పరిచయం చేశామన్నారు.
దేశవ్యాప్తంగా విద్యారంగ పురోభివృద్ధికి దోహదపడే పలు అంశాలు ఉన్నాయని పేర్కొన్నారు. మంత్రి సురేష్ మాట్లాడుతూ ప్రతిఏటా రూ.30 వేల కోట్లు విద్యారంగానికి కేటాయిస్తున్నామని చెప్పారు.
సమాజంలో పేదరికాన్ని రూపుమాపే దిశగా విద్యావ్యవస్థను ఆధునికీకరిస్తున్నామని పేర్కొన్నారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ జనరల్ ప్రెసిడెంట్ విజయలక్ష్మి సక్సేనా, ఎస్ఆర్ఎం విసి విఎస్ఆవు, రిజిస్ట్రార్ వినాయక్ తదితరులు పాల్గొన్నారు.
గతేడాది అమల్లోకి వచ్చిన జాతీయ విద్యావిధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాల్సి ఉండగా.. కరోనా కారణంగా పలు రాష్ట్రాలు ఇంకా అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో విద్యావిధానాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ పేరు తెచ్చుకుంది. దీంతో జాతీయ విద్యావిధానం 2020కు ఛైర్మన్ గా వ్యవహరించిన కస్తూరి రంగన్ ఇవాళ ఏపీ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు.
కరోనా సమయంలో విద్యావిధానం అమలు రాష్ట్రాలకు కష్టసాధ్యంగా మారిన పరిస్ధితుల్లో ఏపీ ప్రభుత్వం మాత్రం దీన్నో సవాల్ గా తీసుకుని అమలు చేసింది. దీంతో జాతీయ విద్యావిధానం అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ రికార్డుల్లోకి ఎక్కింది. విద్యారంగ సంస్కరణల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం దీన్ని అమలు చేసింది. దీనిపై ఇవాళ జరిగిన 11వ యూనివర్సిటీ డిస్టింగ్విష్డ్ లెక్చర్ కార్యక్రమంలో జాతీయ విద్యావిధానం 2020 ఛైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ ప్రశంసలు కురిపించారు.
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.