Monday, 16 August 2021

ఒక్క రోజే 2 వేల మంది పిల్లలు కరోనాతో ఆస్పత్రిపాలు డెల్టా ఉధృతితో అమెరికాలో పరిస్థితిది

ఒక్క రోజే 2 వేల మంది పిల్లలు కరోనాతో ఆస్పత్రిపాలు డెల్టా ఉధృతితో అమెరికాలో పరిస్థితిది

ఒక్క రోజే 2 వేల మంది పిల్లలు కరోనాతో ఆస్పత్రిపాలు డెల్టా ఉధృతితో అమెరికాలో పరిస్థితిది


ఒక్క రోజే 2 వేల మంది పిల్లలు కరోనాతో ఆస్పత్రిపాలు డెల్టా ఉధృతితో అమెరికాలో పరిస్థితిది


వాషింగ్టన్‌, న్యూఢిల్లీ, ఆగస్టు 15: అమెరికాలో ఒక్కరోజే రెండువేల మంది పిల్లలు కరోనాతో ఆస్పత్రిలో పాలయ్యారు. దక్షిణాది రాష్ట్రాల్లో అయితే దాదాపు ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోయాయి. ఇదీ అమెరికాలో ప్రస్తుత పరిస్థితి. 




డెల్టా వేరియంట్‌తో అగ్ర రాజ్యంలో కొన్ని వారాలుగా రోజుకు 1.30 లక్షలపైగా కేసులు నమోదవుతున్నాయి. దీనికి తగ్గట్లే ఆస్పత్రుల్లో చేరికలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు. ఎన్నడూలేని విధంగా శనివారం 2 వేల మంది పిల్లలు చికిత్స కోసం చేరారు. 

ప్రస్తుతం అమెరికాలో కరోనాతో ఆస్పత్రుల్లో ఉన్న రోగుల్లో 2.5 శాతం మంది చిన్నారులే కావడం గమనార్హం. దేశంలో 12 ఏళ్ల పైబడినవారికి టీకా పంపిణీ చేయడం లేదు. దీనిపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ఈ నెలలోనే విద్యా సంస్థలు ప్రారంభం కానుండటంతో విద్యార్థులు మాస్క్‌లు ధరించాలా? లేదా? అని సందిగ్ధత నెలకొంది. ఫ్లోరిడా, టెక్సాస్‌, ఆరిజోనా రాష్ట్రాల్లో విద్యార్థులు మాస్క్‌లు కచ్చితంగా ధరించాల్సిందేనని ఆదేశాలిచ్చారు. 

అమెరికాలో రెండు వారాలతో పోలిస్తే కేసులు రెట్టింపయ్యాయి. రోజుకు 600 మందిపైగా చనిపోతున్నారు.  ఫ్లోరిడాలో కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉంది. శనివారం ఏకంగా 16 వేల మంది చికిత్సకు చేరారు. కాగా భారత్‌లో కొత్తగా 36,083 మందికి వైరస్‌ నిర్ధారణ అయినట్లు కేంద్రం తెలిపింది. 

కొవిడ్‌తో మరో 493 మంది చనిపోయినట్లు పేర్కొంది. శనివారం 38 వేలమందిపైగా కోలుకున్నారు. 19.23 లక్షల పరీక్షలు చేశారు.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.