సాధారణ జలుబు స్థాయికి తగ్గనున్న కొవిడ్ మహమ్మారిలా విజృంభిస్తున్న కొవిడ్-19 ప్రభావం వచ్చే కొన్నేళ్లలో బాగా తగ్గిపోనుంది. సాధారణ జలుబు కలిగించే ఇతర కరోనా వైరస్‌ల తరహాలో అది ఎప్పటికీ ప్రపంచంలో ఉండిపోనుంది.
సాధారణ జలుబు స్థాయికి తగ్గనున్న కొవిడ్
వాషింగ్టన్: ప్రస్తుతం మహమ్మారిలా విజృంభిస్తున్న కొవిడ్-19 ప్రభావం వచ్చే కొన్నేళ్లలో బాగా తగ్గిపోనుంది. సాధారణ జలుబు కలిగించే ఇతర కరోనా వైరస్‌ల తరహాలో అది ఎప్పటికీ ప్రపంచంలో ఉండిపోనుంది.
ఆ స్థితిలో టీకా పొందని లేదా ఇప్పటివరకూ కరోనా ఇన్‌ఫెక్షన్‌కు గురికాని పిల్లలపైనే ఎక్కువగా ప్రభావం చూపుతుంది. అమెరికా-నార్వే పరిశోధకుల మోడలింగ్‌లో ఈ మేరకు తేలింది.
చిన్నారుల్లో కొవిడ్ తీవ్రత ఒకింత తక్కువగానే ఉండటం వల్ల కొవిడ్ కారక సార్స్-కోవ్-2 వైరస్.. ప్రపంచ జనాభాలో ఎప్పటికీ ఉండేలా రూపాంతరం చెందినప్పటికీ పెద్దగా ఇబ్బంది ఉండబోదని శాస్త్రవేత్తలు చెప్పారు.
మొత్తంమీద ఈ వైరస్ వల్ల సమాజంపై పడే భారం తగ్గుతుందని పేర్కొన్నారు. ‘‘వయసు పెరిగేకొద్దీ కొవిడ్ తీవ్రత కూడా పెరుగుతుందని ఆ వ్యాధి తీరు తెన్నులను బట్టి స్పష్టమవుతోంది. అయితే పెద్దలు టీకాలు వేయించుకోవడం లేదా ఇప్పటికే ఒకసారి వైరస్ బారినపడటం వల్ల కరోనా ముప్పు క్రమంగా పిల్లలవైపు మళ్లుతుందని మా మోడలింగ్‌లో వెల్లడైంది.
ఇతర కరోనా వైరస్‌లు, ఇన్‌ఫ్లూయెంజాల విషయంలోనూ ఇలానే జరిగింది. అవి కూడా తొలుత జోరును ప్రదర్శించి, ఆ తర్వాత ఎప్పటికీ ప్రజల్లో ఉండిపోయే (ఎండెమిక్)లా మారాయి. 1889-1890 లో వచ్చిన రష్యన్ ఫ్లూ వల్ల 10 లక్షల మంది చనిపోయారు వారిలో ఎక్కువ మంది 70 ఏళ్లు పైబడినవాళ్లే. ఆ వ్యాధి కారక ‘హెచ్‌సీఓవీ-ఓసీ43’ వైరస్ ఇప్పుడు సర్వ సాధారణమైపోయింది. ఇది స్వల్పస్థాయి జలుబు కలిగించే స్థాయికి తగ్గిపోయింది. అది కూడా ఎక్కువగా 7-12 నెలల చిన్నారులపై ప్రభావం చూపుతోంది’’ అని నార్వే శాస్త్రవేత్త ఒటార్ జోర్న్‌స్టడ్ పేర్కొన్నారు.
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.