Wednesday, 14 July 2021

UGC New Rules అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ల నియామ‌కానికి పీహెచ్‌డీ త‌ప్ప‌నిస‌రి

UGC New Rules అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ల నియామ‌కానికి పీహెచ్‌డీ త‌ప్ప‌నిస‌రి స్పష్టం చేసిన యూజీసీ 2018లో యూనివ‌ర్సిటీల్లో బోధ‌నా సిబ్బంది నియామ‌కాల‌పై యూజ

UGC New Rules అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ల నియామ‌కానికి పీహెచ్‌డీ త‌ప్ప‌నిస‌రి స్పష్టం చేసిన యూజీసీ 2018లో యూనివ‌ర్సిటీల్లో బోధ‌నా సిబ్బంది నియామ‌కాల‌పై యూజీసీ కొత్త నిబంధ‌న‌ల‌ను ప్ర‌క‌టించి


UGC New Rules అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ల నియామ‌కానికి పీహెచ్‌డీ త‌ప్ప‌నిస‌రి


ఇక‌పై పీహెచ్ డీ ఉంటేనే యూనివ‌ర్సిటీల్లో టీచింగ్ పోస్టుల‌కు అర్హ‌త ఉంటుంది. యూనివ‌ర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ (ఎంట్రీలెవెల్‌) పోస్ట‌లుకు పీహెచ్‌డీ త‌ప్ప‌నిస‌ర‌ని యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ (యూజీసీ) స్ప‌ష్టం చేసింది. ఇప్పటి నుంచి నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్‌) అర్హ‌త‌తో యూనివ‌ర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేర‌డం కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పింది. 




ఇప్ప‌టివ‌ర‌కు యూనివ‌ర్సిటీల్లో, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు, అసోసియేట్ ప్రొఫెస‌ర్లను నేరుగా నియ‌మించ‌డానికి మాస్ట‌ర్ డిగ్రీతోపాటు నెట్‌లో అర్హ‌త‌, పీహెచ్‌డీని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ అర్హ‌తలు ఉన్న‌వారు అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అవ‌కాశం ఉండేది. ఇందులో నెట్ పాసైన‌వారికి ఐదు నుంచి ప‌ది మార్కులు వెయిటేజ్ ఇస్తుండ‌గా పీహెచ్‌డీ చేసిన‌వారికి 30 మార్కులు వెయిటేజీ ఇచ్చేవారు.

2018లో యూనివ‌ర్సిటీల్లో బోధ‌నా సిబ్బంది నియామ‌కాల‌పై యూజీసీ కొత్త నిబంధ‌న‌ల‌ను ప్ర‌క‌టించింది. ‘ఇక‌పై వ‌ర్సిటీల్లో బోధ‌నా సిబ్బంది నియామ‌కానికి పీహెచ్‌డీ చేసిన‌వారు మాత్ర‌మే అర్హులు. ఈ నిబంధ‌న అమ‌లుకు మూడేళ్ళ స‌మ‌యం ఇస్తున్నాం. 2021 నుంచి ఈ నిబంధ‌న‌ను క‌చ్చితంగా అమ‌లుచేస్తాం’ అని అప్ప‌టి కేంద్ర‌మంత్రి జ‌వ‌దేక‌ర్ ప్ర‌క‌టించారు.

ఇక కాలేజీల బోధ‌న సిబ్బంది భ‌ర్తీకి మాస్ట‌ర్స్ డిగ్రీతోపాటు నెట్ లేదా పీహీచ్‌డీ ఉంటే చాలు. అంటే యూనివ‌ర్సిటీల్లో పోస్ట‌ల భ‌ర్తీకి, కాలేజీల్లో లెక్చ‌ర‌ర్ పోస్టుల భ‌ర్తీకి యూజీసీ వేరువేరు అర్హ‌త‌ల‌ను నిర్దేశించింది. 

కేవ‌లం పాఠాలు చెప్ప‌డానికే ప‌రిమితం కాకుండా ప‌రిశోధ‌నా రంగంలోనూ ఆస‌క్తి చూప‌డానికి వీలుగా కాలేజీ లెక్చ‌రర్ల‌కు ఈ నిబంధ‌న విధించారు. అలాగే వ‌ర్సిటీల్లో బోధ‌నా ప్ర‌మాణాలు పెంచేందుకు కూడా యూజీసీ ప‌లు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇందులో అక‌డ‌మిక్ ప‌ర్ఫార్మెన్స్ బేస్డ్ అప్రైజల్ ప‌ద్ధ‌తి స్థానంలో గ్రేడింగ్ విధానానికి మొగ్గు చూపింది. ఇందులో రీసెర్చ్ స్కోర్‌ను ఒక ప్ర‌ధాన అంశంగా ప్ర‌క‌టించింది.

గ‌తంలోని అప్రైజల్ విధానం కాలేజీ లెక్చరర్ల ప‌రిశోధ‌న‌ల‌ను ప్రోత్స‌హించేదిగా ఉండేది. మారిన నిబంధ‌న‌ల‌తో క‌ళాశాల అధ్యాప‌కులు బోధ‌న‌పై మ‌రింత దృష్టిసారించాల్సి ఉంటుంది. అదే స‌మ‌యంలో వ‌ర్సిటీల్లో ప్రొఫెస‌ర్లు అటు టీచింగ్ తోపాటు ఇటు రీసెర్చ్‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన కొత్త ప‌ద్ధ‌తులను యూజీసీ అమ‌ల్లోకి తెస్తోంది. అయితే కాలేజీ అధ్యాప‌కుల‌కు ప‌దోన్న‌తులు క‌ల్పించేట‌ప్పుడు బోధ‌నా నైపుణ్యాన్ని ప్ర‌ధానంగా పరిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.