ఆగస్ట్ 15న విడుదల కానున్న 5జీ నెట్ వర్క్ గురించి ఆసక్తికర విషయాలు? ఇంటర్నెట్ టెస్టింగ్‌లో గ్లోబల్ లీడర్ 'ఓక్లా' మనదేశంలో ఇంటర్నెట్ వినియోగం ఆసక‍్తికర వ్యాఖ్యలు చేసింది. 5జీ వినియోగంతో మనదేశంలో ఇంటర్నెట్ వేగం 10టైమ్ కంటే ఎక్కువగా ఉంటుందని తెలిపింది
ఆగస్ట్ 15న విడుదల కానున్న 5జీ నెట్ వర్క్ గురించి ఆసక్తికర విషయాలు?
ఆగస్ట్ 15 సందర్భంగా ప్రధాని మోదీ 5జీ నెట్ వర్క్‌ను అధికారికంగా ప్రారంభిస్తారంటూ టెలికాం నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు 5జీ నెట్ వర్క్ వినియోగంతో భారత్ లో హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ రంగాలకు తిరుగుండదనే కథనాలు ప్రసారం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ టెస్టింగ్‌లో గ్లోబల్ లీడర్ 'ఓక్లా' మనదేశంలో ఇంటర్నెట్ వినియోగంపై ఆసక‍్తికర వ్యాఖ్యలు చేసింది. 5జీ వినియోగంతో మనదేశంలో ఇంటర్నెట్ వేగం 10టైమ్ కంటే ఎక్కువగా ఉంటుందని తెలిపింది
ఇండియన్ టెక్నాలజీపై చైనా యాప్స్ ప్రభావం
ఇండియా - చైనా సరిహద్దు వివాదం కారణంగా కేంద్రం డ్రాగన్ కంట్రీకి చెందిన సుమారు 200యాప్స్ పై బ్యాన్ విధించింది. దీంతో ఇండియన్ టెలికాం కంపెనీలు 5జీ నెట్ వర్క్ స్థాపించేందుకు సొంతంగా హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ లను తయారు చేసే పనిలో పడ్డాయి. అందుకోసం ఎరిక్సన్, నోకియా, శాంసంగ్, క్వాల్ కమ్ వంటి టెక్ కంపెనీలతో హార్డ్ వేర్ లను తయారు చేసుందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అయితే చైనాకు చెందిన హువావే, జెడ్‌టీఈ సంస్థలు భారత్‌లో 5జీ నెట్ వర్క్ ఏర్పాటు కోసం కేంద్రంతో ఒప‍్పందాలు కుదుర్చుకునేందుకు పోటీ పడ్డాయి. కానీ కేంద్రం సున్నితంగా తిరస్కరించి దేశీ పరిజ్ఞానంతో 5జీ నెట్ వర్క్ లను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం సమాచార నిపుణుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ ప్రకాష్ సాహ్నీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇండియాలో 5జీ నెట్ వర్క్ వినియోగం
2020 థాయిలాండ్, ఫిలిప్పిన్స్‌లో 5జీ నెట్ వర్క్ ప్రారంభమైంది. ఓక్లా అంచనా ప్రకారం..ప్రస్తుతం ఉన్న 4జీ ఎల్ టీఈ(Long-Term Evolution) నెట్ వర్క్ కంటే 5జీ స్పీడుగా ఉంటుందని, దాన్ని బేస్ చేసుకొని 2021 ఏప్రిల్ నాటికి దాని వేగం 9రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పింది. ఇదే సమయంలో భారత్ లో విడుదల కానున్న 5జీ నెట్ వర్క్ వేగం ఎక్కువగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.
2021 మార్చిలో 52.9 శాతం నుండి జూన్ నాటికి 64.5 శాతం మంది 4G వినియోగదారులు 5ఎంబీపీఎస్ కంటే ఎక్కువగా వీడియోల్ని డౌన్‌లోడ్ చేస్తున్నారని, దీన్ని బట్టి ఇండియన్ ఇంటర్నెట్ యూజర్లు 5G నెట్ వర్క్‌ను ఎలా వినియోగిస్తారో చెప్పడం అసాధ్యం. అయితే దేశ వ్యాప్తంగా 5G నెట్ వర్క్ వినియోగం పెరిగిపోతుందని ఓక్లా ప్రతినిధులు వెల్లడించారు.
మనదేశంలో జియో నెట్ వర్క్ వినియోగం అంతకంతకూ పెరిగిపోతుంది. ఆ జియో నెట్ వర్క్ డౌన్‌లోడ్ వేగం మార్చి 2021లో 5.96 Mbps నుండి జూన్‌లో 13.08 Mbps కి పెరిగింది.
ప్రస్తుతం, యూకే,యూఎస్ వంటి దేశాల్లో 5 నెట్ వర్క్‌ను విస్తరించే పనిలోపడ్డారు. ఆ విషయంలో భారత్ వెనకబడినా.. ఇటీవల కాలంలో 5జీ నెట్ వర్క్ ఏర్పాటు కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నట‍్లు ఓక్లా గుర్తించింది.
5జీ నెట్ వర్క్ ఆలస్యం వల్ల ఆపరేటర్లకు లబ్ధి చేకూరుతుందని, తక్కువ ఖర్చుతో నెట్‌వర్క్ ఎక్విప్ మెంట్ కొనుగోలు చేయవచ్చు. ఇండియన్ ఆపరేట్లు ఓపెన్ ర్యాన్ నెట్ వర్క్ (open radio access network architecture) వల్ల 5జీ నెట్ వర్క్ ఏర్పాటుకు అయ్యే ఖర్చు తగ్గిపోతుందని ఓ ఇంటర్నెట్ టెస్టింగ్ గ్లోబల్ లీడర్ ఓక్లా అంచనా వేసింది.
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.