Wednesday, 18 August 2021

పాఠశాలల్లోనే టెస్టింగ్ కేంద్రాలు కర్ఫ్యూ గంట కుదింపు కోవిడ్ సమీక్షలో సిఎం

పాఠశాలల్లోనే టెస్టింగ్ కేంద్రాలు కర్ఫ్యూ గంట కుదింపు కోవిడ్ సమీక్షలో సిఎం

పాఠశాలల్లోనే టెస్టింగ్ కేంద్రాలు కర్ఫ్యూ గంట కుదింపు కోవిడ్ సమీక్షలో సిఎం స్కూళ్లలో కోవిడ్  ప్రోటోకాల్ కంపల్సరీ ఇకపై పెళ్లిళ్లకు 150 మందికే అనుమతి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు రాత్రి 11 గంటల వరకు కర్న్యూ సడలింపు కోవిడ్ నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష అవసరమైన విద్యార్థులకు అక్కడే పరీక్ష నిర్వహించాలి ప్రతిఒక్కరూ మాస్క్ ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు 


పాఠశాలల్లోనే టెస్టింగ్ కేంద్రాలు కర్ఫ్యూ గంట కుదింపు కోవిడ్ సమీక్షలో సిఎం 


పాఠశాలల్లోనే కరోనా టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, అవసరమైన విద్యార్థులకు అక్కడే పరీక్ష నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాలలు వైద్యారోగ్యశాఖ మార్గదర్శకాలు పాటించేలా అధికారులు దృష్టి పెట్టాలన్నారు. 




ప్రతిఒక్కరూ మాస్క్ ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు నిర్వహించాలన్నారు.

 రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 16వ తేదీ నుండి పాఠశాలలను తెరిచినందున ఆయా పాఠశాలల్లో కోవిడ్ ప్రోటోకాల్స్ సమర్థవంతంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం కోవిడ్ -19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్పై సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి పాఠశాలలోనూ వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను తూ.చ. తప్పకుండా పాటించేలా అధికారులు దృష్టిపెట్టాలని స్పష్టం చేశారు. మాస్క్లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజ్ చేసుకోవడం వంటి చర్యలు విధిగా తీసుకోవాలన్నారు. 

అదేవిధంగా పాఠశాలల్లో టెస్టింగ్కు కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒకవేళ ఎవరికైనా లక్షణాలు. కనిపిస్తే వెంటనే పరీక్షలు చేసేలా ఏర్పాట్లు ఉం డాలన్నారు. థర్డ్వేవ్ నేపథ్యంలో ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలను దృష్టిలో ఉంచుకుని సకల చర్య లు తీసుకోవాలన్నారు. ఇందులో భాగంగా వ్యాక్సినేషన్లో గ్రామ, వార్డు సచివాలయాన్ని ఒక యూనిట్గా తీసుకోవాలని తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్ ఇచ్చుకుంటూ వెళ్లాలని ఆదేశించారు. 

ఉదయం 6 గంటలనుంచి రాత్రి 11 గంటలవరకూ కర్ప్యూ సడలింపులు ఇస్తున్నట్లు తెలిపారు. తెల్లవారు జామున పెళ్లిళ్లు ఉంటే ముందస్తుగా అనుమతి తీసుకోవాలని, పెళ్లిళ్ల లో 150 మందికే అనుమతి ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. 

ఈ కార్యాల్లో కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించేలా అధికారులు స్వయంగా పర్యవేక్షించాలని, ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

కర్ఫ్యూ సమయాన్ని గంట కుదిస్తున్నట్లు చెప్పారు. ఇక నుండి రాత్రి 11 గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందన్నారు. 

తెల్లవారుజామున పెళ్లిళు అంటే ముందస్తుగా అనుమతి తీసుకోవాలని, 150 మందికే అవకాశ ఇవ్వాలని సూచించారు. 

ప్రభుత్వం వద్ద ఔషధ కంపెనీల రిజిస్ట్రేషన్ అంశాన్ని కూడా పరిశీలించాలని ఆదేశించారు. 

నిర్దేశించిన 90 రోజుల్లో ప్రభుత్వాస్పత్రులు, బోధానాస్పత్రుల్లో రిక్రూట్మెంట్  పూర్తిచేయాలి.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.