నేడు టెన్త్ ఫలితాలు సాయంత్రం 5కు ప్రకటించనున్న మంత్రి డా. సురేష్
నేడు టెన్త్ ఫలితాలు సాయంత్రం 5కు ప్రకటించనున్న మంత్రి
అమరావతి, కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలు రద్దయిన నేపథ్యంలో సుదీర్ఘ కసరత్తు అనంతరం విద్యార్థుల ఇంటర్నల్స్ మదింపు ఆధారంగా సిద్ధం చేసిన ఫలితాలను శుక్రవారం విడుదల చేయనున్నారు.
విజయవాడలోని ఆర్ అండ్ బీ భవన సముదాయంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు విద్యాశాఖ మంత్రి డా. ఆదిమూలపు సురేష్ ప్రకటించనున్నారు.
విశ్రాంత ఐఏఎస్ చాయారతన్ నేతృత్వంలోని హైపవర్ కమిటీ పది ఫలితాలపై అన్ని రకాలుగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఆ సిఫార్సులకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడంతో.. 'మెమొరాండమ్ ఆఫ్ సబ్జెక్ట్ వైస్ పెర్ఫార్మెన్స్'గా గతేడాది మార్చి 2020, ఈ ఏడాది జూన్ 2021కి సంబంధించిన ఫలితాలు విడుదల చేయనున్నారు.
మంత్రి డా. సురేష్ ఫలితాలు ప్రకటించిన వెంటనే విద్యార్థులు విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు. అలాగే పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ స్కూల్ లాగిన్ ద్వారా 'మెమొరాండమ్ ఆఫ్ సబ్జెక్ట్ వైస్ పెర్ఫార్మెన్స్ రిపోర్టులను డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు ఎ. సుబ్బారెడ్డి సూచించారు.
డౌన్లోడ్ చేసిన సర్టిఫికెట్లను ప్రధానోపాధ్యాయులు అటెస్ట్ చేసి విద్యార్థులకు అందజేయాలని తెలిపారు. ఇదిలా ఉంటే పరీక్షల రద్దు నేపథ్యంలో స్లిప్ టెస్టుల మార్కులను 70 శాతం, ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షల నుంచి 30 శాతం వెయిటేజ్ రెగ్యులర్ విద్యార్థులకు మార్కులు కేటాయిస్తున్నారు.
ఓపెన్ స్కూల్ సొసైటీలో చదువుతున్న ప్రైవేట్ విద్యార్థులకు కూడా ప్రిపరేటివ్ ఎగ్జామ్స్ మార్కుల ఆధారంగా ఫలితాలు ఇవ్వనున్నారు.
Get Download SSC March 2020/June 2021 offer 5:00 PM Click here
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.