Friday, 6 August 2021

గురువారం (05-08-2021) మధ్యాహ్నం 3గంటల నుండి 5గంటల వరకు MEOలతో నిర్వహించిన వెబెక్స్ మీటింగ్ నందు ముఖ్య అంశములు

గురువారం (05-08-2021) మధ్యాహ్నం 3గంటల నుండి 5గంటల వరకు MEOలతో నిర్వహించిన వెబెక్స్ మీటింగ్ నందు ముఖ్య అంశములు

గురువారం (05-08-2021) మధ్యాహ్నం 3గంటల నుండి 5గంటల వరకు MEOలతో నిర్వహించిన వెబెక్స్  మీటింగ్ నందు ముఖ్య అంశములు


గురువారం (05-08-2021) మధ్యాహ్నం 3గంటల నుండి 5గంటల వరకు MEOలతో నిర్వహించిన వెబెక్స్  మీటింగ్ నందు ముఖ్య అంశములు


JVK కిట్స్, MDM &  నాడు - నేడు పరిశీలన అధికారిగా ప్రకాశం జిల్లాకు డైరెక్టర్ పార్వతి మేడం గారిని నియమించడమైనది.




ఈ సందర్భంగా ఈరోజు నిర్వహించిన వెబెక్స్ మీటింగ్ లో గౌరవనీయులైన పార్వతి మేడం గారు డిఈఓ గారు తెలిపినటువంటి అంశములను ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అనుసరించగలరు.

నాడు నేడు పాఠశాలలు పైన తెలిపిన ఎక్సెల్ షీట్ నందు మీ పాఠశాల బ్యాలెన్స్ పరిశీలించి  మీ వద్దనున్న ACTUAL  BALANCE వివరములను రేపు (06-08-2021)శుక్రవారం ఉదయం 10 గంటల లోపు MRC లో తెలియజేయాలి.

అన్ని నాడు నేడు పాఠశాలలు తప్పనిసరిగా  నాడు నేడు అభివృద్ధి పనులను కాంపోనెంట్ వారీగా ఆల్బమ్ తయారు చేసి  ఒక కాపీని ఎంఆర్సిలో ఇవ్వాలి. ఉన్నతాధికారుల సందర్శన నిమిత్తం మరియు EDUCATION MINISTER గారికి చూపించుట కొరకు అన్ని నాడు నేడు పాఠశాలల నుండి తప్పనిసరిగా ఈనెల 9వ తారీఖు లోపు ఆల్బమ్ సిద్ధం చేసి అందించాలి.

నాడు నేడు పాఠశాలలను పార్వతి మేడం గారు రేపటి నుండి ఆకస్మికంగా సందర్శించనున్నారు కావున సంబంధిత నాడు నేడు రికార్డులను భద్రపరిచి సందర్శనకు సంసిద్ధంగా ఉండగలరు.

నాడు నేడు పాఠశాలల్లో ఇటీవల ప్రత్యేక అధికారుల తనిఖీలో కనిపించినటువంటి లోపాలను సరిచేసి సదరు మార్పులను మీ మీ సిఆర్పిలకు  వాట్సప్ చేయాలి. ప్రత్యేక అధికారులు గుర్తించిన లోపాలను సరిచేసినట్లు డిక్లరేషన్ తయారుచేసి వాట్సాప్ పంపించిన తర్వాత మాత్రమే అప్లోడ్ చేయబడును. గుర్తించిన లోపాలకు సంబంధించి సవరణ  అంశాలను  పార్వతి మేడం గారు పరిశీలించనున్నారు.

ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విలీనం చేయబడిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి నూతన విద్యా విధానంపై అవగాహన కలిగించాలి

MRC నుండి  ఇప్పటివరకు NT BOOKS, UNIFORM తీసుకువెళ్ళని వారు వెంటనే తీసుకుని కాంప్లెక్స్ వారిగా అందించిన JVK కిట్లను పాఠశాలలో భద్రపరచాలి.ఆగస్టు 16 న పాఠశాలలు ప్రారంభించనున్న నేపథ్యంలో JVK కిట్లను సిద్ధంగా ఉంచుకోవాలి.

యూనిఫామ్ పంపిణీ సమయంలో  గత విద్యా సంవత్సరంలో మీ పాఠశాలలో చదివిన 5వ తరగతి విద్యార్థులకు అదే పాఠశాలలో పంపిణీ చేయాలి.

అన్ని పాఠశాలలు తప్పనిసరిగా బేస్ లైన్ పరీక్షలను నిర్వహించి ఆన్లైన్ అప్లోడ్ చేయాలి.

JVK కిట్లు తీసుకున్న అన్ని కాంప్లెక్స్ పాఠశాలలు ఏ ఏ వస్తువులు ఎన్ని తీసుకున్నది, ఏయే  పాఠశాలకు ఎన్ని ఇచ్చినది వివరములు రికార్డులో  నమోదు చేసి సదరు ప్రతులను MRC లో అందించాలి.

డ్రై రేషన్ లో భాగంగా దాల్, ఎగ్స్ తదితర వివరములను  పారదర్శకంగా రికార్డులలో నమోదు చేయాలి, అన్ని రకాల అక్విటెన్న్స్ భద్రపరచాలి.

అమ్మ ఒడి విరాళం సేకరించిన పాఠశాలలు పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చిన పారితోషికాన్ని   రికార్డెడ్ గా నమోదు చేసి రసీదును భద్రపరచుకోవాలి.

గమనిక : ఉపాధ్యాయులు తప్పనిసరిగా సమయపాలన పాటించగలరు.  ఉన్నతాధికారుల తనిఖీల్లో గైర్హాజరు మరియు  సమయపాలన పాటించని ఉపాధ్యాయులపై చర్యలు చేపట్టనున్నారని తెలియజేయడమైనది.

MRC సిబ్బంది ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 5 గంటల వరకు తప్పనిసరిగా మండల కార్యాలయం లో ఉండాలి.

సిఆర్పిలు పై అంశములను పూర్తిగా పరిశీలించి మీ కాంప్లెక్స్ లో ఎటువంటి పెండింగు లేకుండా చూడాలి ,అలాగే అన్ని సమాచారాలను సకాలంలో అందించాలి.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.